గురువారం, జులై 16, 2015

వయ్యారి గోదారమ్మ...

కొండలు గుట్టల నడుమ ఎన్నో ప్రాంతాలనుండి పారే గోదావరి పొయినన్ని హొయలు ఒంపులు ఇంకెవరికి సాధ్యమవదేమో.. అందుకే ఈ ప్రేమికుడు తన ప్రేయసిని వయ్యారాల గోదావరితో పోలుస్తూ ఎంత చక్కటి పాట అందుకున్నాడో మీరే చూసీ వినీ ఆనందించండి. ఈ పాట వీడియో క్వాలిటీ కొంచెం తక్కువగా ఉంది. హై-క్వాలిటీలో ఆడియో మాత్రమే వినాలంటే యూట్యూబ్ వీడియో లో లిరిక్ చూస్తూ ఇక్కడ వినవచ్చు, సౌండ్ క్లౌడ్ లో ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : ప్రేమించు పెళ్లాడు (1985)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, జానకి

వయ్యారి గోదారమ్మ
ఒళ్ళంత ఎందుకమ్మ కలవరం
కడలి ఒడిలో కలసిపోతే కల వరం
ఇన్ని కలలిక ఎందుకో కన్నె కలయిక కోరుకో
కలవరింతే కౌగిలింతై
వయ్యారి గోదారమ్మ
ఒళ్ళంత ఎందుకమ్మ కలవరం

నిజము నా స్వప్నం అహా కలనో ఓహో లేనో ఓహో హో
నీవు నా సత్యం అహా అవునో ఓహో కానో ఓహో హో
ఊహ నీవే ఆహాహాహా.. ఉసురుకారాదా.. ఆహా
మోహమల్లె ఆహాహాహా ముసురుకోరాదా.. ఆహా
నవ్వేటి నక్షత్రాలు మువ్వల్ని ముద్దాడంగ
మువ్వగోపాలుని రాధికా
ఆకాశవీణ గీతాలలోన ఆలాపనై నే కరిగిపోనా 

వయ్యారి గోదారమ్మ
ఒళ్ళంత ఎందుకమ్మ కలవరం

తాకితే తాపం ఓహో కమలం ఓహో భ్రమరం ఓహో హో
సోకితే మైకం ఓహో అధరం ఓహో మధురం ఓహో హో
ఆటవెలది ఆహాహాహా ఆడుతూరావే హా..ఆఅ
తేటగీతి ఆహాహా...హా.. తేలిపోనీవే హా..ఆ
పున్నాగ కోవెల్లోన పూజారి దోసిళ్ళన్ని 
యవ్వనాలకు కానుక
చుంబించుకున్న బింభాధరాల
సూర్యోదయాలే పండేటి వేళ

వయ్యారి గోదారమ్మ
ఒళ్ళంత ఎందుకమ్మ కలవరం

కడలి ఒడిలో కలసిపోతే కల వరం
ఇన్ని కలలిక ఎందుకో కన్నె కలయిక కోరుకో
కలవరింతే కౌగిలింతై 
వయ్యారి గోదారమ్మ
ఒళ్ళంత ఎందుకమ్మ కలవరం
 
 

2 comments:

గోదారితో వంశీగారికీ ఉన్న అనుబంధం మన రాజమండ్రికీ రోజ్ మిల్క్ కీ ఉన్నంత తీయనైనది..నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే ఆడపిల్లలన్నారు తిలక్ గారు..మరి మన వంశీ గారి హీరోయిన్స్ గోదారమ్మతో పోటీ పడి మన విశ్వనాధవారి కిన్నెరసానిని తలపిస్తారు.

అవునండీ వంశీ గారి సినిమాలలో కథలలో అణువణువునా అంతా గోదావరే కనిపిస్తూ ఉంటుంది. థాంక్స్ ఫర్ ద కామెంట్ :-)

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.