భాగమతి చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : భాగమతి (2018)
సంగీతం : ఎస్.ఎస్.థమన్
సాహిత్యం : శ్రీజో
గానం : శ్రేయ ఘోషల్
మందార మందార
కరిగే తెల్లారేలా
కిరణాలే నన్నే చేరేలా
కళ్లారా కళ్లారా
చూస్తున్నా కళ్లారా
సరికొత్త స్నేహం దారిచేరా
అలికిడి చేసే నాలో
అడగని ప్రశ్నే ఏదో
అసలది బదులో
ఏమో అది తేలేనా
కుదురుగా ఉండే మదిలో
చిలిపిగ ఎగిరే ఎదలో
తెలియని భావం
తెలిసే కథ మారేనా
ఒహ్హ్…
నీ వెంట అడుగే వేస్తూ
నీ నీడనై గమనిస్తూ
నా నిన్నల్లో లేని నన్నే ఇలాగ
నీలో చూస్తున్నా
మందార మందార
కరిగే తెల్లారేలాగా
ఆ కిరణాలే నన్నే చేరేలా
కళ్లారా కళ్లారా
చూస్తున్నావా కళ్లారా
ఈ సరికొత్త స్నేహం దారిచేరా
సుందరా.. రా..రా..
మందార.. రా..రా..
కళ్లారా.. రా..రా..
సుందరా.. రా..రా..
మందార మందార
కరిగే తెల్లారేలా
కిరణాలే నన్నే చేరేలా
ఉనికిని చాటే ఊపిరి కూడా
ఉలికి పడేలా ఉందే ఇలా
కలలోనైనా కలగనలేదే
విడిపోతుందని అరమరికా
కడలై నాలో నువ్వే
అలనై నీలో నేనే
ఒకటై ఒదిగే క్షణమే
అది ప్రేమేనా
కాలాలనే మరిపిస్తూ
ఆనందమే అందిస్తూ
నా ప్రయాణమై నా గమ్యానివై
నా నువ్వవుతున్నావే
మందార మందార
కరిగే తెల్లారేలాగా
ఆ కిరణాలే నన్నే చేరేలా
కళ్లారా కళ్లారా
చూస్తున్నావా కళ్లారా
ఈ సరికొత్త స్నేహం దారిచేరా
మందార మందార
కరిగే తెల్లారేలా
కిరణాలే నన్నే చేరేలా
సంగీతం : ఎస్.ఎస్.థమన్
సాహిత్యం : శ్రీజో
గానం : శ్రేయ ఘోషల్
మందార మందార
కరిగే తెల్లారేలా
కిరణాలే నన్నే చేరేలా
కళ్లారా కళ్లారా
చూస్తున్నా కళ్లారా
సరికొత్త స్నేహం దారిచేరా
అలికిడి చేసే నాలో
అడగని ప్రశ్నే ఏదో
అసలది బదులో
ఏమో అది తేలేనా
కుదురుగా ఉండే మదిలో
చిలిపిగ ఎగిరే ఎదలో
తెలియని భావం
తెలిసే కథ మారేనా
ఒహ్హ్…
నీ వెంట అడుగే వేస్తూ
నీ నీడనై గమనిస్తూ
నా నిన్నల్లో లేని నన్నే ఇలాగ
నీలో చూస్తున్నా
మందార మందార
కరిగే తెల్లారేలాగా
ఆ కిరణాలే నన్నే చేరేలా
కళ్లారా కళ్లారా
చూస్తున్నావా కళ్లారా
ఈ సరికొత్త స్నేహం దారిచేరా
సుందరా.. రా..రా..
మందార.. రా..రా..
కళ్లారా.. రా..రా..
సుందరా.. రా..రా..
మందార మందార
కరిగే తెల్లారేలా
కిరణాలే నన్నే చేరేలా
ఉనికిని చాటే ఊపిరి కూడా
ఉలికి పడేలా ఉందే ఇలా
కలలోనైనా కలగనలేదే
విడిపోతుందని అరమరికా
కడలై నాలో నువ్వే
అలనై నీలో నేనే
ఒకటై ఒదిగే క్షణమే
అది ప్రేమేనా
కాలాలనే మరిపిస్తూ
ఆనందమే అందిస్తూ
నా ప్రయాణమై నా గమ్యానివై
నా నువ్వవుతున్నావే
మందార మందార
కరిగే తెల్లారేలాగా
ఆ కిరణాలే నన్నే చేరేలా
కళ్లారా కళ్లారా
చూస్తున్నావా కళ్లారా
ఈ సరికొత్త స్నేహం దారిచేరా
మందార మందార
కరిగే తెల్లారేలా
కిరణాలే నన్నే చేరేలా
4 comments:
అసలు మందార మందార కరిగే తెల్లారేలా అంటే ఏంది బయ్యా. పాట సంగీతం గానం బాగుంది. లిరిక్స్ బుచికోయమ్మ బుచికి.
నెక్స్టే మూవీయో..
ఏ సినిమా చేసినా టాక్ ఆఫ్ ద టౌన్ అవడం మాత్రం గ్యారెంటీ శాంతి గారు.. థాంక్స్ ఫర్ ద కామెంట్..
అజ్ఞాత బుచికి గారు.. మందారుఁడు అంటే విద్యాధరుడు అని ఓ అర్ధమూ అలాగే మందారము అంటే మేఘావరణము అని ఓ అర్ధమూ ఉన్నాయటండీ, వీటితో పల్లవికి అర్ధము మీరే మరోసారి ఆలోచించి చూడండి :-)
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.