గోదావరంత అందమైనది మరేం ఉంటుంది చెప్పండి అందుకే ఈ అందమైన ప్రేమజంట తన ప్రేమను గోదావరితో పోల్చుకుంటూ ఆనందంగా ఎలా ఆడీ పాడుకుంటున్నారో మీరే చూడండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.
చిత్రం : నువ్వు లేక నేను లేను (2002)
సంగీతం : R.P.పట్నాయక్
సాహిత్యం : కులశేఖర్
గానం : R.P.పట్నాయక్, కౌసల్య
నిండు గోదారి కదా ఈ ప్రేమ
అందరికీ బంధువుగా ఈ ప్రేమ
రెండు హృదయాల కథే ఈ ప్రేమ
పెళ్లికిలా పల్లకిగా ఈ ప్రేమ
సంగీతం : R.P.పట్నాయక్
సాహిత్యం : కులశేఖర్
గానం : R.P.పట్నాయక్, కౌసల్య
నిండు గోదారి కదా ఈ ప్రేమ
అందరికీ బంధువుగా ఈ ప్రేమ
రెండు హృదయాల కథే ఈ ప్రేమ
పెళ్లికిలా పల్లకిగా ఈ ప్రేమ
కోవెలలో హారతిలా మంచిని పంచే ప్రేమ
నిండు గోదారి కదా ఈ ప్రేమ
అందరికీ బంధువుగా ఈ ప్రేమ
నిండు గోదారి కదా ఈ ప్రేమ
అందరికీ బంధువుగా ఈ ప్రేమ
ప్రేమ అన్నదీ ఎంత గొప్పదో మరీ
రాజు పేద బేధమంటు లేదు దీనికి
బ్రహ్మచారికీ బతుకు బాటసారికీ
ప్రేమదీపమల్లే చూపుతుంది దారినీ
మనసులు జత కలిపే బంధం ఈ ప్రేమ
చెరితగ ఇల నిలిచే గ్రంథం ఈ ప్రేమ
చెరితగ ఇల నిలిచే గ్రంథం ఈ ప్రేమ
ప్రేమే మదిలోన మరి నమ్మకాన్ని పెంచుతుంది
నిండు గోదారి కదా ఈ ప్రేమ
అందరికీ బంధువుగా ఈ ప్రేమ
నిండు గోదారి కదా ఈ ప్రేమ
అందరికీ బంధువుగా ఈ ప్రేమ
రెండు హృదయాల కథే ఈ ప్రేమ
పెళ్లికిలా పల్లకిగా ఈ ప్రేమ
పెళ్లికిలా పల్లకిగా ఈ ప్రేమ
ప్రేమ జోరునీ ఎవ్వరాపలేరనీ
ఆనకట్టలాంటి హద్దులంటూ లేవని
ఆనకట్టలాంటి హద్దులంటూ లేవని
ప్రేమ తప్పని అంటే ఒప్పుకోమనీ
గొంతు ఎత్తి లోకమంత చాటిచెప్పనీ
ప్రేమే తోడుంటే నిత్యం మధుమాసం
గొంతు ఎత్తి లోకమంత చాటిచెప్పనీ
ప్రేమే తోడుంటే నిత్యం మధుమాసం
తానే లేకుంటే బతుకే వనవాసం
ప్రేమే కలకాలం మనవెంట ఉండి నడుపుతుంది
ప్రేమే కలకాలం మనవెంట ఉండి నడుపుతుంది
నిండు గోదారి కదా ఈ ప్రేమ
అందరికీ బంధువుగా ఈ ప్రేమ
అందరికీ బంధువుగా ఈ ప్రేమ
రెండు హృదయాల కథే ఈ ప్రేమ
పెళ్లికిలా పల్లకిగా ఈ ప్రేమ
పెళ్లికిలా పల్లకిగా ఈ ప్రేమ
కోవెలలో హారతిలా మంచిని పంచే ప్రేమ
నిండు గోదారి కదా ఈ ప్రేమ
అందరికీ బంధువుగా ఈ ప్రేమ
అందరికీ బంధువుగా ఈ ప్రేమ
3 comments:
గోదారి అమ్మ కదా..ప్రేమించని వారుంటారా మరి..యెంత దూరాన ఉన్నా, యేడాది కొక్కసారైనా, ఆ నీటిని అదీ రాజమండ్రి తీరం లో తాకక పోతే రీఛార్జ్ కాలేమండీ..
థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతిగారు... గోదారి ఒడిలో పెరిగిన అందరికీ ఆ అభిమానం అనుబంధం అలా ఉంటుందేమో కదండీ :-)
rp patnaik kousalya worst singers. lyrics and tune okay.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.