గురువారం, మే 03, 2018

రంగస్థలం - అన్ని పాటలు

ఏ కవికైనా సంగీత దర్శకుడికైనా మంచి ప్రేరణనివ్వగలిగిన కథను పాటల సంధర్బాలను ఇచ్చి పూర్తి స్వేచ్ఛ్ఛ ఇస్తే ఎంతమంచి ఔట్ పుట్ వస్తుందో చెప్పడానికి నిదర్శనం రంగస్థలం పాటలు. ఈ మధ్యకాలంలో స్కిప్ కొట్టకుండా అన్ని పాటలు ఏకబిగిన వినగలిగిన అతి తక్కువ ఆల్బమ్స్ లో ముందుంటుందీ సినిమా ఆల్బం. జానపదాన్ని క్లాసికల్ సంగీతాన్ని మిక్స్ చేసి ఒక్కో పాటకు ఒక్కో ఫ్లేవర్ ను అందిస్తూ దేవీశ్రీ చక్కని బాణీలు అందిస్తే వాటికి చంద్రబోస్ పల్లెపదాలతో అల్లిన సాహిత్యం మనని ఎనభైల్లోకి అలా తీస్కెళ్ళిపోతుంది. ఇంతమంచి సినిమాని పాటలను అందించిన సుకుమార్ కి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ పాటలు ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడ్ చేసిన యూట్యూబ్ జ్యూక్ బాక్స్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : రంగస్థలం (2018)
సంగీతం : దేవీశ్రీప్రసాద్
సాహిత్యం : చంద్రబోస్
గానం : దేవీశ్రీప్రసాద్

యేరు సెనగ కోసం మట్టిని తవ్వితే
ఏకంగా దొరికిన లంకెబిందెలాగ
ఎంత సక్కగున్నావే లచ్చిమి ఎంత సక్కగున్నావె..

సింత సెట్టు ఎక్కి సిగురు కొయ్యాబోతే
చేతికి అందిన సందమామ లాగ
ఎంత సక్కగున్నావె లచ్చిమి ఎంత సక్కగున్నావె

మల్లెపూల మధ్య ముద్దబంతి లాగా
ఎంత సక్కగున్నావె
ముత్తయిదువ మెళ్లో పసుపు కొమ్ములాగ
ఎంత సక్కగున్నావె
చుక్కలసీర కట్టుకున్న ఎన్నెల లాగ
ఎంత సక్కగున్నావె

యేరు సెనగ కోసం మట్టిని తవ్వితే
ఏకంగా తగిలిన లంకెబిందెలాగ
ఎంత సక్కగున్నావే లచ్చిమి ఎంత సక్కగున్నావె..

సింత సెట్టు ఎక్కి సిగురు కొయ్యాబోతే
చేతికి అందిన సందమామ లాగ

ఎంత సక్కగున్నావె లచ్చిమి ఎంత సక్కగున్నావె

 
ఓ.. రెండు కాళ్ల సినుకువి నువ్వు
గుండె సెర్లో దూకేసినావు..
అలల మూటలిప్పేసినావు
ఎంత సక్కగున్నావె..లచ్చిమి..ఎంత సక్కగున్నావె
మబ్బులేని మెరుపువి నువ్వు..
నేలమీద నడిసేసినావు..
నన్ను నింగి సేసేసినావు
ఎంత సక్కగున్నావె లచ్చిమీ ఎంత సక్కగున్నావె
సెరుకుముక్క నువ్వు కొరికి తింటా వుంటే
ఎంత సక్కగున్నావె
సెరుకు గెడకే తీపి రుసి తెలిపీనావె
ఎంత సక్కగున్నావె

తిరునాళ్లలో తప్పి ఏడ్సేటి బిడ్డకు
ఎదురొచ్చిన తల్లి సిరునవ్వులాగ
ఎంత సక్కగున్నావె లచ్చిమీ ఎంత సక్కగున్నావె

గాలి పల్లకిలో ఎంకి పాటలాగ
ఎంకిపాటలోన తెలుగు మాటలాగ
ఎంత సక్కగున్నావె లచ్చిమి ఎంత సక్కగున్నావె

కడవ నువ్వు నడుమున బెట్టీ
కట్టమీద నడిసొస్తా వుంటే
సంద్రం నీ సంకెక్కినట్టూ
ఎంత సక్కగున్నావె లచ్చిమీ ఎంత సక్కగున్నావె
కట్టెల మోపు తలకెత్తుకుని
అడుగులోన అడుగేత్తా వుంటే
అడవి నీకు గొడుగట్టినట్టూ
ఎంత సక్కగున్నావె లచ్చిమీ ఎంత సక్కగున్నావె
బురదసేలో వరి నాటు యేత్తావుంటే
ఎంత సక్కగున్నావే భూమి బొమ్మకు నువ్వు
ప్రాణం పోస్తున్నట్టు ఎంత సక్కగున్నావె

యేరు సెనగ కోసం మట్టిని తవ్వితే
ఏకంగా తగిలిన లంకెబిందెలాగ
ఎంత సక్కగున్నావే లచ్చిమి ఎంత సక్కగున్నావె..

సింత సెట్టు ఎక్కి సిగురు కొయ్యాబోతే
చేతికి అందిన సందమామ లాగ
ఎంత సక్కగున్నావే లచ్చిమి ఎంత సక్కగున్నావె..


~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~

చిత్రం : రంగస్థలం (2018)
సంగీతం : దేవీశ్రీప్రసాద్
సాహిత్యం : చంద్రబోస్
గానం : రాహుల్ సిప్లిగంజ్

రంగా…రంగా రంగస్థలానా
రంగా…రంగ రంగస్థలానా

ఇనపడేట్టు కాదురా…కనపడేట్టు కొట్టండెహే

రంగా రంగా రంగస్థలానా..
రంగు పూసుకోకున్నా యేసమెసుకోకున్నా
ఆట బొమ్మలం అంట
మనమంతా తోలు బొమ్మలం అంట
ఆట బొమ్మలం అంటా
మనమంతా తోలు బొమ్మలం అంట

రంగా…రంగా రంగస్థలానా..
ఆట మొదలెట్టాక మధ్యలోని ఆపలేని
ఆట బొమ్మలం అంటా
మనమంతా తోలు బొమ్మలం అంట
ఆట బొమ్మలం అంటా
మనమంతా తోలు బొమ్మలం అంట


కనపడని సెయ్యేదో ఆడిస్తున్న
ఆట బొమ్మలం అంట
వినపడని పాటకి సిందాడేస్తున్న
తొలు బొమ్మలం అంట

డుంగురు డుంగురు డుంగురు
డుముకో డుంగురు డుంగురు డుంగురు
డుంగురు డుంగురు డుంగురు
డుముకో డుంగురు డుంగురు డుంగురు హొయ్యా..


రంగా రంగా రంగస్థలానా..
రంగు పూసుకోకున్నా యేసమెసుకోకున్నా
ఆట బొమ్మలం అంట
మనమంతా తోలు బొమ్మలం అంట
ఆట బొమ్మలం అంటా
మనమంతా తోలు బొమ్మలం అంట


హే.. గంగంటే శివుడి గారి పెళ్ళాం అంటా
గాలంటే హనుమంతుడి నాన్న గారంట
గాలి పీల్చడానికైన గొంతు తడవడానికైన
వాళ్ళు కనికరించాలంటా...

వేణువంటె కిట్టమూర్తి వాద్యం అంట
శూలమంటె కాళికమ్మ ఆయుధమంట
పాట పాడడానికైన పోటు పొడవడానికైన
వాళ్ళు ఆనతిస్తెనే అన్నీ జరిగేనంటా

రంగా రంగా రంగస్థలానా..
రంగు పూసుకోకున్నా యేసమెసుకోకున్నా
ఆట బొమ్మలం అంట
మనమంతా తోలు బొమ్మలం అంట
ఆట బొమ్మలం అంటా
మనమంతా తోలు బొమ్మలం అంట


హేయ్ డుంగురు డుంగురు డుంగురు
డుముకో డుంగురు డుంగురు డుంగురు
హేయ్ డుంగురు డుంగురు డుంగురు
డుముకో డుంగురు డుంగురు డుంగురు హొయ్యా..


పదితలలూ ఉన్నొడు రావణుడంటా
ఒక్క తలపుకూడ చెడు లేదే రాముడికంటా
రామరావణులబెట్టి రామయణమాటగట్టి
మంచిచెడులమధ్య మనని పెట్టారంట

ధర్మాన్నీ తప్పనోడు ధర్మరాజటా
దయలేనీ వాడు యమధర్మరాజటా
వీడిబాట నడవకుంటె వాడివేటు తప్పదంటు
ఈ బతుకును నాటకంగ ఆడిస్తున్నారంటా

రంగా రంగా రంగస్థలానా..
ఆడటానికంటె ముందు సాధనంటు సెయ్యలేని
ఆట బొమ్మలం అంట
మనమంతా తోలు బొమ్మలం అంట
ఆట బొమ్మలం అంటా
మనమంతా తోలు బొమ్మలం అంట


హెయ్ డుంగురు డుంగురు డుంగురు
డుముకో డుంగురు డుంగురు డుంగురు
హోయ్ డుంగురు డుంగురు డుంగురు
డుముకో డుంగురు డుంగురు డుంగురు హొయ్యా.


~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~

ఎంబెడ్ చేసిన వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : రంగస్థలం (2018)
సంగీతం : దేవీశ్రీప్రసాద్
సాహిత్యం : చంద్రబోస్
గానం : ఎం.ఎం.మానసి

ఓయ్ రంగమ్మా మంగమ్మా
ఓయ్ రంగమ్మా మంగమ్మా

రంగమ్మ మంగమ్మ యేం పిల్లడూ
పక్కనే వుంటాడమ్మా పట్టించుకోడు
రంగమ్మ మంగమ్మ యేం పిల్లడూ
పక్కనే వుంటాడమ్మా పట్టించుకోడు

గొల్లబామ వచ్చి నా గోరు గిల్లుతుంటే
గొల్లబామ వచ్చి నా గోరు గిల్లుతుంటే
పుల్ల చీమ కుట్టి నా పెదవి సలుపుతుంటే

ఉఫ్ఫమ్మ ఉఫ్ఫమ్మ అంటూ ఊదడు
ఉత్తమాటకైన నన్ను ఉరుకోబెట్టడు
ఉఫ్ఫమ్మ ఉఫ్ఫమ్మ అంటూ ఊదడు
ఉత్తమాటకైన నన్ను ఉరుకోబెట్టడు

ఆడి పిచ్చి పిచ్చి ఊసులోన మునిగి తేలుతుంటే
మరిచిపోయి మిరపకాయి కొరికినానంటే

మంటమ్మ మంటమ్మ అంటే సూడడు
మంచి నీళ్ళైన సేతికియ్యడు
మంటమ్మ మంటమ్మ అంటే సూడడు
మంచి నీళ్ళైన సేతికియ్యడు

ఓయ్ రంగమ్మా మంగమ్మా
రంగమ్మా మంగమ్మా
రంగమ్మ మంగమ్మ యేం పిల్లడూ
పక్కనే వుంటాడమ్మా పట్టించుకోడు


హేయ్ రామా సిలకమ్మ
రేగి పండు కొడుతుంటే యే
రేగి పండు గుజ్జు వచ్చి కొత్తగా
సుట్టుకున్న రైక మీద పడుతుంటే యే

హేయ్ రామ సిలకమ్మ
రేగి పండు కొడితే రేగిపండు
గుజ్జు నా రైక మీద పడితే

మరకమ్మా మరకమ్మా అంటే సుడడు
మారు రైకైన తెచ్చి ఇయ్యడు.
మరకమ్మా మరకమ్మా అంటే సుడడు
మారు రైకైన తెచ్చి ఇయ్యడు.

రంగమ్మా మంగమ్మా
రంగమ్మా మంగమ్మా
రంగమ్మ మంగమ్మ యేం పిల్లడూ
పక్కనే వుంటాడమ్మా పట్టించుకోడు


నా అందమంతా మూట గట్టి
అరె కంది సేనుకే ఎళితే
ఆ కందిరీగలోచ్చి అడ ఈడ గుచ్చి
నన్ను సుట్టు ముడుతుంటే

యే నా అందమంతా మూట గట్టి
కంది సేనుకెళితే
కందిరీగలోచ్చి నన్ను
సుట్టు ముడుతుంటే

ఉష్అమ్మ ఉష్అమ్మ అంటూ తోలడు
ఉలకడు పలకడు బండరాముడు
ఉష్అమ్మ ఉష్అమ్మ అంటూ తోలడు
ఉలకడు పలకడు బండరాముడు

రంగమ్మా మంగమ్మా
రంగమ్మా మంగమ్మా
హోయ్ రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు
పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు
హేయ్ రంగమ్మ మంగమ్మ యేం పిల్లడూ
పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు


~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~

చిత్రం : రంగస్థలం (2018)
సంగీతం : దేవీశ్రీప్రసాద్
సాహిత్యం : చంద్రబోస్
గానం : శివనాగులు

ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా
ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా నాగన్న

హే.. ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా
ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా
ఆ గట్టునేమో సీసాడు సార ఉంది
కుండేడు కల్లు ఉంది బుట్టేడు బ్రాంది ఉందీ
ఈ గట్టునేమో ముంతడంత మజ్జిగుంది

ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా
ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా


ఆ దిబ్బనుంటావా నాగన్న ఈ దిబ్బకొస్తావా
ఆ దిబ్బనుంటావా నాగన్న ఈ దిబ్బకొస్తావా
ఆ దిబ్బనేమో తోడేళ్ళ దండు ఉంది
నక్కాల మూక ఉంది పందికొక్కుల గుంపు ఉందీ
ఈ దిబ్బనేమో గోవుల మంద ఉంది

ఆ దిబ్బనుంటావా నాగన్న ఈ దిబ్బకొస్తావా
ఆ దిబ్బనుంటావా నాగన్న ఈ దిబ్బకొస్తావా


ఆ గడప నుంటావా నాగన్న ఈ గడపకొస్తావా
ఆ గడప నుంటావా నాగన్న ఈ గడపకొస్తావా
ఆ గడపనేమో గన్నేరు పప్పు ఉంది
గుర్రాపు డెక్క ఉంది గంజాయి మొక్క ఉంది
ఈ గడపనేమో గంధపు చెక్క ఉందీ

ఆ గడప నుంటావా నాగన్న ఈ గడపకొస్తావా
ఆ గడప నుంటావా నాగన్న ఈ గడపకొస్తావా


ఈ ఏపుకొస్తావా నాగన్న ఆ ఏపునుంటావా నాగన్న
ఈ ఏపుకొస్తావా నాగన్న ఆ ఏపునుంటావా
ఈ ఏపునేమో న్యాయముంది ధర్మముంది
బద్దం ఉంది శుద్దముందీ
ఆ ఏపునన్నిటికి ముందర ఆ ఉందీ
అంటే..... అన్యాయం అధర్మం అబద్దం అశు.. ఉష్షూ..
అందుకనీ....

ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా నాగన్న
ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా నాగన్న

 

~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~

చిత్రం : రంగస్థలం (2018)
సంగీతం : దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం : చంద్రబోస్
గానం : రేలా కుమార్ , గంటా వెంకట లక్ష్మీ

రంగస్థల గ్రామ ప్రజలందరికి  విజ్ఞప్తి
మనందరి కళ్ళల్లో జిగేలు నింపడానికి
జిగేలు రాణి వచ్చేసింది ఆడి పాడి అలరించేస్తది అంతే...
మీరందరు రెడీ గా ఉండండి
అమ్మ జిగేల్ రాణి వచ్చెయ్యమ్మా నువ్వు

ఒరెఒరెఒరెఒరే...
ఇంతమంది జిగేల్ రాజాలు ఉన్నారా మీ ఊళ్ళో

మరి ఉండ్రా ఏంటి నువ్వత్తన్నావ్ అని తెలిసీ
పక్కురినుండి కూడా వచ్చాం.. ఎగేసుకుంటూ
ఇదిగో ఆ గళ్ళ సొక్కా జిగేల్ రాజా ఏంది
గుడ్లప్పగించి సూత్తన్నాడు నా వంకే

నువ్వేదో ఇత్తావని జిగేల్ రాణి
నువ్వేందయ్యా పూల సొక్కా
ఓ మీద మీద కొత్తన్నావో
ఇదిగో ఎవ్వరు తోసుకోకండీ
అందరి దగ్గరకు నేనే వస్తా

అందరడిగింది ఇచ్చే పోతా.... అదీ

ఓ ముద్దు పెట్టవే జిగేలు రాణీ
కన్నైనా కొట్టవే జిగేలు రాణీ
ఓ ముద్దు పెట్టవే జిగేలు రాణీ
కన్నైనా కొట్టవే జిగేలు రాణీ

ముద్దేమో మునసబుకి పెట్టెశానే
కన్నేమో కరణానికి కొట్టేశానే
ముద్దేమో మునసబుకి పెట్టెశానే
కన్నేమో కరణానికి కొట్టేశానే


ఒక్కసారి వాటేత్తావా జిగేలు రాణీ
కొత్త ప్రెసిడెంటు కది దాచుంచానే
మాపటేల ఇంటికొత్తవా జిగేలు రాణీ
మీ అయ్యతోని పోటీ నీకు వద్దంటానే
మరి నాకేమిత్తావే జిగేలు రాణే.ఏఏఏ..హోయ్
నువ్ కోరింది ఏదైనా ఇచ్చేస్తానే

జిల్ జిల్ జిల్ జిల్ జిగేలు రాజా
నువ్వడిగితె ఏదైనా కాదంటానా
జిల్ జిల్ జిల్ జిల్ జిగేలు రాజా
ఉన్నదడిగితే నేను లేదంటానా


నీ వయసూ సెప్పవే జిగేలు రాణీ
అది ఆరో క్లాసులో ఆపేశానే
నువు సదివెందెంతే జిగేలు రాణీ
మగాళ్ళా ఈకునెస్సు చదివేశానే
ఓ నవ్వు నవ్వవే జిగేలు రాణీ
సుబ్బిశెట్టి పంచి ఊడితే నవ్వేశానే
నన్ను బావా అనవే జిగేలు రాణీ
అది పోలీసోళ్ళకి రిజర్వేషనే
ప్రేమిస్తావా నన్ను జిగేలు రాణే..ఏఏ..హేయ్..
రాసిస్తావా మరి నీ ఆస్తి పాస్తినీ

జిల్ జిల్ జిల్ జిల్ జిగేలు రాజా
నువ్వడిగితె ఏదైనా కాదంటానా
జిల్ జిల్ జిల్ జిల్ జిగేలు రాజా
ఉన్నదడిగితే నేను లేదంటానా


ఐబాబోయ్ అదేంటి జిగేల్రాణీ
ఏదడిగినా లేదంటావ్
నీ దగ్గర ఇంకేం ఉంది చెప్పూ
నీకేం కావాలో చెప్పూ

హేయ్....నువ్ పెట్టిన పూలు ఇమ్మంటామూ
పూలతోటి వాటిని పూజిస్తామూ
నువ్ కట్టిన కోకా ఇమ్మంటామూ
దాన్ని చుట్టుకు మేమూ పడుకుంటామూ
నువు ఏసిన గాజులు ఇమ్మంటామూ
వాటి సప్పుడు వింటూ సచ్చిపోతమూ
అరె నువు పూసిన సెంటూ ఇమ్మంటామూ
ఆ వాసన చూస్తూ బతుకంతా బ్రతికేత్తామూ

జిల్ జిల్ జిల్ జిల్ జిగేలు రాజా
వాటిని వేలం పాటలో పెట్టాను రాజా
జిల్ జిల్ జిల్ జిల్ జిల్ జిగేలు రాజా
ఎవడి పాట వాడు పాడండోయ్ రాజా


నా పాటా ఏలికున్న ఉంగరం
నా పాట తులం బంగారం
నా పాట సంతలో కొన్న కోడెద్దు
నా పాటా పులి గోరూ
వెండి పళ్ళెం.. ఎకరం మామిడి తోట
మా ఆవిడ తెచ్చిన కట్నం
కొత్తగా కట్టించుకున్న ఇల్లూ
నా పాట రైసు మిల్లూ
అహే ఇవన్ని కాదు కానీ
నా పాట క్యాషు లక్షా
అయిబాబోయ్ లచ్చే....

~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~

 ఎంబెడ్ చేసిన ఈ పాట లిరికల్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


  
చిత్రం : రంగస్థలం (2018)
సంగీతం : దేవిశ్రీప్రసాద్
సాహిత్యం : చంద్రబోస్
గానం : చంద్రబోస్

ఓరయ్యో నా అయ్యా
ఓరయ్యో నా అయ్యా

ఈ సేతితోనే పాలుపట్టాను
ఈ సేతితోనే బువ్వ పెట్టాను

ఈ సేతితోనే తలకు పోసాను
ఈ సేతితోనే కాళ్లు పిసికాను

ఈ సేతితోనే పాడెమొయ్యాలా
ఈ సేతితోనే కొరివి పెట్టాలా

ఓరయ్యో నా అయ్యా
ఓరయ్యో నా అయ్యా


ఈ సేతితోనే పాలుపట్టాను
ఈ సేతితోనే బువ్వ పెట్టాను

ఈ సేతితోనే తలకు పోసాను
ఈ సేతితోనే కాళ్లు పిసికాను

ఈ సేతితోనే పాడెమొయ్యాలా
ఈ సేతితోనే కొరివి పెట్టాలా

ఓరయ్యో నా అయ్యా
ఓరయ్యో నా అయ్యా


మాకు దారి సూపిన కాళ్ళు కట్టెల పాలాయేనా
మా బుజము తట్టిన సేతులు బూడిదైపోయేనా

మా కలలు సూసిన కళ్ళు కాలి కమిలిపోయేనా
మమ్ము మేలుకొలిపిన గొంతు గాఢ నిదురపోయేనా

మా బాధలనోదార్చే తోడుండె వాడివిరో
ఈ బాధను ఓదార్చ నువ్వుంటే బాగుండెరా

ఓరయ్యో నా అయ్యా
ఓరయ్యో నా అయ్యా


ఈ సేతితోనే దిష్టి తీసాను
ఈ సేతితోనే ఎన్ను నిమిరాను

ఈ సేతితోనే నడక నేర్పాను
ఈ సేతితోనే బడికి పంపాను

ఈ సేతితోనే కాటికి పంపాలా
ఈ సేతితోనే మంటల కలపాలా

ఓరయ్యో నా అయ్యా
ఓరయ్యో నా అయ్యా

 
తమ్ముడు నీ కోసం తల్లడిల్లాడయ్యా
సెల్లి గుండె నీకై సెరువై పోయిందయ్యా

కంచంలోని మెతుకు నిన్నె ఎతికేనయ్యా
నీ కళ్లద్దాలు నీకై కలియజూసెనయ్యా

నువ్వుతొడిగిన సొక్కా నీకై దిగులుపడి
సిలకకొయ్యకురి  పెట్టుకుందిరయ్యా

రంగస్థలానా..ఆఆ...
రంగస్థలాన నీ పాత్ర ముగిసేనా
వల్లకాట్లో శూన్యం పాత్ర మెదలయ్యేనా

నీ  నటనకు కన్నీటి సప్పట్లు కురిసెనా

నువ్వెళ్ళోత్తానంటూ సెప్పే వుంటావురా
మా పాపపు సెవికది యినపడకుంటదిరా

ఓరయ్యో నా అయ్యా
ఓరయ్యో నా అయ్యా 

2 comments:

వన్స్ యెగైన్ దేవి రాక్స్..

ఎస్ వన్ ఆఫ్ హిజ్ బెస్ట్.. థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.