పచ్చదనంలో ఏకమైన ఈ చిన్నవాడు గానాన్ని తనకి వరంగా ఇచ్చింది అందమైన ప్రకృతే అని తెలుపుతూ ఆ ఆనందాన్ని ఒక అందమైన పాటగా కూర్చి తోటి కుర్రాళ్ళతో ఎలా ఆడీ పాడుకుంటున్నాడో మీరూ చూసీ విని ఆనందించండి. సిరివెన్నెల గారి తేట తెలుగు సాహిత్యం అద్భుతం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.
చిత్రం : స్వాతి కిరణం (1992)
సంగీతం : కె.వి.మహదేవన్
సాహిత్యం : సిరివెన్నెల
గానం : వాణీ జయరాం, కోరస్
కొండా కోనల్లో లోయల్లో
గోదారి గంగమ్మా సాయల్లో
కొండా కోనల్లో లోయల్లో
గోదారి గంగమ్మా సాయల్లో
కోరి కోరి కూసింది కోయిలమ్మ
కోరి కోరి కూసింది కోయిలమ్మ
ఈ కోయిలమ్మా
కొండా కోనల్లో లోయల్లో..ఆఅ..
గోదారి గంగమ్మా సాయల్లో..ఆఅ..
గోదారి గంగమ్మా సాయల్లో
నేలా పల్లవి పాడంగా నీలి మబ్బు ఆడంగా
రివ్వున గువ్వే సాగంగా నవ్వే మువ్వై మోగంగా
నీలి మబ్బు ఆడంగా నవ్వే మువ్వై మోగంగా
ఉంగా ఉంగా రాగంగా ఆ.. ఉల్లాసాలె ఊరంగా హా..
ఉంగా ఉంగా రాగంగా అహ ఉల్లాసాలె ఊరంగా అహ
ఊపిరి ఊయలలూదంగా రేపటి ఆశలు తీరంగా
తెనుగుదనం నోరూరంగా తేటగీతి గారాబంగా
తెనుగుదనం నోరూరంగా తేటగీతి గారాబంగా
తెమ్మెరపై ఊరేగంగా వయ్యారంగా
కొండా కోనల్లో లోయల్లో..ఆఅ..
గోదారి గంగమ్మా సాయల్లో..ఆఆ..
గోదారి గంగమ్మా సాయల్లో
ఝుమ్మని తుమ్మెద తియ్యంగా కమ్మని రాగం తీయంగ
జాజిమల్లె సంపెంగ జానపదాలే నింపంగా
కమ్మని రాగం తీయంగ జానపదాలే నింపంగా
చెట్టుపుట్టా నెయ్యంగా ఆ.. చెట్టాపట్టాలెయ్యంగా హా..
చెట్టుపుట్టా నెయ్యంగా అహ చెట్టాపట్టాలెయ్యంగా అహ
చిలకా పలుకులు చిత్రంగా చిలికే తేనెలు చిక్కంగా
ఏటి పాట లాలించంగా తోట తల్లి లాలించంగా
ఏటి పాట లాలించంగా తోట తల్లి లాలించంగా
స్వరాలన్ని దీవించంగా సావాసంగా
కొండా కోనల్లో లోయల్లో..ఆఅ..
గోదారి గంగమ్మా సాయల్లో..ఓఓ..
లోయల్లో సాయల్లో లోయల్లో సాయల్లో..
ఆఆఆఆఅ..ఆఆఆఆఆ....
2 comments:
ఆ నీటి వాలులో సంగీత ఝరులు..తాకితే చాలు పలికించు సరిగమలు..
సప్త స్వారాలునూ యేడు పాయలుగా తనలో ఇముడ్చుకుని రాయంచలా కదలిపోయే గోదారి.. తన అమృతఝరితో నేలని అమృతమయం చేసే అన్నపూర్ణే కదా మరి..
అందుకేనేమోనండీ రాజమండ్రి కళాకారులకూ పండితులకూ ఆలవాలమైనది.. థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.