బుధవారం, మే 16, 2018

జిఎస్టీలా నువ్వే వచ్చి...

ఇంద్రసేన చిత్రంలోని ఒక చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : ఇంద్రసేన (2017)
సంగీతం : విజయ్ ఆంథోని
సాహిత్యం : భాష్యశ్రీ
గానం : హేమచంద్ర, సుప్రియ జోషి

  
    జిఎస్టీలా నువ్వే వచ్చి ఎంతపని చేస్తివే
మాటైనా చెప్పక వచ్చి తీపి కోతే కోస్తివే
భూకంపం మాదిరి వచ్చి బొమ్మే చూపి పోతివే
చూపుల్తో గునపాలే గుచ్చి గుండే లాక్కుపోతివే
నిద్దురపోయే నా కంటి నిద్దురమొత్తం
వీడిపోయే హే నీవల్లే
చేరిపోయే నా రక్తంలో మత్తే ఎక్కి
తూగిపోయే హే నా వల్లే

జిఎస్టీలా నువ్వే వచ్చి ఎంతపని చేస్తివే
మాటైనా చెప్పక వచ్చి తీపి కోతే కోస్తివే
భూకంపం మాదిరి వచ్చి బొమ్మే చూపి పోతివే
చూపుల్తో గునపాలే గుచ్చి గుండే లాక్కుపోతివే


ఎన్నెన్నో జన్మాలు వెతికాయి రాత్రంత
నా రెండు నయనాలు నీకోసము
నాలోని ఎరుపంత మింగేసి నీ పెదవి
కసితీర తీస్తుందె నా ప్రాణము
ఓఓ నడిచేటి నదిలాగె వచ్చావురా
అదిరేటి ఎద చప్పుడయ్యావురా
నన్నైన నే మరిచి పోగలనురా
అరె నిను మరిచి పోతే నేనుంటానయ్యా


జిఎస్టీలా నువ్వే వచ్చి ఎంతపని చేస్తివే
మాటైనా చెప్పక వచ్చి తీపి కోతే కోస్తివే
భూకంపం మాదిరి వచ్చి బొమ్మే చూపి పోతివే
చూపుల్తో గునపాలే గుచ్చి గుండే లాక్కుపోతివే

ఆకాశమేదాటి స్వర్గాలె వెతికాను
నీలాంటి దేవత లేనే లేదు
ఏ భాషలేనట్టి నీ కంటి ఊసులకు
అర్ధాలు వెదికేను నా ధ్యానము
నువ్ ఔనన్న కాదన్న నా సోకువి
ఏడ్చిన నవ్విన నా బంటువి
గెలిచిన ఓడిన నా విజయమే
విడిచిన దాచిన నా ప్రాణమే


జిఎస్టీలా నువ్వే వచ్చి ఎంతపని చేస్తివే
మాటైనా చెప్పక వచ్చి తీపి కోతే కోస్తివే
భూకంపం మాదిరి వచ్చి బొమ్మే చూపి పోతివే
చూపుల్తో గునపాలే గుచ్చి గుండే లాక్కుపోతివే 


2 comments:

భలే సాంగ్ ఇది..చాలా కలర్ఫుల్గా ఉంటుంది..

అవునండీ చిత్రీకరణ బావుంటుంది. థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.