శుక్రవారం, మే 25, 2018

ఒక పాటై హాయిగ సాగేటి...

హోప్ అనే ప్రైవేట్ మ్యూజిక్ వీడియోలోని చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : హోప్ (2018)
సంగీతం : యదు కృష్ణ
సాహిత్యం : సంతోష్ శర్మ
గానం : సనూప్ కుమార్

ఒక పాటై హాయిగ సాగేటి బంధం ప్రణయం
చెలి నాకై వెన్నెలగా కరిగేటి బంధం ప్రణయం 
ఇది ఎదలోన వానై విరితేనెలిచ్చెను
శతకోటి జన్మలకూ నిలిచేను ఈ తోడు
పదిలం ఈ ప్రేమ గంథం
మన మనసే మధురాతి మధురం
పన్నీటి జల్లంది స్నేహం
నీ జతలో పలికే మనసే
పాడేనూ ఈ గానం

ఒక పాటై హాయిగ సాగేటి బంధం ప్రణయం
చెలి నాకై వెన్నెలగా కరిగేటి బంధం ప్రణయం 
ఇది ఎదలోన వానై విరితేనెలిచ్చెను
శతకోటి జన్మలకూ నిలిచేను ఈ తోడు
పదిలం ఈ ప్రేమ గంథం
మన మనసే మధురాతి మధురం
పన్నీటి జల్లంది స్నేహం
నీ జతలో పలికే మనసే
పాడేనూ ఈ గానం


వేల తారల్ని మురిపించు జాబిల్లి కోసం
అమవాసనోడించు విరహం
విరిసే పూలా సుగంధాల రాగాల కోసం
విరహాన్ని ఓడించు ప్రణయం
నీ మౌనం నిట్టూర్పై చూసెనుగా
నీ భావం నా గుండెను చేరెనుగా
కలనైనా నిన్నే చూపేటి కళ్ళే
నీ ప్రేమ కోరీ రచించేను ప్రణయం

ఏడు వర్ణాల కలపోత సంకల్ప స్వప్నం
మనకోసమందించు ప్రణయం
ఎదలో మన ప్రేమ భావం అనంతం అపూర్వం
కొలిచేను కొలువైన ప్రణయం
ఎన్నటికి నీ తోడు నేనొకరిని
నీవంటే నాలోని జీవనమే
పెనవేసే బంధం ఈ కొత్త జన్మం
జీవన నాదానా ధ్వనించేను హృదయం
ఈ కాలం.. 

2 comments:

చాలా అందమైన పాటండి..థాంక్స్ ఫర్ పోస్టింగ్..

నాకూ చాలా నచ్చిందండీ.. థాంక్స్ ఫర్ యువర్ కామెంట్..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.