శుక్రవారం, జులై 03, 2015

పూసింది పూసింది పున్నాగ...

పువ్వులా నవ్వే అమ్మాయిలని చూసుంటారేమొ కానీ అమ్మాయిలా నవ్వే పువ్వులని మీరెప్పుడైనా చూశారా.. మన వేటూరి వారు చూశారటండోయ్ అదీ వారికిష్టమైన పున్నాగ పూలలో.. ఆ చిత్రమేమిటో కీరవాణి గారు కమ్మని బాణీ కట్టి మరీ వినిపిస్తున్నారు.. విందామా. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : సీతారామయ్యగారి మనవరాలు (1991)
సంగీతం : కీరవాణి
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, చిత్ర

పూసింది పూసింది పున్నాగ 
పూసంత నవ్వింది నీలాగ
సందేళ లాగేసె సల్లంగా 
దాని సన్నాయి జళ్ళోన సంపెంగ
ముల్లోకాలే కుప్పెలై జడ కుప్పెలై
ఆడ... జతులాడ...

హహ..పూసింది పూసింది పున్నాగ 
పూసంత నవ్వింది నీలాగ
సందేళ లాగేసె సల్లంగా 
దాని సన్నాయి జళ్ళోన సంపెంగ

ఇష్టసఖి నా చిలుక నీ పలుకే బంగారంగా
అష్టపదులే పలికే నీ నడకే వయ్యారంగా
కలిసొచ్చేటి కాలాల కౌగిళ్ళలో కలలొచ్చాయిలే
కలలొచ్చేటి నీ కంటిపాపాయిలే కథ చెప్పాయిలే
అనుకోని రాగమే అనురాగ దీపమై
వలపన్న గానమే ఒక వాయులీనమై
పాడే...... మదిపాడే......

పూసింది పూసింది పున్నాగ 
పూసంత నవ్వింది నీలాగ
సందేళ లాగేసె సల్లంగా 
దాని సన్నాయి జళ్ళోన సంపెంగ

పట్టుకుంది నా పదమే నీ పదమే పారాణిగా
కట్టుకుంది నా కవితే నీ కళలే కళ్యాణిగా
అరవిచ్చేటి అభేరి రాగాలకే స్వరమిచ్చావులే
ఇరుతీరాల గోదారి గంగమ్మకే అలలిచ్చావులే
అల ఎంకి పాటలే ఇల పూలతోటలై
పసిమొగ్గ రేకులే పరువాల చూపులై
పూసే.... విరబూసే......

పూసింది పూసింది పున్నాగ 
పూసంత నవ్వింది నీలాగ
సందేళ లాగేసె సల్లంగా 
దాని సన్నాయి జళ్ళోన సంపెంగ
ముల్లోకాలే కుప్పెలై జడ కుప్పెలై
ముల్లోకాలే కుప్పెలై జడ కుప్పెలై
ఆడ... జతులాడ...

పూసింది పూసింది పున్నాగ 
పూసంత నవ్వింది నీలాగ
సందేళ లాగేసె సల్లంగా 
దాని సన్నాయి జళ్ళోన సంపెంగ

4 comments:

వెన్నెల గోదారి అలలలో రాదారి పడవలో ఊగుతూ వెడుతున్నట్టు వుంటుంది యెప్పుడు విన్నా..థాంక్యూ వేణూజీ..చాలా ఇష్టమైన పాటండీ ఇది..

పూసింది పూసింది పున్నాగ
పూసంత నవ్వింది నీలాగ
సందేళ లాగేసె సల్లంగా
దాని సన్నాయి జళ్ళోన సంపెంగ
ముల్లోకాలే కుప్పెలై జడ కుప్పెలై
ఆడ... జతులాడ... unable to understand veturi's lyrics. the tune is also jerky and artificial. perfect example for an amateurish composition.

థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు... చాలా చక్కగా పోల్చారు అలా సాగిపోయే సరదా పాటే ఇది :-)

అజ్ఞాత గారు ఇంట్రెస్టింగ్ టు నో యువర్ పర్స్పెక్టివ్.. నాకు శాస్త్రీయ సంగీతం తెలియదండీ.. కానీ వినడానికి మాత్రం నాకు చాలా హాయిగా ఉంటుందీ పాట. లిరిక్స్ సులువుగా అర్దమయే అచ్చతెలుగు పదాలే కదండీ.. వేటూరి వారి పాటలెపుడు అర్ధం చేసుకున్నవారికి చేసుకున్నంత అన్నట్లే ఉంటాయి :-)

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.