ఆదివారం, జులై 19, 2015

గోదారి రేవులోన...

గోదావరి ఒడ్డున పెరిగిన ఈ అమ్మాయి గొప్పలూ కాబోయే వాడి గురించి మనసులో ఉన్న కోరికలూ కలిపి ఒక హుషారైన పాటకట్టి వినిపిస్తోంది. ఆ సందడేమిటో మీరూ వినండి మరి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : రుక్మిణి (1997)
సంగీతం : విద్యాసాగర్
సాహిత్యం : సిరివెన్నెల 
గానం : సుజాత 

గోదారి రేవులోన రాదారి నావలోన 
నా మాట చెప్పుకుంటు ఉంటారంటా 
నా నోట చెప్పుకుంటె బాగోదొ ఏమో కాని 
నాలాంటి అందగత్తె నేనేనంట 
కూసంత నవ్వగానే పున్నాగ పువ్వులాగ 
పున్నాలు పూయునంట కన్నుల్లో 
కాసింత కోపమొస్తే ఊరంత ఉప్పెనొచ్చి
ఎందుకో ఏమిటో చెప్పమంటు సందడంట

గోదారి రేవులోన రాదారి నావలోన 
నా మాట చెప్పుకుంటు ఉంటారంటా 
నా నోట చెప్పుకుంటె బాగోదొ ఏమో కాని 
నాలాంటి అందగత్తె నేనేనంట 

పాట అంటె నాదెగాని కోయిలమ్మదా ఉట్టి కారుకూతలే..
ఆట అంటె నాదెగాని లేడిపిల్లదా ఉట్టి పిచ్చిగంతులే..
పొలాల వెంట ఛెంగుమంటు సాగుతూ పదాలు పాడితే 
జిగేలుమంటు కళ్ళు చెదిరి ఆగవా జులాయి గాలులే 
ఏ చిన్న మచ్చలేని నా వన్నె చిన్నె చూసి 
చంద్రుడే సిగ్గుతో మబ్బు చాటు చేరుకోడా 

గోదారి రేవులోన రాదారి నావలోన 
నా మాట చెప్పుకుంటు....
నా నోట చెప్పుకుంటె బాగోదొ ఏమో కాని 
నాలాంటి అందగత్తె....

నాకు పెళ్ళి ఈడు వచ్చి పెద్దవాళ్ళకీ ఎంత చిక్కు తెచ్చెనే
రాకుమారిలాంటి నాకు జోడు వెతకడం వాళ్ళకెంత కష్టమే 
ఫలాని దాని మొగుడు గొప్పవాడనీ అనాలి అందరూ 
అలాని నాకు ఎదురు చెప్పకూడదే మహానుభావుడూ
నాకు తగ్గ చక్కనోడు నేను మెచ్చు అ మగాడు
ఇక్కడే ఎక్కడో తపస్సు చేస్తు ఉంటాడు 

గోదారి రేవులోన రాదారి నావలోన 
నా మాట చెప్పుకుంటు ఉంటారంటా 
నా నోట చెప్పుకుంటె బాగోదొ ఏమో కాని 
నాలాంటి అందగత్తె నేనేనంట
కూసంత నవ్వగానే పున్నాగ పువ్వులాగ 
పున్నాలు పూయునంట కన్నుల్లో 
కాసింత కోపమొస్తే ఊరంత ఉప్పెనొచ్చి
ఎందుకో ఏమిటో చెప్పమంటు సందడంట


9 comments:

70యేళ్ళు దాటినా, రాజమండ్రి గంగరాజు గారి పాలకోవా రుచి మారలేదు..35 యేళ్ళు దాటినా, మసీదు బండి మిర్చి బజ్జీల ఘాటు తగ్గలేదు..మనతో ఉన్నన్నినాళ్ళూ మన బాపూ రమణలకు గోదారిపై ప్రేమ తరగలేదు..వరద గోదారంటి పాట..


ఫలాని దాని మొగుడు గొప్పవాడనీ అనాలి అందరూ
అలాని నాకు ఎదురు చెప్పకూడదే మహానుభావుడూ


ఇటువంటి స్పెషల్ కేరక్టర్స్ గోదావరి లోనే దొరుకుతారా ?

మన మాటలోనే అంత పెంకితనముండగా మరొకరు సాటి రాగలరా..

ఫలానా వారి మొగుడు అని పిలిపించుకోవాలని మా కృష్ణా జిల్లాలో ఎవరూ అనుకోరు.
నేనైతే అస్సలు అనుకోను.
పొగరు పొగరే ! ఆ పొగరే లేకపోతే పోట్లాడుకునేది ఉండదు, పోట్లాట లేకపోతే నీహారిక ఉండలేదు.
దేని లెక్క దానిదే !

ఇది మాత్రం పచ్చి నిజం..ఒప్పుకున్నందుకు పరమ సంతోషం..

థాంక్స్ శాంతి గారు, అవునండీ మార్పు సహజమని అంటూంటారు కానీ కొన్ని ఎంతకాలమైనా ఏమీ మారవు... నిజమే హుషారైన ఈ పాట వరద గోదారిని గుర్తు చేస్తుంది.

నీహారిక గారు, భర్త గొప్పగా ఉండాలనుకోవడంలోనూ తన మాట వినాలనుకోవడంలోనూ స్పెషల్ ఏముందండీ అందరమ్మాయిలూ కోరుకునే విషయమే కదా.

ఇంగ్లీష్ పెళ్ళాం ఈస్ట్ గోదావరి మొగుడులా ఉంటే బాగుండదండీ !భానుమతీ రామకృష్ణ అన్యోన్య దంపతులైనా భానుమతిని ముట్టుకోవాలంటే పెద్ద పెద్ద హీరోలే భయపడేవారట !
సూర్యాకాంతం అయినా ఇంట్లో మాత్రం శాంతమూర్తే ! ఆడవాళ్ళ లాజిక్కులు మీరు అర్ధం చేసుకోవాలి.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.