ఆదివారం, ఏప్రిల్ 20, 2014

ఈనాడే ఏదో అయ్యిందీ...

ఇళయరాజా గారి మీద అభిమానం పదింతలు పెరగడానికి దోహదం చేసిన పాటలలో ఇదీ ఒకటి...రెండవ చరణానికి ముందు వచ్చే మ్యూజిక్ బిట్ ఎన్ని లక్షల సార్లు విన్నా బోరు కొట్టకపోగా అదే పులకింత కలుగుతుంది. ఈ సినిమాలో రేవతి కూడా చాలా బాగుంటుంది. మీరూ ఈ పాట విని చూసీ ఆనందించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. 



చిత్రం : ప్రేమ (1989)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, చిత్ర

ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
ఈనాడే ఏదో అయ్యిందీ...ఏనాడూ నాలో జరగందీ
ఈ అనుభవం మరలా రానిదీ... ఆనంద రాగం మోగిందీ
అందాలా లోకం రమ్మందీ...

ఈనాడే ఏదో అయ్యిందీ... ఏనాడూ నాలో జరగందీ
నింగీ నేలా ఏకం కాగా...  ఈ క్షణమిలాగె ఆగిందీ
నింగీ నేలా ఏకం కాగా...  ఈ క్షణమిలాగె ఆగిందీ
ఒకటే మాటన్నదీ... ఒకటై పొమ్మన్నదీ
మనసే ఇమ్మన్నదీ...  అదినా సొమ్మన్నదీ
పరువాలు మీటి... న న న న న
సెలయేటీ తోటి... న న న న న
పాడాలీ నేడు... న న న న న
కావాలీ తోడు... న న న న న న న న ....
 
ఈనాడే ఏదో అయ్యిందీ ... ఏనాడూ నాలో జరగందీ

సూర్యుని మాపీ చంద్రుని ఆపీ.. వెన్నెల రోజంత కాసిందీ
సూర్యుని మాపీ చంద్రుని ఆపీ.. వెన్నెల రోజంత కాసిందీ

పగలూ రేయన్నదీ.... అసలే లేదన్నదీ
కలలే వద్దన్నదీ.... నిజమే కమ్మన్నదీ
ఎదలోనీ ఆశ... న న న న న
ఎదగాలి బాసై... న న న న న
కలవాలీ నీవు... న న న న న
కరగాలీ నేను... న న న న న న న న ....

ఈనాడే ఏదో అయ్యిందీ... ఏనాడూ నాలో జరగందీ
ఈ అనుభవం మరలా రానిదీ
ఆనందరాగం మోగిందీ... అందాలా లోకం రమ్మందీ

ఈనాడే ఏదో అయ్యిందీ... ఏనాడూ నాలో జరగందీ 

 


4 comments:

Undoubtedly a beautiful song. But for some reason, I like it's Hindi version which was also sung by Balu garu and the melody queen Chitra garu. Although SPB's Hindi diction some times itches the heart, Chitra's voice, presentation and expressions in this song are JUST WOW WOW WOW !!!

$

Thanks Sid గారు.. అవునండీ హిందీ వర్షన్ కూడా చాలా బాగుంటుంది.

రేవతి నా ఫేవరెట్ యాక్ట్ రెస్ వేణూజీ..థాంక్యూ సో మచ్..

థాంక్స్ శాంతి గారు. రేవతి వండర్ఫుల్ యాక్ట్రెస్ అండీ.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.