గోదావరి గట్టు ప్రేమికులలో మాత్రమే హుషారు నింపుతుంది అనుకుంటున్నారా.. అక్కడి ముద్దుగుమ్మలు సైతం ఎంతటి అల్లరి పిడుగులవుతారో ఏమేమి అల్లరులు చేస్తారో ఇదిగో ఈ పాట చూసీ వినీ మీరే తెలుసుకోండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.
చిత్రం : కృషి (2008)
సంగీతం : రాజ్ కిరణ్
సాహిత్యం : సాయి శ్రీ హర్ష
గానం : చిత్ర
గోదారి గట్టుపై గోరింక..గోరింక
గోల గోల చేయనా నేనింకా
గోదారి గట్టుపై గోరింక..గోరింక
గోల గోల చేయనా నేనింకా
గోదారి గట్టుపై గోరింక..గోరింక
గోల గోల చేయనా నేనింకా
నేను కూడా నీకు మల్లె నేల విడిచి ఎగురుతాలే
నీకు నాకు ఇలా స్నేహం కట్టేస్తానులే
గాలి కుర్రగాలి కాస్త ఆగు నేను కూడా
నీ వెంటే అలా హాయిగా తిరిగేస్తానులే
హే...గోదారి గట్టుపై గోరింక..గోరింక
గోల గోల చేయనా నేనింకా
ఎప్పుడూ ఏం చేసినా అనేది లేదులే.. మనకెదురేదిలే
ఎవ్వరూ ఏం చెప్పినా వినేది లేదులే.. వినయం రాదులే
ఈ చెట్టు గట్టూ పుట్టా ఎగిరేటి నింగిని పిట్టా
నాతోటి చెట్టా పట్టా నేలేకపోతే ఎట్టా
ఈ లోకమే నాకోసమే తను పుట్టేసిందిలే
ఏనాటికీ నా దోస్తనీ తెగ ఒట్టేసిందిలే
గోదారి గట్టుపై గోరింక..గోరింక
గోల గోల చేయనా నేనింకా
దారిపై నడయాడగా అందరి చూపులూ.. నాపై వాలులే
ఊరిపై పడి ఆడగా మబ్బులపై అలా.. మనసే తేలులే
భూమంత ఇంతటి అందం నా నుంచి పుట్టిందేమో
అంచేత భూమే సాంతం నా బానిసయ్యిందేమో
ఏమ్మాటలు నను చూడగ ఎవరైనా ఎంతలే
ఓ మాటలో చెప్పేయనా మహరాణే నేనులే
హొయ్ హొయ్ హొయ్
గోదారి గట్టుపై గోరింక..గోరింక
గోల గోల చేయనా నేనింకా
2 comments:
స్వచ్చమైన ఆప్యాయత, అందరితో కలిసి పోయే నేర్పూ, జీవితకాలం స్నేహం ఇవన్నీ గోదారి సొంతం..గోదారి జిల్లాల సొంతం..యేమంటారు వేణూజీ..
అన్నీ గోదావరి జిల్లాల ప్రజల ట్రేడ్ మార్క్సే చెప్పారు కదండీ ఇంకేమంటాను అవునంటాను :-) థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.