ఆదివారం, జులై 05, 2015

నవ్వు వచ్చిందంటే...

విభిన్న సంప్రదాయాలను సంస్కృతులను చూస్తూ ఎన్నో ప్రాంతాలనుండి ప్రవహించే గోదారమ్మ గలగలమని పాడుతూ తాను తిరిగిన ప్రాంతాలలోని కథలెన్నిటినో చెప్పిందట. ఆ కథలలోని జీవిత సత్యాలను బాలు గారు, కె.వి.మహదేవన్ గారు, ఆరుద్ర గార్ల సాయంతో బాపుగారు చెప్తున్నారు మనమూ విందామా. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : స్నేహం
సంగీతం : కెవి మహదేవన్
సాహిత్యం : ఆరుద్ర
గానం : బాలు

నవ్వు వచ్చిందంటే కిలకిల
ఏడుపొచ్చిందంటె వల వల
నవ్వు వచ్చిందంటే కిలకిల
ఏడుపొచ్చిందంటె వల వల
గొదారి పాడింది గల గలా..
గొదారి పాడింది గల గలా..
దానిమీద నీరెండ మిల మిల

నవ్వు వచ్చిందంటే కిలకిల
ఏడుపొచ్చిందంటె వల వల
నవ్వు వచ్చిందంటే కిలకిల
ఏడుపొచ్చిందంటె వల వల

నది నిండా నీళ్ళు ఉన్నా మనకెంత ప్రాప్తమన్నా
నది నిండా నీళ్ళు ఉన్నా మనకెంత ప్రాప్తమన్నా
కడవైతే కడివెడు నీళ్ళే గరిటైతే గరిటెడు నీళ్ళే
కడవైతే కడివెడు నీళ్ళే గరిటైతే గరిటెడు నీళ్ళే
ఎవరెంత చేసుకుంటే..ఏఏ..
ఎవరెంత చేసుకుంటే అంతే కాదా దక్కేది

నవ్వు వచ్చిందంటే కిలకిల
ఏడుపొచ్చిందంటె వల వల..

ధర తక్కువ బంగారానికి ధాటి ఎక్కువ
నడమంత్రపు అధికారానికి గోతులెక్కువా ఆ అ ఆఆఅ
ధర తక్కువ బంగారానికి ధాటి ఎక్కువ
నడమంత్రపు అధికారానికి గోతులెక్కువా
కొత్త మతం పుచ్చుకుంటె గుర్తులెక్కువ
చేతకానమ్మకే చేష్టలెక్కువ
చెల్లని రూపాయికే గీతలెక్కువా

నవ్వువచ్చిందంటే కిలకిల
ఏడుపొచ్చిందంటె వల వల..

తమసొమ్ము సొమవారం ఒంటిపొద్దులుంటారు
మందిసొమ్ము మంగళవారం ముప్పొద్దుల తింటారు
తమసొమ్ము సొమవారం ఒంటిపొద్దులుంటారు
మందిసొమ్ము మంగళవారం ముప్పొద్దుల తింటారు
పరులకింత పెట్టినదే...ఏఏ..
పరులకింత పెట్టినదే పరలోకం పెట్టుబడి

నవ్వు వచ్చిందంటే కిలకిల
ఏడుపొచ్చిందంటె వల వల
గోదారి పాడింది గల గల
కధలెన్నొ చెప్పింది ఇలా ఇలా...

నవ్వు వచ్చిందంటే కిలకిల
ఏడుపొచ్చిందంటె వల వల
నవ్వు వచ్చిందంటే కిలకిల
ఏడుపొచ్చిందంటె వల వలా

4 comments:

హ్యూమన్ యెమోషన్స్ ని గోదారితో యెంత అదం గా ముడి వేశారండీ ఆరుద్రగారు..

అవును నిజమేనండీ చాలా చక్కని పాట.. ఆరుద్ర గారు బాగారాశారు, థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు :-)

ఆరుద్ర ఆలోచన చాలా గొప్పది సోదరా

అవునండీ.. చాలా గొప్పది.. థ్యాంక్స్ ఫర్ ద కామెంట్..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.