సోమవారం, మే 14, 2018

చేజారిపోతే నే రాలిపోతా...

గులేబకావళి సినిమాలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : గులేబకావళి (2018)
సంగీతం : వివేక్ మెర్విన్
సాహిత్యం : సామ్రాట్
గానం : మెర్విన్, సమీర భరద్వాజ్

కల కనులకు ఇక నేరం
నిదురకు ఇక దూరం
నడవదు క్షణకాలం కలవరం మొదలై
వరముగ నీ స్నేహం
అడిగెను మది పాపం
తన మనుగడ కోసం బదులిడు చెలివై
ఓ తారకా... ఆఅ.. నా కోరికా.. కాదనకే
కళ్ళాలతో అల్లాడదా నా వలపే.. 

చేజారిపోతే నే రాలిపోతా
నువు కాదన్న రోజే శ్వాసాగిపోదా
నీ పాదాలు మోసే భారాన్ని
నాకిచ్చేయ్ వే వయ్యారీ

చేజారిపోతే నే రాలిపోతా
నువు కాదన్న రోజే శ్వాసాగిపోదా
నీ పాదాలు మోసే భారాన్ని
నాకిచ్చేయ్ వే వయ్యారీ

నడిచేటీ దారులలొ పడిగాపై చేరెదవా
నడిరేయి భయమేస్తే నానీడై ఉంటావా
వెన్నెలింటిలో మిన్నునడిగి
అతిథులుగా అడుగేద్దాం
చందమామనే కథలడిగి
నిదరోయి నవ్వేద్దాం
నీతో నేను నాతో నువ్వు
కాలం తీరిపోయినా ప్రేమే ఆవిరవునా
నువ్వు నా దేహం నేన్నీ ప్రాణం
ప్రేమే పల్లవించదా మనమై పులకరించదా

చేజారిపోతే నే రాలిపోతా
నువు కాదన్న రోజే శ్వాసాగిపోదా
నా పాదాలు మోసే భారాన్ని
నీకిచ్చేయ్ నా వచ్చేయ్ వా

చేజారిపోతే నే రాలిపోతా
నువు కాదన్న రోజే శ్వాసాగిపోదా
నా పాదాలు మోసే భారాన్ని
నీకిచ్చేయ్ నా వచ్చేయ్ వా

 చేజారిపోతే నే రాలిపోతా
నువు కాదన్న రోజే శ్వాసాగిపోదా
నీ పాదాలు మోసే భారాన్ని
నాకిచ్చేయ్ వే వచ్చేయ్ వా

చేజారిపోతే నే రాలిపోతా
నువు కాదన్న రోజే శ్వాసాగిపోదా
నా పాదాలు మోసే భారాన్ని
నీకిచ్చేయ్ నా వచ్చేయ్ వా
 

 

2 comments:

నైస్ సాంగ్..

ముఖ్యంగా చిత్రీకరణ నాకు నచ్చిందండీ.. థాంక్స్ ఫర్ ద కామెంట్.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.