గురువారం, మే 10, 2018

ఐ వాన్నా ఫ్లై...

కృష్ణార్జున యుద్ధం చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం :‌ కృష్ణా‌ర్జున యుద్ధం (2018)
‌సం‌గీతం :‌ హిప్‌హాప్‌ తమిళ
సాహిత్యం :‌ శ్రీజో‌
‌గానం :‌ ఎల్‌.‌వి.‌రేవంత్, సంజిత్‌ హెగ్డే‌

నా కనులే కనని ఆ కలనే కలి‌సా‌
నీ వలనే బహుశా ఈ వర‌సా
నా ఎదలో నలిగే ఓ ప్రశ్నే అడిగా
నే వెతికే స్నేహం నీ మన‌సా‌
‌ఒడ్డు చేర‌లేని ఈ అలే
దాటు‌తోంది సాగ‌రా‌ల‌నే‌
‌ఒక్క గుండె ఇంక చాలదే
కమ్ము‌తుంటే ఈ అల్లరే.‌.‌

ఐ వన్నా ఫ్లై వన్నా ఫ్లై
నీ సగమై సగ‌మై‌
నా నిజమే ఎదురై పిలి‌చి‌న‌దా‌
‌లవ్‌ ఫీలింగ్‌ ఇట్‌ ఇన్‌సైడ్
ఈ వెలుగే వర‌మై‌
యే కథలో వినని భావ‌మి‌దా


ఊ‌హ‌లకే సరి‌హ‌ద్దులు లేవని
ఈ క్షణమే తెలిసే
అం‌దు‌కనే చూపుల వంతె‌నపై
హృదయం పరు‌గి‌డె‌నే

వెన్నె‌ల‌కన్నా చల్లని సెగతో
ఫీల్‌ దిస్‌ మోమెంట్‌ స్వే
నీ వేకు‌వలో వెచ్చని ఊహై
ఐ విల్‌ మెల్ట్‌ యువర్‌ హార్ట్‌ అవే‌

‌ఒక ప్రాణం, అది నేనవనీ
గర్ల్‌ యువర్‌ స్మైల్, నా జగ‌మ‌వనీ

నా కనులే కనని ఆ కలనే కలి‌సా‌
నీ వలనే బహుశా ఈ వర‌సా

ఐ వన్నా ఫ్లై, వన్నా ఫ్లై, నీ సగమై సగ‌మై‌
నా నిజమే ఎదురై పిలి‌చి‌న‌దా


వెతికా నేనే, నన్ను నీ లోకం‌లో‌
‌న‌డిచా నీడై, ప్రతి అడుగూ నీతో‌
నీ తలపు విడిచే నిమి‌ష‌మిక నాకె‌దు‌రు‌ప‌డదే
అ‌రెరే చిలిపి మదికే తెలి‌సె‌నిక నా కలల బరు‌వే

ఐ వన్నా ఫ్లై, వన్నా ఫ్లై నీ సగమై సగ‌మై‌
నా నిజమే ఎదురై పిలి‌చి‌న‌దా‌
‌లవ్, ఫీలింగ్‌ ఇట్‌ ఇన్‌సైడ్‌ ఈ వెలుగే వరమై
యే కథలో వినని భావ‌మి‌దా‌

 

2 comments:

మూవీ బాలేదు..బట్ ఈ సాంగ్ బావుంది..

అవునండీ తీసుకున్న పాయింట్ మంచిదైనా సరిగా ప్రజంట్ చేయలేక సినిమా బోరింగ్ గా తయారైంది కానీ ఈ పాట అండ్ "దారిచూడు" ఫోక్ సాంగ్ చాలా బావున్నాయండీ.. థాంక్స్ ఫర్ ద కామెంట్.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.