శుక్రవారం, మే 04, 2018

ఓ సైనిక...

ఈ రోజు విడుదలవుతున్న నా పేరు సూర్య చిత్రం సక్సెస్ అవ్వాలని ఆల్ ద బెస్ట్ చెబుతూ అందులోని ఒక చక్కని పాటను తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు. ఎంబెడెడ్ లిరిక్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : నా పేరు సూర్య (2018)
సంగీతం : విశాల్ శేఖర్
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి
గానం : విశాల్ దడ్లాని

సరిహద్దున నువ్వు లేకుంటే
ఏ కనుపాప కంటినిండుగా
నిదురపోదురా నిదరపోదురా
నిలువెత్తున నిప్పు కంచివై నువ్వుంటేనే
జాతి భావుటా ఎగురుతుందిరా పైకెగురుతుందిరా

ఇల్లే ఇండియా దిల్లే ఇండియా
నీ తల్లే ఇండియా తన భరోసా నువ్వే దేశం కొడకా

సెలవే లేని సేవక ఓ సైనిక
పనిలో పరుగే తీరిక ఓ సైనిక
ప్రాణం అంత తేలిక ఓ సైనిక
పోరాటం నీకో వేడుక ఓ సైనిక

దేహంతో వెళిపోదీ కథ
దేశంలా మిగులుంటుందిగా
సమరం ఒడిలో నీ మరణం
సమయం తలచే సంస్మరణం
చరితగ చదివే తరములకు
నువ్వో స్పూర్తి సంతకం

పస్తులు లెక్కపెట్టవే ఓ సైనిక
పుస్తెలు లక్ష్యపెట్టవే ఓ సైనిక
గస్తీ దుస్తుల సాక్షిగా ఓ సైనిక
ప్రతి పూట నీకో పుట్టుకే ఓ సైనిక

బతుకిది గడవదు అని నువ్విటు రాలేదు
ఏ పని తెలియదు అని నీ అడుగిటు పడలేదు
తెగువగు ధీరుడివని బలమగు భక్తుడనీ
వేలెత్తి ఎలుగెత్తి భూమి పిలిచింది నీ శక్తిని నమ్మి

ఇల్లే ఇండియా దిల్లే ఇండియా
ఇల్లే ఇండియా దిల్లే ఇండియా
నీ తల్లే ఇండియా తన భరోసా నువ్వే దేశం కొడకా

నువ్వో మండే భాస్వరం ఓ సైనిక
జ్వాలా గీతం నీ స్వరం ఓ సైనిక
బ్రతుకే వందేమాతరం ఓ సైనిక
నీ వల్లే ఉన్నాం అందరం ఓ సైనిక 


2 comments:

బన్నీ మూవీస్ హిట్ ఐనా కాకపోయినా ఓ సారి చూడచ్చు..

అవును శాంతి గారు.. థాంక్స్ ఫర్ ద కామెంట్..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.