మంగళవారం, జులై 14, 2015

వేదంలా ఘోషించే గోదావరి...

నేటినుండే పుష్కరాలు మొదలు కదా మరి ఈ సంధర్బంగా గోదావరీ ఆ ఒడ్డునే ఉన్న రాజమండ్రి గొప్పతనాన్ని చాటి చెప్పే ఒక చక్కని పాటను తలచుకుందామా. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : ఆంధ్రకేసరి (1983)
సంగీతం : రమేశ్ నాయుడు
సాహిత్యం : ఆరుద్ర
గానం : బాలు

నమః సోమాయచ రుద్రాయ చ నమస్తామ్రాయ చారుణాయచ
నమశ్శంగాయ చ పశుపతయే చ నమ ఉగ్రాయ చ భీమాయ చ
నమో అగ్రేవధాయ చ దూరేవధాయ చ నమో హంత్రే చ హనీయసే చ
నమో వృక్షేభ్యోహరి కేశేభ్యో నమస్తారాయ నమశ్శంభవే చ
మయో భవే చ నమశ్శంకరాయ చ మయస్కరాయ చ
నమశ్శివాయ చ శివతరాయ చ

వేదంలా ఘోషించే గోదావరి
అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి
వేదంలా ఘోషించే గోదావరి
అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి
శతాబ్దాల చరిత గల సుందర నగరం
శతాబ్దాల చరిత గల సుందర నగరం
గతవైభవ దీప్తులతో కమ్మని కావ్యం
వేదంలా ఘోషించే గోదావరి
అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి

రాజరాజ నరేంద్రుడు.. కాకతీయులు
తేజమున్న మేటి దొరలు.. రెడ్డి రాజులు
గజపతులు.. నరపతులు.. ఏలిన ఊరు
ఆ కథలన్ని నినదించె గౌతమి హోరు
వేదంలా ఘోషించే గోదావరి
అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి

శ్రీవాణి గిరిజాస్చిరాయ దథతో వక్షో ముఖాంగేశు
యే లోకానాం స్థితిమావహంత్య విహితాం స్త్రీపుంస యోగోద్భవాం
దేవేదత్రయమూర్తాయ స్త్రిపురుష సంపూజితాపస్సురైర్భూయాశుః
పురుషోత్తమాం భుజభవ శ్రీకంధరాశ్రేయసే...

ఆది కవిత నన్నయ్యా వ్రాసెనిచ్చటా
శ్రీనాధ కవి నివాసమూ పెద్ద ముచ్చటా
ఆది కవిత నన్నయ్యా వ్రాసెనిచ్చటా
శ్రీనాధ కవి నివాసమూ పెద్ద ముచ్చటా
కవిసార్వభౌములకిది ఆలవాలము
కవిసార్వభౌములకిది ఆలవాలము
నవ కవితలు వికసించె నందనవనము

వేదంలా ఘోషించే గోదావరి
అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి

దిట్టమైన శిల్పాల దేవళాలు
కట్టుకథల చిత్రాంగి కనక మేడలు
దిట్టమైన శిల్పాల దేవళాలు
కట్టుకథల చిత్రాంగి కనక మేడలు
కొట్టుకొని పోయె కొన్ని కొటిలింగాలు
వీరేశలింగమొకడు మిగిలెను చాలు

వేదంలా ఘోషించే గోదావరి
అమరదామంలా శోభిల్లే రాజమహేంద్రి
శతాబ్దాల చరిత గల సుందర నగరం
గతవైభవ దీప్తులతో కమ్మని కావ్యం
వేదంలా ఘోషించే గోదావరి
అమరదామంలా శోభిల్లే రాజమహేంద్రి
వేదంలా ఘోషించే గోదావరి
అమరదామంలా శోభిల్లే రాజమహేంద్రి ~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~

ఎమ్మెస్ విశ్వనాథన్ గారి జ్ఞాపకాలతో వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ వారి సంగీత దర్శకత్వంలో వచ్చిన ఒక చక్కని పాట తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. 
చిత్రం : గుప్పెడు మనసు [1979]
సంగీతం : ఎం. ఎస్ విశ్వనాధన్
సాహిత్యం : ఆచార్య ఆత్రేయ
గానం : మంగళంపల్లి బాల మురళీ కృష్ణ

మౌనమె నీ భాష ఓ మూగ మనసా
మౌనమె నీ భాష ఓ మూగ మనసా
తలపులు ఎన్నెన్నొ కలలుగ కంటావు
కల్లలు కాగానే కన్నీరవుతావు
మౌనమె నీ భాష ఓ మూగ మనసా 
ఓ మూగ మనసా
చీకటి గుహ నీవు చింతల చెలి నీవు
నాటకరంగానివే మనసా తెగిన పతంగానివే
ఎందుకు వలచేవో ఎందుకు వగచేవో
ఎందుకు రగిలేవో ఏమై మిగిలేవో
ఎందుకు రగిలేవో ఏమై మిగిలేవో
 
మౌనమె నీ భాష ఓ మూగ మనసా 
ఓ మూగ మనసా

కోర్కెల చెల నీవు కూరిమి వల నీవు
ఊహల ఉయ్యాలవే మనసా మాయల దెయ్యానివే
లేనిది కోరేవు వున్నది వదిలేవు
ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు
ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు
 
మౌనమె నీ భాష ఓ మూగ మనసా
తలపులు ఎన్నెన్నొ కలలుగ కంటావు
కల్లలు కాగానే కన్నీరవుతావు
మౌనమె నీ భాష ఓ మూగ మనసా 
ఓ మూగ మనసా
 


4 comments:

ఆ గాలి..సాంప్రదాయపు సిరి
ఆ నీరు..నవరస ఝరి..
ఆ నేల..అన్నపూర్ణకు సరి..
అదే..అదే..మన రాజమహేంద్రి..
నాలాంటి యెందరినో అమ్మ వొడి లోంచి ప్రపంచపు బడి లోకి తొలి అడుగులు వేయించిన పుట్టిల్లు రాజమండ్రికీ అమ్మంటి గోదారికీ..ఇంత అందమైన పాట వేసిన మీకూ శుభాకాంక్షలు వేణూజీ..

of course. both the songs are good. while singing శ్రీవాణి గిరిజాస్చిరాయ sp balu goes overboard. except for this, the lyrics and tune are good. మౌనమె నీ భాష is an all time classic.

నిజమే వేణూజీ..ఒక్కోసారి మనసుని బాధ పెట్టే మాట కన్నా మౌనమే మనసుని ప్రభావితం చేస్తుంది..మీరన్నటు ఆయన విశ్వనాధుని చేరినా..ఆయన పలికించిన రాగాలు విశ్వమున్నంత వరకూ మనతోనే ఉంటాయి..

థాంక్స్ శాంతి గారూ.. రాజమండ్రి గురించి బాగా చెప్పారండీ.. గోదావరి ఒడ్డున రాజమండ్రి తెలుగువారికి ఒక అందమైన అపురూపమైన సాంప్రదాయపు వారసత్వ సంపదండీ.. థాంక్స్ ఫర్ ద కామెంట్.

థాంక్స్ అజ్ఞాత గారు.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.