మంగళవారం, మే 22, 2018

చినుకు చినుకు రాలగా...

మళ్ళీరావా చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ ఛేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. పూర్తి పాట లిరికల్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : మళ్ళీరావా (2017)
సంగీతం : శ్రవణ్ భరద్వాజ్
సాహిత్యం : కృష్ణకాంత్
గానం : కార్తీక్

చినుకు చినుకు రాలగా
తెగిన తార తీరుగా
నడిచి వచ్చె నేరుగా
తళుకు తళుకు దేవతా

కాలం కదిలే...
వేగం వదిలే...
నేలంత వణికే...
కాలి కిందగా !!!

రెప్పలే రెక్కలై
కన్నులే తేలెనే....!
గుండెకే చక్కిలిగింతలా
తోచేనే... హేహే

మీసమైన రాని పెదవి
మోయనంత సంతోషం
క్షణముకొక్క కొత్త జన్మ
ఎత్తుతున్న సందేహం...

మాటలసలే బయటపడని
మధురమైన ఓ భావం
వేల వేల కవితలైన
చాలనంత ఉల్లాసం....!

కోటిరంగులే ఒక్కసారిగా
నిన్నలన్ని ముంచుతున్న వెల్లువా
చల్లగాలులే ఉక్కపోతలా
ఉందిలే చూస్తే నువ్వలా
ఎంత చెప్పినా తక్కువేనుగా
చిన్ని గుండె తట్టుతున్న తూఫానిదే
చుట్టుపక్కలా ఎవ్వరొద్దనే
కొత్త కొత్త ఆశ రేపే
తొలిప్రేమిదే 2 comments:

నైస్ సాంగ్..

థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.