గురువారం, మే 31, 2018

ఊహలు ఊరేగే గాలంతా...

ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న సమ్మోహనం చిత్రంలోని ఒక మంచి పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : సమ్మోహనం (2018)
సంగీతం : వివేక్ సాగర్
సాహిత్యం : సిరివెన్నెల 
గానం : హరిచరణ్, కీర్తన

ఊహలు ఊరేగే గాలంతా
ఇది తారలు దిగివచ్చే వేళంటా
ఊహలు ఊరేగే గాలంతా
ఇది తారలు దిగివచ్చే వేళంటా
ఈ సమయానికి తగుమాటలు ఏమిటో
ఎవ్వరినడగాలట
చాలా పద్దతిగా భావం తెలిసి
ఏదో అనడం కంటే
సాగే కబుర్లతో కాలం మరిచి
సరదా పడదామంతే

ఊహలు ఊరేగే గాలంతా
ఇది తారలు దిగివచ్చే వేళంటా

పరవశమా మరీ ఇలా
పరిచయమంత లేదుగా
పొరబడిపోకు అంతలా
నను అడిగావా ముందుగా

నేనేదో భ్రమలో ఉన్నానేమో
నీ చిరునవ్వేదో చెబుతోందని
అది నిజమే అయినా
నాతో అనకూ నమ్మలేనంతగా..


ఊహలు ఊరేగే గాలంతా
ఇది తారలు దిగివచ్చే వేళంటా


తగదు సుమా అంటూ ఉంటే
తలపు దుమారం ఆగదే

తొలి దశలో అంతా ఇంతే
కలవరపాటు తేలదే
ఈ బిడియం గడియే తెరిచేదెపుడో
నా మదిలో మాట తెలిపేందుకు

ఇదిగో ఇదదే అనుకోమనకు
ఆశలే రేపగా...ఆఆ...

ఊహలు ఊరేగే గాలంతా
ఇది తారలు దిగివచ్చే వేళంటా
ఈ సమయానికి తగుమాటలేమిటో
ఎవ్వరినడగాలట 
 
చాలా పద్దతిగా భావం తెలిసి
ఏదో అనడం కంటే
సాగే కబుర్లతో కాలం మరిచి
సరదా పడదామంతే

చాలా పద్దతిగా భావం తెలిసి
ఏదో అనడం కంటే
సాగే కబుర్లతో కాలం మరిచి
సరదా పడదామంతే 


2 comments:

సుధీర్ బాబు..ఇంద్రగంటి గారి కాంబినేషన్ యెలా ఉంటుందో మరి..

హహహ మొదట వినగానే నాదీ సేంఫీలింగ్ శాంతిగారు... ఇంకెంతలెండి ఓ రెండు వారాలాగితే తెలిసిపోతుంది.. థాంక్స్ ఫర్ ద కామెంట్..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.