రాముల వారికోసం శబరి ఎంత ఆర్తిగా ఎదురు చూసిందో రామకథ తెలిసిన మనందరికీ తెలుసు కానీ తనతో పాటు ఆ వనంలోని ప్రకృతి కూడా రాములవారికోసం ఎలా ఎదురు చూస్తుందో ఒక్క దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు మాత్రమే ఊహించగలరేమో. బాపు గారి దర్శకత్వంలో వచ్చిన సంపూర్ణ రామాయణం చిత్రం కోసం వారు రాసిన ఈ పాట ఎంత బాగుందో చూడండి. ఈ పాట వీడియో ఇక్కడ చూడవచ్చు లేదా ఎంబెడ్ చేయబడిన సినిమాను 1h:39m:15s వరకూ ఫార్వర్డ్ చేసి చూడవచ్చు. ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.
చిత్రం : సంపూర్ణ రామాయణం (1971)
సంగీతం : కె.వి. మహదేవన్
సాహిత్యం : దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం : సుశీల
ఊరికే కొలను నీరు ఉలికి ఉలికి పడుతుంది
ఓరగా నెమలి పింఛమార వేసుకుంటుంది
ఎందుకో ఎందుకో ప్రతి పులుఁగు యేదో చెప్పబోతుంది
వనములో చెట్టు చెట్టు కనులు విప్పి చూస్తుంది
ఉండుండీ నా ఒళ్ళు ఊగి ఊగి పోతుంది
అదిగో రామయ్య! ఆ అడుగులు నా తండ్రివి
ఇదుగో శబరీ! శబరీ! వస్తున్నానంటున్నవి
కదలలేదు వెర్రి శబరి ఎదురు చూడలేదని
నా కోసమే నా కోసమే నడచి నడచి నడచి
నా కన్నా నిరుపేద నా మహరాజు పాపం అదుగో
అసలే ఆనదు చూపు ఆ పై ఈ కన్నీరు
తీరా దయచేసిన నీ రూపు తోచదయ్యయ్యో
ఏలాగో.. నా రామా.. ఏదీ ఏదీ ఏదీ
నీల మేఘమోహనము నీ మంగళ రూపము
కొలను నడిగి తేటనీరు.. కొమ్మ నడగి పూల తేరు
గట్టు నడిగి.. చెట్టు నడిగి.. పట్టుకొచ్చిన ఫలాలు..
సంగీతం : కె.వి. మహదేవన్
సాహిత్యం : దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం : సుశీల
ఊరికే కొలను నీరు ఉలికి ఉలికి పడుతుంది
ఓరగా నెమలి పింఛమార వేసుకుంటుంది
ఎందుకో ఎందుకో ప్రతి పులుఁగు యేదో చెప్పబోతుంది
వనములో చెట్టు చెట్టు కనులు విప్పి చూస్తుంది
ఉండుండీ నా ఒళ్ళు ఊగి ఊగి పోతుంది
అదిగో రామయ్య! ఆ అడుగులు నా తండ్రివి
ఇదుగో శబరీ! శబరీ! వస్తున్నానంటున్నవి
కదలలేదు వెర్రి శబరి ఎదురు చూడలేదని
నా కోసమే నా కోసమే నడచి నడచి నడచి
నా కన్నా నిరుపేద నా మహరాజు పాపం అదుగో
అసలే ఆనదు చూపు ఆ పై ఈ కన్నీరు
తీరా దయచేసిన నీ రూపు తోచదయ్యయ్యో
ఏలాగో.. నా రామా.. ఏదీ ఏదీ ఏదీ
నీల మేఘమోహనము నీ మంగళ రూపము
కొలను నడిగి తేటనీరు.. కొమ్మ నడగి పూల తేరు
గట్టు నడిగి.. చెట్టు నడిగి.. పట్టుకొచ్చిన ఫలాలు..
~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~
ఇదే సినిమాలో గుహుడు పాడే ఈ పాట తెలియని తెలుగువారుండరేమో కదా, రాముడి పాటలలో నాకు చాలా ఇష్టమైన పాట. గుహుడు అమాయకమైన మాటలతో శ్రీరాముని కీర్తించడాన్ని కొసరాజు గారు భలే రాశారు. చిత్రీకరణ సైతం నాకు చాలా ఇష్టం చివరిలో పడవవేగానికి తుళ్ళిపడిన జానకమ్మని సముదాయించి రాములవారు నిదానించమని గుహుడికి సైగ చేయడం ఆపై తాళం మార్చి నిదానంగా హైలేస్సా అంటూ తెడ్డువేయడం చూడడానికి చాలా ముచ్చటగా ఉంటుంది. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.
చిత్రం : సంపూర్ణ రామాయణం (1971)
సంగీతం : కె.వి. మహదేవన్
సాహిత్యం : కొసరాజు
గానం : ఘంటసాల, కోరస్
రామయ తండ్రీ! ఓ రామయ తండ్రీ!
మా నోములన్ని పండినాయి రామయ తండ్రి
మా సామివంటే నువ్వేలే రామయ తండ్రి
రామయ తండ్రీ! ఓ రామయ తండ్రీ!
మా నోములన్ని పండినాయి రామయ తండ్రి
మా సామివంటే నువ్వేలే రామయ తండ్రి
తాటకిని ఒక్కేటున కూల్చావంట
శివుని విల్లు ఒక దెబ్బకే ఇరిశావంట
తాటకిని ఒక్కేటున కూల్చావంట
శివుని విల్లు ఒక దెబ్బకే ఇరిశావంట
పరశరాముడంతవోణ్ణి పారదరిమినావంట
ఆ కతలు సెప్పుతుంటే విని ఒళ్ళు మరిచిపోతుంట
రామయ తండ్రీ! ఓ రామయ తండ్రీ!
మా నోములన్ని పండినాయి రామయ తండ్రి
మా సామివంటే నువ్వేలే రామయ తండ్రి
ఆగు బాబూ ఆగు!
అయ్యా నే వత్తుండా, బాబూ నే వత్తుండ
అయ్యా నే వత్తుండా, బాబూ నే వత్తుండ
నీ కాలుదుమ్ము సోకి రాయి ఆడది అయినాదంట
నాకు తెలుసులే!
నా నావ మీద కాలు పెడితే యేమౌతాదో తంట
నీ కాలుదుమ్ము సోకి రాయి ఆడది అయినాదంట
నా నావ మీద కాలు పెడితే యేమౌతాదో తంట
దయజూపి ఒక్కసారి కాళ్ళు కడగనీయమంట
మూడు మూర్తులా నువ్వు నారాయణ మూర్తివంట
రామయ తండ్రీ! ఓ రామయ తండ్రీ!
మా నోములన్ని పండినాయి రామయ తండ్రి
మా సామివంటే నువ్వేలే రామయ తండ్రి
అందరినీ దరిజేర్చు మారాజువే
అద్దరినీ చేర్చమని అడుగుతుండావే
అందరినీ దరిజేర్చు మారాజువే
అద్దరినీ చేర్చమని అడుగుతుండావే
నువు దాటలేక కాదులే రామయ తండ్రీ
నువు దాటలేక కాదులే రామయ తండ్రీ
నన్ను దయజూడగ వచ్చావు రామయ తండ్రి
హైలెస్సా లేలో హైలెస్సా
హైలెస్సా లేలో హైలెస్సా
హైలెస్సా లేలో హైలెస్సా
హైలెస్సా లేలో హైలెస్సా
హైలెస్సా.. లేలో.. హైలెస్సా
హైలెస్సా.. లేలో.. హైలెస్సా ఓహోహో..ఓఓఓఓ
హైలెస్సా.. లేలో.. హైలెస్సా
హైలెస్సా.. లేలో.. హైలెస్సా
హైలెస్సా.. లేలో.. హైలెస్సా
2 comments:
లలిత లలితం గా హృదయాన్ని తాకే వర్ణన దేవులపల్లి వారి సొంతం..ఇక రామయ తండ్రీ ఎప్పుడు విన్నా..మనసు పడవతో 'పాటే' ప్రయాణం చేస్తుంది..
థాంక్స్ శాంతి గారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.