మంగళవారం, జులై 28, 2015

కిన్నెరసాని వచ్చిందమ్మ...

కోటలాంటి ఇంటి నుండి ఎక్కడికీ కదలక చిన్నతనం నుండీ ఒక పగిలిన కిటికీ గుండా ప్రపంచాన్ని చూస్తూ గడిపిన రాణివాసపు చిన్నది.. మొదటిసారిగా ఆ కోటను దాటి పల్లెను దాటి ప్రకృతితో మమేకమై గోదావరి పరవళ్లతో పోటీగా తుళ్ళిపడుతుంటే.. విశ్వనాథ వారి కిన్నెరసాని అతని కళ్ళెదుట నిలిచిందట. ఆ వైనమేమిటో మీరే చూడండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : సితార (1983)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, ఎస్.పి.శైలజ

తననననన తననననన...
తననననన తననననన...
తననననన తననననన... తననననన


చమకు చమకు జింజిన జింజిన..
చమకు చమకు జిన్న జిన్న జిన్న..
కిన్నెరసాని వచ్చిందమ్మ వెన్నెల పైటేసి..
జమకు జమకు జింజిన జింజిన..
జమకు జమకు జిన్న జిన్న జిన్న.
.

కిన్నెరసాని వచ్చిందమ్మ వెన్నెల పైటేసి..
విశ్వనాధ పలుకై.. అది విరుల తేనెచినుకై..
కూనలమ్మ కులుకై.. అది కూచిపూడి నడకై..

పచ్చని చేలా.. తనననన..
పావడగట్టి.. తనననన
పచ్చని చేలా..  పావడగట్టి..
కొండమల్లెలే కొప్పునబెట్టి
వచ్చేదొరసాని.. మా వన్నెల కిన్నెరసాని

కిన్నెరసాని వచ్చిందమ్మ వెన్నెల పైటేసి..

కిన్నెరసాని వచ్చిందమ్మ వెన్నెల పైటేసి..

ఎండల కన్నె సోకని రాణి..
పల్లెకు రాణి పల్లవ పాణి..
కోటను విడిచీ.. పేటను విడిచీ..
కోటను విడిచీ.. పేటను విడిచీ..
కనులా గంగా పొంగే వేళ..
నదిలా తానే సాగే వేళ..
రాగాల రాదారి పూదారి ఔతుంటే..
ఆ రాగాల రాదారి పూదారి ఔతుంటే..


కిన్నెరసాని వచ్చిందమ్మ వెన్నెల పైటేసి..
కిన్నెరసాని వచ్చిందమ్మ వెన్నెల పైటేసి..

మాగాణమ్మా చీరలు నేసే..
మలిసందెమ్మ కుంకుమ పూసే..
మువ్వలబొమ్మా.. ముద్దులగుమ్మా..
మువ్వలబొమ్మా.. ముద్దులగుమ్మా..

గడపా దాటి నడిచే వేళ..
అదుపే విడిచీ ఎగిరే వేళ..
వయ్యారి అందాలు.. గోదారి చూస్తుంటే..
ఈ వయ్యారి అందాలు.. గోదారి చూస్తుంటే

కిన్నెరసాని వచ్చిందమ్మ వెన్నెల పైటేసి.. 

కిన్నెరసాని వచ్చిందమ్మ వెన్నెల పైటేసి..
విశ్వనాధ పలుకై... అది విరుల తేనెచినుకై..
కూనలమ్మ కులుకై.. అది కూచిపూడి నడకై..

పచ్చని చేలా.. తనననన..
పావడగట్టి.. తనననన
ఓయ్ పచ్చని చేలా..  పావడగట్టి..

 అ కొండమల్లెలే కొప్పునబెట్టి
వచ్చేదొరసాని.. మా వన్నెల కిన్నెరసాని  

 వచ్చేదొరసాని.. మా వన్నెల కిన్నెరసాని  


2 comments:

దూరానికి కలిసుండే ఆకాశం, సంద్రం యెంత ముందుకెళ్ళినా..మరింత దూరం లో ఊరిస్తుంటాయి..మరా ఆకాశమంటి అమ్మాయి నేలకి దిగి సంద్రం లాంటి అబ్బాయిని అల్లుకుంటే..మనసు కిన్నెరసానే కదా..వయసు గోదారవదా..

అంతే కదండీ మరి ముమ్మాటికీ :-) థాంక్స్ ఫర్ ద నైస్ కామెంట్ శాంతి గారు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.