విశాల్ శేఖర్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
విశాల్ శేఖర్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

బుధవారం, జులై 25, 2018

ఓ ప్రాణమా...

జీ-వన్(రా-వన్) చిత్రంలోని ఒక హుషారైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : జీవన్ (రా-వన్) (1994)
సంగీతం : విశాల్-శేఖర్  
సాహిత్యం :
గానం : శంకర్ మహదేవన్, ఉన్నిమీనన్

ఓ మధురిమా నా మధురిమా
ఓ పారిజాతమా
కడదాకా కలిసుందామే
ఇక జీవితమే ఒక బృందావనములే

ఓ ప్రియతమా నా ప్రియతమా
ఓ ప్రణయ సంద్రమా
జాబిలివై వెన్నెలనే నా మదిలోనా
కురిపించీ పోవుమా

జవరాలా జవరాలా
ఆ నింగిని మెరిసే నవతార 
జవరాలా జవరాలా
నా ఎదలో తీయని జలధారా

ఓఓ...జవరాలా జవరాలా
ఆ నింగిని మెరిసే నవతార 
జవరాలా జవరాలా
నా ఎదలో తీయని జలధారా

ఓఓఓ జవరాలా జవరాలా
నను అల్లుకుపోవే మనసారా
జవరాలా జవరాలా

ఓ ప్రాణమా నా ప్రాణమా
ఓఓహో హృదయ నాదమా
హరివిల్లే నీ వదనంలో
విరబూసినదే రంగులెన్నో దోరగా

ఓఓ...జవరాలా జవరాలా
ఆ నింగిని మెరిసే నవతార 
జవరాలా జవరాలా
నా ఎదలో తీయని జలధారా

ఓఓ...జవరాలా జవరాలా
ఆ నింగిని మెరిసే నవతార 
జవరాలా జవరాలా
నా ఎదలో తీయని జలధారా

ఓఓఓ జవరాలా జవరాలా
నను అల్లుకుపోవే మనసారా
జవరాలా జవరాలా

ఆదివారం, జులై 22, 2018

ఒక దివ్య గానమే ప్రేమంటే...

డర్టీ పిక్చర్ చిత్రంలోని ఒక చక్కని ప్రేమ గీతాన్ని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : డర్టీ పిక్చర్ (2011)
సంగీతం : విశాల్ శేఖర్
సాహిత్యం :
గానం :

ఒక దివ్య గానమే ప్రేమంటే
ఎదలోని రాగమే ప్రేమంటే
మకరంద సారమే ప్రేమంటే
సుమ గంధమేలే అదీ

సెలయేటి నాదమే ప్రేమంటే
హరివిల్లు అందమే ప్రేమంటే
విడిపోని బంధమే ప్రేమంటే
నయనాన వెలుగే అదీ

ప్రియ నువ్వే జీవన జ్యోతివిలే
నా మదిలో పదిలము అయ్యావే
మురిపించవే మరిపించవే పలికేనే రాగ వీణా
నీకోసమే ప్రేమ దాచి ఉంచినానే
ప్రేమ దాచి ఉంచినానే ప్రేమ దాచి ఉంచినానే
నీకోసమే ప్రేమ దాచి ఉంచినానే
ప్రేమ దాచి ఉంచినానే ప్రేమ దాచి ఉంచినానే

ఒక దివ్య గానమే ప్రేమంటే
ఎదలోని రాగమే ప్రేమంటే
మకరంద సారమే ప్రేమంటే
సుమ గంధమేలే అదీ

ఉదయమైన నీ ఊహలే సంజె వేళ నీ ఊహలే
ఓఓ నువ్వే చెలి నా గమ్యమే రేపవలు నీ ధ్యాసలే
నీవులేని వెన్నెల రేయి చీకటులు కమ్మేస్తాయి
రావేల రంగుల చిలక నా ప్రేమ మొలక

నీకోసమే ప్రేమ దాచి ఉంచినానే
ప్రేమ దాచి ఉంచినానే ప్రేమ దాచి ఉంచినానే
నీకోసమే ప్రేమ దాచి ఉంచినానే
ప్రేమ దాచి ఉంచినానే ప్రేమ దాచి ఉంచినానే

జంటగానూ నడిచీ నడిచీ సొమ్మసిల్లి పోయానే
అదేబాటలోనే చేరవే మాటామంతి తోనే
నేటి రేయి సాగనున్నదే ఇదే రాతిరీ చేరవే
ఇక మనదే ఈ జగమే నీవెక్కడో నేనక్కడే
మన పెదవులే తడబడెనులే ఇక దూరమెందుకంటా

నీకోసమే ప్రేమ దాచి ఉంచినానే
ప్రేమ దాచి ఉంచినానే ప్రేమ దాచి ఉంచినానే
నీకోసమే ప్రేమ దాచి ఉంచినానే
ప్రేమ దాచి ఉంచినానే ప్రేమ దాచి ఉంచినానే 
 

శుక్రవారం, జులై 20, 2018

ఇండియా వాలే...

హ్యాపీ న్యూ ఇయర్ చిత్రంలోని ఒక హుషారైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : హాపీ న్యూ ఇయర్ (2014)
సంగీతం : విశాల్ శేఖర్  
సాహిత్యం : 
గానం : శంకర్ మహదేవన్, రాజీవ్

మాదేరా కోట మాదేరా
ఎద స్వప్నాలలో సదా కోటి అందాలకీ
అంతేసేయ్ చాతనైతే సై
అరె పోరే చెయ్ స్వారీ చెయ్
కుదిపే సునామీలవై
చేవ చూపించు ఈ జగానా
చావు లేదంట ఆశయానా
రాజాధిరాజ మార్తాండ తేజ
మస్తిష్క భోజులం మేమే

అంటారే అంతా ప్రేమతో ఇండియా వాలే
మోగిస్తాం మీ సితారలే ఇండియా వాలే
గెలిచేను చివరికి ఆశలే ఇండియా వాలే
దుష్మన్ కి చుక్కల్ చూపాంలే అరె ఇండియా వాలే
దుష్మన్ కి చుక్కల్ చూపాంలే అరె ఇండియా వాలే

అరె ఎంతో సరదాపడి విధి రాతల్ని
మాచేత్తో మేమే లిఖిస్తాం దొరా
ఓఓఓ అనుకో పర్లేదని కోటి కసిరేను
కలహాల జగమే భయం లేదురా
చేసినాం ఓమంచిపనిని
కల్తీ యే లేని ఓ వయ్యారి
తెరదించు యార్ చాల్లే పుకారు
పారాహుషారు పలకాలే

అంటారే అంతా ప్రేమతో ఇండియా వాలే
మోగిస్తాం మీ సితారలే ఇండియా వాలే
గెలిచేను చివరికి ఆశలే ఇండియా వాలే
దుష్మన్ కి చుక్కల్ చూపాంలే అరె ఇండియా వాలే
ఊరంతా ఆటే ఆడిస్తాం అరె ఇండియా వాలే

నీకంటి పూ వింటి బాణంతో ఆ ఇంద్రజాలంతో
తెరిచావు కోరి గుండెల్లో ద్వారం
ప్రాణాలే తీస్కో జమానాలే అన్నీ
ప్రమాణాలే వేస్తాడుగా వేగమై ఈనాడు 
ఇండియాలో లేదు ఏ ఖజానా
స్నెహమే తీపి ఓ థిల్లానా..
అసలొక్క మారుపుడితేనే ప్యారు
ఓ లక్షసార్లు చెబుదువులే

అంటారే అంతా ప్రేమతో ఇండియా వాలే
మోగిస్తాం మీ సితారలే ఇండియా వాలే
గెలిచేను చివరికి ఆశలే ఇండియా వాలే
దుష్మన్ కి చుక్కల్ చూపాంలే అరె ఇండియా వాలే
దుష్మన్ కి చుక్కల్ చూపాంలే అరె ఇండియా వాలే
ఊరంతా ఆటే ఆడిస్తాం అరె ఇండియా వాలే
దుష్మన్ కి చుక్కల్ చూపాంలే అరె ఇండియా వాలే

 

గురువారం, జులై 05, 2018

నీ.నీ.నీ.నీవల్లే...

బ్యాంగ్ బ్యాంగ్ చిత్రంలోని ఒక హుషారైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ ఛేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : బ్యాంగ్ బ్యాంగ్ (2014)
సంగీతం : విశాల్ శేఖర్
సాహిత్యం : కె.సుభాష్ చంద్రబోస్ 
గానం: బెన్నీదయాళ్

ఇవ్వాళే.. ఈ గాలుల్లో నా శ్వాసల్లో
ప్రవేశించె ఓ పరిమళం
నువ్విలా పువ్వులా నవ్వే వేళా
నీ.నీ.నీ.నీవల్లే..లే.లే.లే
వయసే..సే.సే. ఉరికెనే
మ.మ.మ.మంచల్లే..లే.లే.లే.
మనసే..సే.సే కరిగెనే

ఈరోజే నా గుండెల్లో నా ప్రాణంలో
ధ్వనించేనే ఓం స్వరం
మౌనమై పలుకగా నువ్వు గలగల
నీ.నీ.నీ.నీవల్లే..లే.లే.లే
వయసే..సే.సే. ఉరికెనే
మ.మ.మ.మంచల్లే..లే.లే.లే.
మనసే..సే.సే కరిగెనే

ఏదోమత్తే జల్లావే నేనే నువ్వయ్యేలా
నాకంతా నిజమే అనిపించావే
ఎంతో మాయలా ఇలాగే
నన్నిలాగే లాగావే తీపి వలా
నీ.నీ.నీ.నీవల్లే..లే.లే
వయసే..సే.సే. ఉరికెనే
మ.మ.మ.మంచల్లే..లే.లే
మనసే..సే.సే కరిగెనే

జీవితం జీవితం నీతోనే అందే నా జగం
నా జగం నీలో ఉందే
ఈ క్షణం శాశ్వతం అవ్వాలనుందే
సంబరం సాగరం కావాలనుందే
నేల చూడనీ పచ్చందనమే నువ్వనీ
నీలి నింగి చిందనీ పాల వర్షమే నువ్వనీ
నీతో జంట కానిదే జన్మకర్థమే లేదనీ
ఈనాడే తెలిసిందే తెలిసిందే తెలిసిందే

నీ.నీ.నీ.నీవల్లే..లే.లే.లే
వయసే..సే.సే. ఉరికెనే
మ.మ.మ.మంచల్లే..లే.లే
మనసే..సే.సే కరిగెనే

ఇవ్వాళే.. ఈ గాలుల్లో నా శ్వాసల్లో
ప్రవేశించె ఓ పరిమళం
నువ్విలా పువ్వులా నవ్వే వేళా
నీ.నీ.నీ.నీ.నీ.నీ.నీ.నీ.నీ..

నీ.నీ.నీ.నీవల్లే..లే.లే.లే
వయసే..సే.సే. ఉరికెనే
మ.మ.మ.మంచల్లే..లే.లే.లే.
మనసే..సే.సే కరిగెనే

నీ.నీ.నీ.నీవల్లే..లే.లే.లే
వయసే..సే.సే. ఉరికెనే
మ.మ.మ.మంచల్లే..లే.లే.లే.
మనసే..సే.సే కరిగెనే

శుక్రవారం, మే 11, 2018

మన కథ బ్యూటిఫుల్ లవ్...

నా పేరు సూర్య చిత్రంలోని ఒక చక్కని మెలోడీని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం :‌ నాపేరు సూర్య (2018)
‌సం‌గీతం :‌ విశాల్ శేఖర్
సాహిత్యం :‌ సిరివెన్నెల
‌గానం :‌ అర్మాన్ మలిక్, చైత్ర అంబడిపూడి
‌
పెదవులు దాటని పదం పదంలో
కనులలొ దాగని నిరీక్షణంలో
నాతో ఏదో అన్నావా
తెగి తెగి పలికె స్వరం స్వరంలో
తెలుపక తెలిపే అయోమయంలో
నాలో మౌనం విన్నావా
నాలానే నువ్వూ ఉన్నావా

మన కథ బ్యూటిఫుల్ లవ్
మన కథ బ్యూటిఫుల్ లవ్
పద పద ఫైండ్ ద మీనింగ్
లివ్ ద ఫీలింగ్ ఆఫ్ బ్యూటిఫుల్ లవ్

మన కథ బ్యూటిఫుల్ లవ్
మన కథ బ్యూటిఫుల్ లవ్
పద పద ఫైండ్ ద మీనింగ్
లివ్ ద ఫీలింగ్ ఆఫ్ బ్యూటిఫుల్ లవ్

ఏమైంది ఇంతలో నా గుండె లోతులో
ఎన్నడూ లేనిదీ కలవరం
కనుబొమ్మ విల్లుతో విసిరావొ ఏమిటో
సూటిగా నాటగా సుమశరం
తగిలిన తీయనైన గాయం
పలికిన హాయి కూని రాగం
చిలిపిగ ప్రాయమా మేలుకో అన్నదొ
ఏం జరగనుందో ఏమో ఈపైనా

మన కథ బ్యూటిఫుల్ లవ్
మన కథ బ్యూటిఫుల్ లవ్
పద పద ఫైండ్ ద మీనింగ్
లివ్ ద ఫీలింగ్ ఆఫ్ బ్యూటిఫుల్ లవ్

మన కథ బ్యూటిఫుల్ లవ్
మన కథ బ్యూటిఫుల్ లవ్
పద పద ఫైండ్ ద మీనింగ్
లివ్ ద ఫీలింగ్ ఆఫ్ బ్యూటిఫుల్ లవ్

బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ లవ్
బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ లవ్
బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ లవ్
బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ లవ్

నిగనిగలాడెను కణం కణం
నీ ఊపిరి తాకిన క్షణం క్షణంలో
నా తలపె వలపై మెరిసేలా
వెనకడుగేయక నిరంతరం
మన ప్రేమ ప్రవాహం మనోహరం
ప్రతి మలుపూ గెలుపై పిలిచేలా
బావుంది నీతో ఈ ప్రయాణం

మన కథ బ్యూటిఫుల్ లవ్
మన కథ బ్యూటిఫుల్ లవ్
పద పద ఫైండ్ ద మీనింగ్
లివ్ ద ఫీలింగ్ ఆఫ్ బ్యూటిఫుల్ లవ్

మన కథ బ్యూటిఫుల్ లవ్
మన కథ బ్యూటిఫుల్ లవ్
పద పద ఫైండ్ ద మీనింగ్
లివ్ ద ఫీలింగ్ ఆఫ్ బ్యూటిఫుల్ లవ్

మన కథ బ్యూటిఫుల్ లవ్
మన కథ బ్యూటిఫుల్ లవ్
పద పద ఫైండ్ ద మీనింగ్
లివ్ ద ఫీలింగ్ ఆఫ్ బ్యూటిఫుల్ లవ్

మన కథ బ్యూటిఫుల్ లవ్
మన కథ బ్యూటిఫుల్ లవ్
పద పద ఫైండ్ ద మీనింగ్
లివ్ ద ఫీలింగ్ ఆఫ్ బ్యూటిఫుల్ లవ్

శుక్రవారం, మే 04, 2018

ఓ సైనిక...

ఈ రోజు విడుదలవుతున్న నా పేరు సూర్య చిత్రం సక్సెస్ అవ్వాలని ఆల్ ద బెస్ట్ చెబుతూ అందులోని ఒక చక్కని పాటను తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు. ఎంబెడెడ్ లిరిక్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : నా పేరు సూర్య (2018)
సంగీతం : విశాల్ శేఖర్
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి
గానం : విశాల్ దడ్లాని

సరిహద్దున నువ్వు లేకుంటే
ఏ కనుపాప కంటినిండుగా
నిదురపోదురా నిదరపోదురా
నిలువెత్తున నిప్పు కంచివై నువ్వుంటేనే
జాతి భావుటా ఎగురుతుందిరా పైకెగురుతుందిరా

ఇల్లే ఇండియా దిల్లే ఇండియా
నీ తల్లే ఇండియా తన భరోసా నువ్వే దేశం కొడకా

సెలవే లేని సేవక ఓ సైనిక
పనిలో పరుగే తీరిక ఓ సైనిక
ప్రాణం అంత తేలిక ఓ సైనిక
పోరాటం నీకో వేడుక ఓ సైనిక

దేహంతో వెళిపోదీ కథ
దేశంలా మిగులుంటుందిగా
సమరం ఒడిలో నీ మరణం
సమయం తలచే సంస్మరణం
చరితగ చదివే తరములకు
నువ్వో స్పూర్తి సంతకం

పస్తులు లెక్కపెట్టవే ఓ సైనిక
పుస్తెలు లక్ష్యపెట్టవే ఓ సైనిక
గస్తీ దుస్తుల సాక్షిగా ఓ సైనిక
ప్రతి పూట నీకో పుట్టుకే ఓ సైనిక

బతుకిది గడవదు అని నువ్విటు రాలేదు
ఏ పని తెలియదు అని నీ అడుగిటు పడలేదు
తెగువగు ధీరుడివని బలమగు భక్తుడనీ
వేలెత్తి ఎలుగెత్తి భూమి పిలిచింది నీ శక్తిని నమ్మి

ఇల్లే ఇండియా దిల్లే ఇండియా
ఇల్లే ఇండియా దిల్లే ఇండియా
నీ తల్లే ఇండియా తన భరోసా నువ్వే దేశం కొడకా

నువ్వో మండే భాస్వరం ఓ సైనిక
జ్వాలా గీతం నీ స్వరం ఓ సైనిక
బ్రతుకే వందేమాతరం ఓ సైనిక
నీ వల్లే ఉన్నాం అందరం ఓ సైనిక 


నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.