గోదావరి మహా పుష్కరాల సంధర్బంగా పాటలను తలచుకుంటూ గోదావరి ఒడ్డున కొలువైన భద్రాద్రి రాముడ్ని తలచుకోకుంటే ఎలా అందుకే ఆ భద్రుని చరితం ఈ రోజు గుర్తు చేసుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు.
చిత్రం : అందాల రాముడు (1973)
సాహిత్యం : ఆరుద్ర
సంగీతం : కె.వి.మహదేవన్
గానం : రామకృష్ణ, రాఘవులు,
వంగల పట్టాభి భాగవతార్(వచనం)
మా తల్లి గోదారి చూపంగ దారి
పడవెక్కి భద్రాద్రి పోదామా
భద్రాద్రి రాముణ్ణి చూదామా
భద్రగిరి మహిమలే విందామా
భద్రగిరి మహిమలే విందామా ఓఓహో..ఓహో
ఏవిటోయ్ ఆ మహిమలు ?
శ్రీ మద్రమారమణ గోవిందో హారి
భక్తులారా.. సుజనులారా
సీతాలక్ష్మణ సమేతుడైన శ్రీరామచంద్రుడు
అరణ్యవాస సమయంబున..
పావన గోదావరీ తీరంబున ఒకానొక గిరిని
పరికించి, దానిపై సుంత
విశ్రమించినంత, ఆ కంధరమ్మొక సుందర
పురుషాకృతి దాల్చి.. ఏమనినాడనగా..
ధన్యుడనైతిని ఓ రామా
నా పుణ్యము పండెను శ్రీరామా
ధన్యుడనైతిని ఓ రామా
నా పుణ్యము పండెను శ్రీరామా
మేరు గిరీంద్రుని పుత్రుడను
నీ రాకకు చూచే భధ్రుడనూ
నారీ శిరోమణి సీతమ్మతో మీరు
నా శిరమున నెలకొన వేడెదనూ..
కారుణ్యాలయ కామితమీడేర్చ
కలకాలము నిను కొలచెదనూ
ధన్యుడ.. ధన్యుడ...
ధన్యుడనైతిని ఓ రామా
నా పుణ్యము పండెను శ్రీరామా
అని భద్రుడు ప్రార్ధించిన స్వామివారేమన్నారనగా..
వత్సా! నీ ముద్దు చెల్లించుటకు ముందు
మా తండ్రిమాట చెల్లించవలయును గదా
ఉత్తరోత్తర కాలంబున పునర్దర్శనంబు ఇచ్చువాడను..
అని వెడలిపోయిరి.. అంతట...
వెడలిన రాముడు వెలదిని బాసి
ఇడుములలో బడెనూ
కడలికి వారధి గట్టి
కఠినాత్ముడు దనుజుని గొట్టి
కలికి చెరను పోగొట్టి
కనువిందుగ పట్టము గట్టి
బంధుమిత్రుల తలచుట బట్టి
భక్తుని మాట మరచాడు
రాముడు పరమావతారమ్ము విడిచాడు
వైకుంఠవాసమ్ము చేరాడు
శ్రీమద్రమారమణ గోవిందో... హారి..
కానీ భూలోకమున భద్రుడు ఎన్ని యుగములైనా
ఎదురుచూస్తూ ఏవిధముగా శోకించినాడనగా
వచ్చెదనంటివి రామయ్యా
వరమిచ్చెదనంటివి రామయ్యా
వచ్చెదనని శలవిచ్చిన పిమ్మట
మోసపుచ్చుట ఇచ్చట తగదయ్యా
వచ్చెనుకద నీ మాటకు మచ్చా
అది రానిచ్చెదనా నిను పోనిచ్చెదనా
హెచ్చరింతు నువు మెచ్చెడి తపమున
నిచ్చలు జపించి ఖచ్చితముగా
ఓ సచ్చరిత్రనిన్నిచ్చటకీడ్చెద
వచ్చెదనంటివి రామయ్యా
వరమిచ్చెదనంటివి రామయ్యా
అని శపథంబు చేసి మహోగ్ర తపస్సు నాచరించగా
సకల సురాసుర యక్ష గంధర్వ కిన్నెర కింపురుషాదులు
సంక్షోభమ్ము నొందిరి... అపుడు..
కదలెను శ్రీ మహా విష్ణువు
కదలెను భక్త సహిష్టువు
సుదతి శ్రీదేవికి సుంతయినా తెలుపక
శుభ శంఖ చక్రాల కరముల దాల్చక
సుదూరమౌ భూలోకమునకు
సుపర్ణుని భుజమైన ఎక్కకా
వడివడి కదలెను శ్రీ మహా విష్ణువు
ఆహా కదలెను భక్త సహిష్టువు
శ్రీమద్రమారమణ గోవిందో... హారి..
గజేంద్ర మోక్ష సన్నివేశంబుకై వడి
స్వామి వారు ఆ విధమ్ముగా కదలగా..
తన వెంటన్ సిరి
లచ్చి వెంట నవరోధవ్రాతమున్
దాని వెన్కను పక్షీంద్రుడు
వాని పొంతను ధనుఃకౌమోదకీ
శంఖ చక్ర నికాయంబునూ
హుటాహుటిని రాగా తొందరయందు
అపసవ్యంబుగా ఆయుధములు ధరించి
స్వామివారు దర్శనంబీయ
ఆ భక్తశిఖామణి ఏమన్నాడు..
ఎవరివయ్య స్వామి ఏను నిన్నెరుగను
హరిని నేనటంచు అనగనేల
నాడు నన్ను బ్రోచు నారాముడవు గావు
నాటి రూపు చూప నమ్మగలను
అని భద్రుడు కోరగా – శ్రీ మహావిష్ణువు
తొలినాటి రామావతారమ్ము ప్రదర్శించెను
అపసవ్యమ్ములైన ఆయుధమ్ములు,
ఆ తీరుగనే చేతుల నిల్చెను..
భద్రుడు మహదానంద భరితుడై
ఈ తీరుగనె ఇచ్చట వెలయుము
ఇనకుల సోమా రామా
భూతలమున ఇది సీతారాముల
పుణ్య క్షేత్ర లలామా
శభాష్..
అని విన్నవించగా స్వామివారు ఆ తీరుగనే వెలసిరి.
ఆ భద్రుడే భద్రాద్రి అయ్యెను. భద్రగిరి వాసుడైన శ్రీరామచంద్రుడు
ఎండకు ఎండి వానకు తడిసి నీడకు తపించినవాడై..
ఒక నాడు శబరి అంశమున జన్మించినదైన పోకల దమ్మక్క
అను భక్తురాలి స్వప్నమ్మున సాక్షాత్కరించి
ఆ వైనమ్ము తెలుపగా ఆయమ భద్రగిరినంతయు గాలించగా
స్వామివారి దివ్యసుందరమూర్తి కనిపించెను.
కోరి కనిపించావా కోదండరామయ్యా
గుడి కట్టలేని ఈ బడుగు పేదకు నీవు
కోరి కనిపించావా కోదండరామయ్యా
చక్రవర్తి కుమారుడా ఇంకో చక్రవర్తికి అల్లుడా
భూచక్రమేలిన సార్వభౌమా
విధి వక్రించి నీకే వాసమ్ము కరువా
తాటాకు పందిరే తాటకాంతక
నీకు భవనమయ్యా
తాటిపండ్లే ఓ మేటి రాజకుమార
విందులయ్యా నీకు విందులయ్యా
అని పోకల దమ్మక్క నిత్యము సేవించుకొనెను.
తదుత్తర కాలంబున రామదాసుగా ప్రఖ్యాతుడైన
కంచెర్ల గోపన్న ఏవిధముగా
ఆలయ నిర్మాణము గావించెననగా..
ఏవిధముగానా ! అప్పుజేసి..
తప్పునాయనా! గోపన్న చరితములోక విఖ్యాతము..
తదీయ సంస్మరణము మంగళదాయకము
రామచంద్రాయ జనక రాజజామనోహరాయ
మామకాభీష్టదాయ మహిత మంగళం
సీతా రామచంద్రాయ జనక రాజజామనోహరాయ
మామకాభీష్టదాయ మహిత మంగళం
మహిత మంగళం మహిత మంగళం
జై.. శ్రీమద్రమారమణ గోవిందో... హారి !
~*~*~*~*~*~*~*~*~*~*~*~*~
ఈచిత్రంలోనిదే పూర్తిగా గోదావరిపైని లాంచీలో చిత్రీకరించిన మరో అందమైన యుగళ గీతాన్ని కూడా తలచుకుందామా... ఈ ప్రేమజంట ఎంత చక్కగా పాడుకుంటున్నారో మీరే చూసీ విని ఆనందించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.
చిత్రం : అందాల రాముడు (1973)
సంగీతం : కె.వి. మహదేవన్
సాహిత్యం : సినారె
గానం : రామకృష్ణ, సుశీల
మ్.మ్.ఊ..ఊ..
కురిసే వెన్నెల్లో మెరిసే గోదారిలా
మెరిసే గోదారిలో విరబూసిన నురగలా
నవ్వులారబోసే పడుచున్నదీ
కలువ పువ్వు వేయి రేకులతో విచ్చుకున్నదీ
పున్నమి ఎపుడెపుడా అని వేచి ఉన్నదీ
ఆ...కురిసే వెన్నెల్లో మెరిసే గోదారిలా
మెరిసే గోదారిలో ఎగసిపడే తరగలా..
నాజూకు నెలబాలుడున్నాడూ
నవమి నాడే పున్నమి అని దిగుతున్నాడూ
పున్నమి ఇప్పుడిపుడే అనిపిస్తున్నాడూ
ఆ...కురిసే వెన్నెల్లో మెరిసే గోదారిలా
ఈ వెండి వెన్నెల్లో ఏమిటి ఈ ఎరుపూ
ఎరుపా అది కాదు ఈ అరికాళ్ళ మెరుపూ.. అమ్మో..
ఆ కాలి ఎరుపు కెంపులుగా
ఆ చిరునవ్వులె మువ్వలుగా
ఆ మేని పసిమి పసిడిగా
అందాలా వడ్డాణం అమరించాలి
అని తలచానే గాని ఆనదు నీది
ఇంతకూ..అది ఉన్నట్టా..మరి లేనట్టా..
నడుమూ ఉన్నట్టా మరి లేనట్టా..ఊహు..
పైట చెంగు అలలు దాటీ
అలలపై ఉబికే పొంగులు దాటీ
ఏటికి ఎదురీది ఈది ఎటు తోచక నేనుంటే
మెరుపులాంటి ఎరుపేదో కళ్ళకు మిరుమిట్లు గొలిపింది
ఏవిటది?
ఎవరమ్మా.. ఇతగాడూ ఎంతకు అంతుపట్టని వాడు
చెంతకు చేరుకున్నాడూ
హ హా..ఎవరమ్మా ఇతగాడూ
పాలవెన్నెలలోనా బాలగోదారిలా
చెంగుచెంగున వచ్చి చెయ్యి పట్టబోయాడూ
అంతేనా ?
ఇరుగట్లూ ఒరుసుకునే వరద గోదారిలా
పరుగుపరుగున వచ్చి పైట చెంగు లాగాడూ
ఆపైన ?
అతడు చెయ్యపట్టబోతుంటే పైట చెంగులాగబోతుంటే
ఉరిమి చూసీ ఉరిమి చూసీ తరిమి కొట్టబోయాను
కానీ..చల్లచల్లగా సాగే గోదారిలా శాంత గోదారిలా
నిలువెల్లా నిండుగా తోచాడూ పులకించే గుండెనే దోచాడూ
ఎవరమ్మా ఇతగాడెవరమ్మా
సంగీతం : కె.వి. మహదేవన్
సాహిత్యం : సినారె
గానం : రామకృష్ణ, సుశీల
మ్.మ్.ఊ..ఊ..
కురిసే వెన్నెల్లో మెరిసే గోదారిలా
మెరిసే గోదారిలో విరబూసిన నురగలా
నవ్వులారబోసే పడుచున్నదీ
కలువ పువ్వు వేయి రేకులతో విచ్చుకున్నదీ
పున్నమి ఎపుడెపుడా అని వేచి ఉన్నదీ
ఆ...కురిసే వెన్నెల్లో మెరిసే గోదారిలా
మెరిసే గోదారిలో ఎగసిపడే తరగలా..
నాజూకు నెలబాలుడున్నాడూ
నవమి నాడే పున్నమి అని దిగుతున్నాడూ
పున్నమి ఇప్పుడిపుడే అనిపిస్తున్నాడూ
ఆ...కురిసే వెన్నెల్లో మెరిసే గోదారిలా
ఈ వెండి వెన్నెల్లో ఏమిటి ఈ ఎరుపూ
ఎరుపా అది కాదు ఈ అరికాళ్ళ మెరుపూ.. అమ్మో..
ఆ కాలి ఎరుపు కెంపులుగా
ఆ చిరునవ్వులె మువ్వలుగా
ఆ మేని పసిమి పసిడిగా
అందాలా వడ్డాణం అమరించాలి
అని తలచానే గాని ఆనదు నీది
ఇంతకూ..అది ఉన్నట్టా..మరి లేనట్టా..
నడుమూ ఉన్నట్టా మరి లేనట్టా..ఊహు..
పైట చెంగు అలలు దాటీ
అలలపై ఉబికే పొంగులు దాటీ
ఏటికి ఎదురీది ఈది ఎటు తోచక నేనుంటే
మెరుపులాంటి ఎరుపేదో కళ్ళకు మిరుమిట్లు గొలిపింది
ఏవిటది?
ఎవరమ్మా.. ఇతగాడూ ఎంతకు అంతుపట్టని వాడు
చెంతకు చేరుకున్నాడూ
హ హా..ఎవరమ్మా ఇతగాడూ
పాలవెన్నెలలోనా బాలగోదారిలా
చెంగుచెంగున వచ్చి చెయ్యి పట్టబోయాడూ
అంతేనా ?
ఇరుగట్లూ ఒరుసుకునే వరద గోదారిలా
పరుగుపరుగున వచ్చి పైట చెంగు లాగాడూ
ఆపైన ?
అతడు చెయ్యపట్టబోతుంటే పైట చెంగులాగబోతుంటే
ఉరిమి చూసీ ఉరిమి చూసీ తరిమి కొట్టబోయాను
కానీ..చల్లచల్లగా సాగే గోదారిలా శాంత గోదారిలా
నిలువెల్లా నిండుగా తోచాడూ పులకించే గుండెనే దోచాడూ
ఎవరమ్మా ఇతగాడెవరమ్మా
2 comments:
కొబ్బరి ఊటలు..కోనసీమ పాటలు..
తాకిన ప్రతి అణువునీ పచ్చని చీరగా సింగారించుకుని అల్లన మెల్లన సాగే అమృత ఝరి గోదారి..పరుగు పరుగున భధ్రగిరి చేరి ప్రేమగా సీతమ్మని శ్రీరాముని అర్చించిన పావని గోదారి..ఒంటరి లక్ష్మణ స్వామిని ఊర్మిళయై సేదతీర్చే సంజీవిని గోదారి.
థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు :-) గోదావరి పై మీ అభిమానం మీ కామెంట్ లోని ప్రతి అక్షరంలోనూ కనిపిస్తుంది.. చాలా బాగుందండీ..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.