మంగళవారం, మే 29, 2018

నిజమా నమ్మతరమా...

అమృతరావుగా ఆంధ్రుల అభిమానాన్ని చూరగొన్న హర్షవర్థన్ నటించి, గానం చేసి, సంగీతం అందించి, దర్శకత్వం వహించిన చిత్రం గుడ్ బాడ్ అగ్లీ నుండి ఒక మంచి పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెండెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : గుడ్ బాడ్ అగ్లీ (2018)
సంగీతం : హర్షవర్థన్
సాహిత్యం : శ్రీమణి
గానం : హర్షవర్ధన్

నిజమా నిజమా నిజమా
నమ్మతరమా నమ్మతరమా
నమ్మతరమా
నిజమా నమ్మతరమా
కలలో దేవి వరమా
అరచేత భాగ్యరేఖ పూసెనా
అరుదైన కోరికేదో తీర్చెనా
తలరాత మార్చి ఉసురు పెంచెనా
ఎదురుగ నిలచి

మనసులో మౌనకీర్తనం
కనులలో ప్రమద నర్తనం
అరవిరిసినది నిశిలో తొలి కార్తీకం
తెగ మురిసినది శశిలా సఖి సంగీతం
వెతకబోవు తీగలా అల్లుకుంది చెలి ఇలా
మనసులో మౌనకీర్తనం

తన భ్రమలకొంటె భ్రమరమింట
పువ్వు వాలెనా
గగనాన తెగిన పటముపై
ఈ ధరణి ఎగసెనా
గుండె గాయమే పండే గేయమై
పోయే ప్రాణమే ఆగి చూసెనా
కాలే కాలమే లాలి పాటలా
వాలే పొద్దులో పొద్దు పూసెనా
 
కవిత వరకే ఆగిపోయినా ఆ ఆ ఆ
కావ్యమాలై సాగిపోయినా ఆ ఆ
పరిధి లేని ప్రేమలో
మునిగి తేలనా ఆ ఆ ఆ

2 comments:

హీరోయిన్ ని ఆహార్యం బట్టీ..బాపు బొమ్మలా, వంశీ ముద్దుగుమ్మలా.. యెంత ట్రై చేసినా ఊహించుకోలేక పోతున్నామండీ..పాట బావుంది..

హహహహ హర్ష అందుకోసమే విశ్వప్రయత్నం చేసినట్లున్నాడండీ.. థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు....

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.