సోమవారం, మే 28, 2018

చూసీ చూడంగానే...

ఛలో చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : ఛలో (2018)
సంగీతం : మహతి స్వర సాగర్
సాహిత్యం : భాస్కరభట్ల
గానం : అనురాగ్ కులకర్ణి, సాగర్

చూసి చూడంగానే  నచ్చేసావే
అడిగి అడగకుండా వచ్చేసావే
నా మనసులోకి .. హో..
అందంగా దూకి


దూరం దూరంగుంటూ ఎం చేసావే
దారం కట్టి గుండె ఎగరేసావే

ఓ చూపుతోటి హో..
ఓ నవ్వుతోటి..

తొలిసారిగా...
నా లోపల...
ఏమయ్యిందో...
తెలిసేదెలా..

నా చిలిపి అల్లర్లు
నా చిన్ని సరదాలు
నీలోనే చూసానులే ..

నీ వంక చూస్తుంటే
అద్దంలో నను నేను 
చూస్తున్నట్టే ఉందిలే..
హో...
 
నీ చిత్రాలు ఒక్కోటి చూస్తూ ఉంటే
ఆహ ఈ జన్మకి ఇది చాలు అనిపిస్తుందే
నువ్ నా కంటపడకుండా 
నా వెంట పడకుండా
ఇన్నాళ్ళెక్కడ ఉన్నావే
నీ కన్నుల్లో ఆనందం వస్తుందంటే
నేనెన్నెన్నో యుద్దాలు చేస్తానులే
నే చిరునవ్వుకై నేను గెలుపొంది వస్తాను
హామీ ఇస్తునానులే
ఒకటో ఎక్కం కూడా
మరిచిపోయేలాగా
ఒకటే గుర్తొస్తావే ...
నిను చూడకుండా ఉండగలనా

నా చిలిపి అల్లర్లు
నా చిన్ని సరదాలు
నీలోనూ చూసానులే ..
నీ వంక చూస్తుంటే
అద్దంలో నను నేను 
చూస్తున్నట్టే ఉందిలే
హో...

2 comments:

కొత్తగా వచ్చిన సాంగ్స్ లో బాగా నచ్చిన వాటిలో ఇదీ ఒకటీ..ఇద్దరూ చాలా క్యూట్ గా ఉన్నారు..

అవునండీ సినిమా కూడా బావుంటుంది.. థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.