తొలిప్రేమ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : తొలిప్రేమ (2018)
సంగీతం : ఎస్.ఎస్.థమన్
సాహిత్యం : శ్రీమణి
గానం : శ్రేయా ఘోషల్
అల్లసాని వారి పద్యమా
విశ్వనాధ వారి ముత్యమా... ముత్యమా
కాళిదాసు ప్రేమ కావ్యమా ... కావ్యమా
త్యాగరాజు సంగీతమా ... గీతమా
అల్లసాని వారి పద్యమా
విశ్వనాధ వారి ముత్యమా... ముత్యమా
కాళిదాసు ప్రేమ కావ్యమా ... కావ్యమా
త్యాగరాజు సంగీతమా ... గీతమా
పోలికే లేని పాటలా
నువ్వు పిలిచావు నన్నిలా
చిన్ని చిరునవ్వు లేత చిగురాశ
మళ్ళి పూసాయిలే ఇలా
డి డి డి డెస్టినీ
లైఫే మారిందని ఏదో జరిగిందని
ఇట్స్ గాట్ మీ ఫీలింగ్ సో హేవెన్లీ
డి డి డి డెస్టినీ
లైఫే మారిందని ఏదో జరిగిందని
ఇట్స్ గాట్ మీ ఫీలింగ్ సో హేవెన్లీ
హ అల్లసాని వారి పద్యమా
విశ్వనాధ వారి ముత్యమా... ముత్యమా
కాళిదాసు ప్రేమ కావ్యమా ... కావ్యమా
త్యాగరాజు సంగీతమా ... గీతమా.. ఆఆఅ..
నీడలా నువ్వొచ్చి వెంటవాలగా
గుండెలో ఉయ్యాలలూగినట్టుగా
గొంతులో స్వరాల మూగపిలిపులే
సందడి చేసెనా
తోడులా నువ్వొచ్చి దగ్గరవ్వగా
ఇంతలో ఎన్నెన్ని వింతలో ఇలా
కాంతుల కలల్ని జల్లినట్టుగా
ప్రాణం మురిసేనా.. ఆఅ..
తేనెలో ఉన్న తియ్యనా
బాషలో ఉన్న లాలనా
గుమ్మరిస్తున్నా పొంగిపోతున్న
నిన్ను కలిసేటి వేళలా
కాలమే దోబూచులాడుతున్నదో
కానుకే క్షణాలు పంచుతున్నదో
కారణం ఊహించనివ్వనన్నదో
ఏమౌతున్నదో
స్వప్నమే నిజంగా మారుతున్నదో
సాగరం నదల్లె పారుతున్నదో
సత్యమే ఇదంతా నమ్మనన్నదో
ఏమంటున్నదో..ఓఓఓ..
మరిచిపోయాను నన్నిలా
మరిచిపోలేక నిన్నిలా
లేత ప్రాయాల పాత ప్రణయాలే
కొత్తగా పూతలేసేలా.. హా..హాఅ...
డి డి డి డెస్టినీ
లైఫే మారిందని ఏదో జరిగిందని
ఇట్స్ గాట్ మీ ఫీలింగ్ సో హేవెన్లీ
డి డి డి డెస్టినీ
లైఫే మారిందని ఏదో జరిగిందని
ఇట్స్ గాట్ మీ ఫీలింగ్ సో హేవెన్లీ
2 comments:
ఈ పాట విన్నప్పుడల్లా..బాపుగారో, వంశీగారో ఈ పాటని తీసి ఉంటే యెలా ఉండేదో అనిపిస్తుందండీ..
ఈ పాట చిత్రీకరణ కూడా బావుంటుందండీ.. వాళ్ళైతే మరింత బాగా తీసుండేవారేమో.. థాంక్స్ ఫర్ ద కామెంట్.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.