గోదావరి గట్టు మీద ఆ నది నడకలకు ధీటుగా హొయలు పోతూ నడిచే ముద్దుగుమ్మని చూస్తే కుర్రకారు ఆగుతారా మరి, ఈ జంట హుషారుగా ఎలా ఆడి పాడారో మీరే చూడండి. నాకు రేడియో పరిచయం చేసిన పాటల్లో ఈ పాట ఒకటి చాలా ఇష్టం.. ఏఎన్నార్ గారి స్టైల్లో రివ్వుమంటే జివ్వు మంది లాంటి పదాలు మళ్ళీ మళ్ళీ పాడుకునేవాళ్ళం. ఈ పాట ఆడియో వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు.
చిత్రం : గోపాల కృష్ణుడు (1982)
సంగీతం : చక్రవర్తి
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, సుశీల
అరే...గోదారి గట్టంట వయ్యారి పిట్టంట
రివ్వుమంటే జివ్వుమంది నాకు మక్కువ
గోదారి గట్టంట వయ్యారి పిట్టంట
రివ్వుమంటే జివ్వుమంది నాకు మక్కువ
ఉయ్యాల జంపాల ఊగేటి వన్నెల్లో
చీరకొక్క మూర తప్ప ఏమి తక్కువ
అబ్బ.. ఏం వయసో... ఏం సొగసో..
అహ..ఏం సొగసో.. ఏం వయసో..
గోదారి గట్టంట నా దారినెళుతుంటే
పూల బేరమాడేనమ్మ పూలరంగడు
గోదారి గట్టంట నా దారినెళుతుంటే
పూల బేరమాడేనమ్మ పూలరంగడు
రాదారి పడవల్లో రాగాలు తీస్తుంటే
దొండపండు దోచెనమ్మ దొంగరాముడు
అబ్బ... ఏం మడిసో.. ఎంత గడుసో..
అహా.. ఎంత గడుసో..ఏం మడిసో..
బేరమాడ వచ్చానే ఓలమ్మీ
బెంగపడిపోయానే ఓలమ్మీ
బేరమాడ వచ్చానే ఓలమ్మీ
బెంగపడిపోయానే ఓలమ్మీ
బెంగపడిపోయానే ఓలమ్మీ
ముద్దు నాకు ముదిరెనే... నిద్దరంత కరిగెనే...
రాత కొద్ది దొరికినాడే.. రాతి గుండె కదిపినాడే
పూటపూటకు పూతకొచ్చిన పులకరింత కోరినాడే
అబ్బ... ఏం మడిసో... ఏం వరసో..
అహా.. ఏం వరసో...ఏం మడిసో..
అహ..గోదారి గట్టంట వయ్యారి పిట్టంట
రివ్వుమంటే జివ్వుమంది నాకు మక్కువ
రాదారి పడవల్లో రాగాలు తీస్తుంటే
దొండపండు దోచెనమ్మ దొంగరాముడు
అబ్బ.. ఏం వయసో... ఏం సొగసో..
అహ.. ఎంత గడుసో..ఏం మడిసో..
పుట్టుమచ్చలాంటివోడే నా సామీ
పచ్చబొట్టులాంటి వోడె నా సామీ..
పుట్టుమచ్చలాంటివోడే నా సామీ
పచ్చబొట్టులాంటి వోడె నా సామీ..
పట్టుకుంటే వదలడే... చెరుపుకుంటే చెదరడే..
వయసులాగా వచ్చినోణ్ణే.. వన్నెలెన్నో తెచ్చినోణ్ణే
ఈల వేసిన గోల పాపల కోలకళ్ళకు మొక్కినానే...
అబ్బ.. ఏం వయసో... ఏం సొగసో..
అహా...ఏం సొగసో..ఏం వయసో..
గోదారి గట్టంట నా దారినెళుతుంటే
పూల బేరమాడేనమ్మ పూలరంగడు
రాదారి పడవల్లో రాగాలు తీస్తుంటే
దొండపండు దోచెనమ్మ దొంగరాముడు
అబ్బ... ఏం మడిసో.. ఎంత గడుసో..
అబ్బ.. ఎంత గడుసో..ఏం మడిసో..
గోదారి గట్టంట వయ్యారి పిట్టంట
రివ్వుమంటే జివ్వుమంది నాకు మక్కువ
ఉయ్యాల జంపాల ఊగేటి వన్నెల్లో
చీరకొక్క మూర తప్ప ఏమి తక్కువ
అబ్బ.. ఏం వయసో... ఏం సొగసో..
అహా..ఏం సొగసో.. ఏం వయసో..
2 comments:
విత్ డ్యూ రెస్పెక్ట్స్ టూ యే.యెన్.ఆర్ గారు..అరవై లో ఉన్నవారితోనూ ఇరవైలా స్టెప్స్ వేయిస్తుంది మన గోదారి..
హహహ బాగా చెప్పారు శాంతి గారు :-) థాంక్స్ ఫర్ ద కామెంట్.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.