శనివారం, మే 26, 2018

ఏయ్ డింగిరి..

ధర్మయోగి చిత్రంలోని ఒక సరదా ఐన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : ధర్మ యోగి (2016)
సంగీతం : సంతోష్ నారాయణ్
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి
గానం : విజయ్ నారాయణ్

ఏయ్ డింగిరి.. తింగరి.. సుందరి..
ఐస్కాంతం చూపిసిరి ఎందుకే అల్లరి..
పడగొట్టావే మీసం నిమిరి
నిదరట్టనందే కూసం కదిలి
ఏయ్ పొగరేగే పొయిమీది జున్నా
నికరంగా నిన్నే తిననా 

పెట్టా కోడీ సొగసువే
బుట్టా కింది సరుకువే
చిట్టాకందని మెరుపులా వలవే
పట్టా కత్తీ పదునుగా
అట్టా ఎట్టా పుడితివే
మెట్టా వయసున చినుకుల దిగవే


ఏయ్ డింగిరి.. తింగరి.. సుందరి..
ఐస్కాంతం చూపిసిరి ఎందుకే అల్లరి..
జడపాయల్లో నన్నే తురిమి
సెగపెట్టినావే ఒంట్లో కొలిమి
నా ప్రాణాలే పంపావే పైకీ
వడిసెలా రాయై తాకీ

పెట్టా కోడీ సొగసువే
బుట్టా కింది సరుకువే
చిట్టాకందని మెరుపులా వలవే
పట్టా కత్తీ పదునుగా
అట్టా ఎట్టా పుడితివే
మెట్టా వయసున చినుకుల దిగవే
ఏయ్ డింగిరి..


ఓణీ అంచై అలా నీతో ఉండే కలా
విత్తనమల్లే పడి మొలిచిందే
మనసుని నిత్యం తెగ తొలిచిందే
వెన్నెల చలువకు పెదవిరిచిందే
నువ్విటు వస్తే ఆదమరిచిందే
కందిన గుండె మొక్కజొన్న కండె
రంగులు మారిందే
పడకలునిండే సరసము పండే
రాతిరి ఎపుడండే

పెట్టా కోడీ సొగసువే
బుట్టా కింది సరుకువే
చిట్టాకందని మెరుపులా వలవే
పట్టా కత్తీ పదునుగా
అట్టా ఎట్టా పుడితివే
మెట్టా వయసున చినుకుల దిగవే
ఏయ్ డింగిరి.. 


2 comments:

ధనుష్ యేం చేసినా..యాక్టింగ్..డాన్స్ ..ఫైట్స్ అన్నీ బావుంటాయి మాకు..

హహహ ఐతే అభిమానులనమాట మీరు.. తను అంత బక్కగా ఉండి కూడా పేద్ద పేద్ద రౌడీలని కొట్టేసి నిజమే అని నమ్మించగలడు అదే యాక్షన్ ఏమో.. థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతిగారు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.