మంగళవారం, మే 01, 2018

ఎంత సక్కగున్నావే...

రంగస్థలం చిత్రం లోని ఒక చక్కని మెలోడీని ఈ రోజు తలచుకుందాం. ఊరిలో వర్షం పడినపుడు ఓ గమ్మత్తైన మట్టివాసన వస్తుంది మీరెపుడైనా గమనించారా.. దాన్ని గుండెల నిండా పీల్చుకుంటే ఎంత హాయిగా ఉంటుందో ఈ పాట విన్న ప్రతీసారీ అంతే హాయిగా ఉంటుంది. చంద్రబోస్ గారు అందమైన భావాలను చిన్న చిన్న పల్లెపదాలలో అల్లితే దానికి అంతే అందంగా బాణీకట్టి గాత్రాన్నిచ్చి జీవంపోశారు దేవీశ్రీప్రసాద్ గారు. వీరిద్దరిని ఇంతగా కదిలించగలిగిన పాత్రలతో కథని రూపొందించిన సుకుమార్ గారిని తలచుకోకుండా ఉండగలమా. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : రంగస్థలం (2018)
సంగీతం : దేవీశ్రీప్రసాద్
సాహిత్యం : చంద్రబోస్
గానం : దేవీశ్రీప్రసాద్

యేరు సెనగ కోసం మట్టిని తవ్వితే
ఏకంగా దొరికిన లంకెబిందెలాగ
ఎంత సక్కగున్నావే లచ్చిమి ఎంత సక్కగున్నావె..

సింత సెట్టు ఎక్కి సిగురు కొయ్యాబోతే
చేతికి అందిన సందమామ లాగ
ఎంత సక్కగున్నావె లచ్చిమి ఎంత సక్కగున్నావె

మల్లెపూల మధ్య ముద్దబంతి లాగా
ఎంత సక్కగున్నావె
ముత్తయిదువ మెళ్లో పసుపు కొమ్ములాగ
ఎంత సక్కగున్నావె
చుక్కలసీర కట్టుకున్న ఎన్నెల లాగ
ఎంత సక్కగున్నావె

యేరు సెనగ కోసం మట్టిని తవ్వితే
ఏకంగా తగిలిన లంకెబిందెలాగ
ఎంత సక్కగున్నావే లచ్చిమి ఎంత సక్కగున్నావె..

సింత సెట్టు ఎక్కి సిగురు కొయ్యాబోతే
చేతికి అందిన సందమామ లాగ
ఎంత సక్కగున్నావె లచ్చిమి ఎంత సక్కగున్నావె

ఓ.. రెండు కాళ్ల సినుకువి నువ్వు
గుండె సెర్లో దూకేసినావు..
అలల మూటలిప్పేసినావు
ఎంత సక్కగున్నావె..లచ్చిమి..ఎంత సక్కగున్నావె
మబ్బులేని మెరుపువి నువ్వు..
నేలమీద నడిసేసినావు..
నన్ను నింగి సేసేసినావు 
ఎంత సక్కగున్నావె లచ్చిమీ ఎంత సక్కగున్నావె
సెరుకుముక్క నువ్వు కొరికి తింటా వుంటే
ఎంత సక్కగున్నావె
సెరుకు గెడకే తీపి రుసి తెలిపీనావె
ఎంత సక్కగున్నావె

తిరునాళ్లలో తప్పి ఏడ్సేటి బిడ్డకు
ఎదురొచ్చిన తల్లి సిరునవ్వులాగ
ఎంత సక్కగున్నావె లచ్చిమీ ఎంత సక్కగున్నావె

గాలి పల్లకిలో ఎంకి పాటలాగ
ఎంకిపాటలోన తెలుగు మాటలాగ
ఎంత సక్కగున్నావె లచ్చిమి ఎంత సక్కగున్నావె

కడవ నువ్వు నడుమున బెట్టీ
కట్టమీద నడిసొస్తా వుంటే
సంద్రం నీ సంకెక్కినట్టూ
ఎంత సక్కగున్నావె లచ్చిమీ ఎంత సక్కగున్నావె
కట్టెల మోపు తలకెత్తుకుని
అడుగులోన అడుగేత్తా వుంటే
అడవి నీకు గొడుగట్టినట్టూ
ఎంత సక్కగున్నావె లచ్చిమీ ఎంత సక్కగున్నావె
బురదసేలో వరి నాటు యేత్తావుంటే
ఎంత సక్కగున్నావే భూమి బొమ్మకు నువ్వు
ప్రాణం పోస్తున్నట్టు ఎంత సక్కగున్నావె

యేరు సెనగ కోసం మట్టిని తవ్వితే
ఏకంగా తగిలిన లంకెబిందెలాగ
ఎంత సక్కగున్నావే లచ్చిమి ఎంత సక్కగున్నావె..

సింత సెట్టు ఎక్కి సిగురు కొయ్యాబోతే
చేతికి అందిన సందమామ లాగ
ఎంత సక్కగున్నావే లచ్చిమి ఎంత సక్కగున్నావె..


2 comments:

ఈ పాట విన్న వెంటనే చాలా మందిలానే నాకూ లిరిక్స్ చాలా చాలా నచ్చేశాయి..

అవునండీ చంద్రబోస్ గారు మ్యాజిక్ చేసేశారు. థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.