గురువారం, జులై 30, 2015

నీలో అల గోదారి...

గోదావరి ఒడ్డున ప్రేమకు ప్రేమ గీతాలకు కొదవేముంది.. ఇదిగో ఈ యువజంటని చూడండి తన ప్రేయసిలో గోదారి ని చూస్తే తన ప్రియుడిలో నీడనిచ్చే అందాల తోటలని చూసిందట ఆ ముచ్చటేమిటో మనమూ విందామా. ఈ పాటలో ఇళయరాజా గారి సంగీతం అచ్చంగా గోదావరి మీదనుండి వీచే పిల్లతెమ్మెరలా హాయిగా అలా అలా సాగిపోతూ ఎంతో బాగుంటుంది. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : ప్రేమ విజేత (1992)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం :
గానం : బాలు, జానకి

నిస రిమ పద నిద సా నిసని
నిస రిమ పద నిద సా నిసని
శభాష్
సరి నిస దని పదమా
సరి నిస దని పదమా
మపసా నిసనిద మపసా

నీలో అల గోదారి ఎన్నెల నండూరి ఎంకిలా
నవ్వింది నా తోడుగా
నీలో తొలి అందాల తోటలే ఆత్రేయ పాటలా
ఉన్నాయి నా నీడగా

వలపుల పులకింతే తెలుగుకు గిలిగింత
ఎదలే పలికే వేళా వగలొలికె
నీలో తొలి అందాల తోటలే ఆత్రేయ పాటలా
ఉన్నాయి నా నీడగా


నీ పేరు వయ్యారమా నడిచిన శృంగారమ
అందాలు చూశానే అలల నడుమ
నీ పేరు సంగీతమా వలచిన సాయంత్రమా
ఏ రాగమైనా నీ మనసు మహిమ

నీ హంస నాదమే నా సూర్య వేదమై
నీ ప్రేమ రాగమే నా రామ కీర్తనై
నీ రూపమే ఒక ఆలాపనై..
ఆలోచనే ప్రియ ఆరాధనై..నీలో..

నీలో అల గోదారి ఎన్నెల నండూరి ఎంకిలా
నవ్వింది నా తోడుగా
హహ మలి సందెలలో పొంచీ ఉన్నా
చలి విందులకే వేచీ ఉన్నా
బిడియాల బుగ్గెరుపూ
పరువాల పొద్దెరుపూ
కడియాల కాలెరుపూ
కలహాల కన్నెరుపూ

నా గుండె ఏ తాళమో తెలియని ఉల్లాసమే
ఉప్పొంగి పోయే నీ తపన వలన

నా గొంతు ఏ రాగమో అడిగెను నీ తాళమే
ఉర్రూతలూగే నీ మనసుతోనే
ఏ పొన్న పూసినా నీ నవ్వులేననీ
ఏ వెన్నదోచినా నీ వన్నెలేననీ
ఉన్నాయిలే కలలా ఆశలే
తెల్లారినా ఇక నీ ధ్యాసలే.. నీలో..

నీలో తొలి అందాల తోటలే ఆత్రేయ పాటలా
ఉన్నాయి నా నీడగా 
నీలో అల గోదారి ఎన్నెల నండూరి ఎంకిలా
నవ్వింది నా తోడుగా
వలపుల పులకింతే తెలుగుకు గిలిగింత
ఎదలే పలికే వేళా వగలొలికె 
నీలో అల గోదారి ఎన్నెల నండూరి ఎంకిలా
నవ్వింది నా తోడుగా

2 comments:

కులుకుతూ హొయలొలుకుతూ వంపులు తిరిగే గోదారమ్మ చందాలూ, ఊగుతూ తూగుతూ తిరుగాడే బల్లకట్టు అందాలూ మన కోన సీమ సంపదలు..

అవును కోనసీమ అందం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేనండీ.. థాంక్స్ ఫర్ ద కామెంట్.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.