బుధవారం, మే 09, 2018

మహానటి - అన్ని పాటలు...


ఈ రోజు విడుదలవుతున్న సావిత్రి గారి బయోపిక్ ’మహానటి’ చిత్రం విజయవంతమవాలని కోరుకుంటూ ఆ చిత్రానికి పనిచేసిన ప్రతిఒక్కరికి అభినందనలు అందజేస్తూ ఆ సినిమాలోని పాటలన్నీ ఓ సారి విందాం. ఈ పాటలు ఆడియో ఇక్కడ వినవచ్చు. ఎంబెడ్ చేసిన యూట్యూబ్ ఆడియో జ్యూక్ బాక్స్ ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : మహానటి (2018)
సంగీతం : మిక్కీ జె మేయర్
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి
గానం : అనురాగ్ కులకర్ణి

కోరస్ : రమ్యబెహ్రా, మోహన భోగరాజు,
అంజనా సౌమ్యా శ్రావణ భార్గవి,
శ్రీకృష్ణ, హేమచంద్ర, కృష్ణ చైతన్య,
దీపు, ఆదిత్య అయ్యంగార్, రోహిత్.

కిడ్స్ కోరస్ : ప్రవస్థి, శర్మిష్ట,
కార్తికేయ, శశాంక్

అభినేత్రి ఓ అభినేత్రి
అభినయనేత్రి నట గాయత్రి
మనసారా నిను కీర్తించీ
పులకించినది ఈ జనధాత్రీ
నిండుగా ఉందిలే దుర్గ దీవెనం
ఉందిలే జన్మకో దైవ కారణం
నువ్వుగా వెలిగే ప్రతిభా గుణం
ఆ నట రాజుకు స్త్రీ రూపం

కళకే అంకితం నీ కణ కణం
వెండితెరకెన్నడో ఉందిలే రుణం
పేరుతో పాటుగా అమ్మనే పదం
నీకే దోరికిన సౌభాగ్యం

మహానటీ మహానటీ మహానటీ మహానటీ
మహానటీ మహానటీ మహానటీ మహానటీ


కళను వలచావు కలను గెలిచావూ
కడలికెదురీది కథగ నిలిచావూ
భాష ఏదైనా ఎదిగి ఒదిగావూ

చరిత పుటలోన వెలుగు పొదిగావూ
పెను శిఖరాగ్రామై గగనాలపై
నిలిపావుగా అడుగు
నీ ముఖచిత్రమై నలు చెరగులా
తల ఎత్తినది మన తెలుగూ..ఊఊ
మనసు వైశాల్యం పెంచుకున్నావూ

మహానటీ మహానటీ మహానటీ మహానటీ
మహానటీ మహానటీ మహానటీ మహానటీ

 
 మనసు వైశాల్యం పెంచుకున్నావూ
పరుల కన్నీరు పంచుకున్నావూ
అసలు ధనమేదో తెలుసుకున్నావూ
తుదకు మిగిలేదీ అందుకున్నావు
పరమార్థానికీ అసలర్ధమే
నువు నడిచిన ఈ మార్గం
కనుకేగా మరి నీదైనదీ
నువుగా అడగని వైభోగం

మహానటీ మహానటీ మహానటీ మహానటీ
మహానటీ మహానటీ మహానటీ మహానటీ


~*~*~*~*~*~*~*~*~*~*~*~*~


 


చిత్రం : మహానటి (2018)
సంగీతం : మిక్కీ జె మేయర్
సాహిత్యం : సిరివెన్నెల
గానం : రమ్య బెహ్రా

ఆగిపో బాల్యమా నవ్వులో నాట్యమా
సరదా సిరిమువ్వలవుదాం
ఏటిలో వేగమా పాటలో రాగమా
చిటికెల తాళాలు వేద్దాం
ఇంతలో వెళిపోకుమా
వెంట వచ్చే నేస్తమా
ఇంతలో వెళిపోకుమా
వెంట వచ్చే నేస్తమా
తొందరగా నన్నే పెంచేసి
నువ్వేమో చినబోకుమా

ఆగిపో బాల్యమా నవ్వులో నాట్యమా
సరదా సిరిమువ్వలవుదాం
ఏటిలో వేగమా పాటలో రాగమా


ఊరికే పనిలేకా తీరికస్సలు లేక
తోటలో తూనీగల్లే తిరిగొద్దామా ఎంచక్కా
అంతపొడుగెదిగాక తెలుసుకోలేనింకా
సులువుగా ఉడతల్లే చెట్టెక్కే ఆ చిట్కా
నింగికి నిచ్చెన వెయ్యవే
నింగికి నిచ్చెన వెయ్యవే
గుప్పెడు చుక్కలు కొయ్యవే
హారం అల్లే రేపటి మెళ్ళో వెయ్యవే
నీ పిలుపే అందీ నలువైపుల నుండీ
అర చేతుల్లో వాలాలే
నీమది కోరిన కానుకలన్నీ

ఆగిపో బాల్యమా నవ్వులో నాట్యమా
సరదా సిరిమువ్వలవుదాం
ఏటిలో వేగమా పాటలో రాగమా


~*~*~*~*~*~*~*~*~*~*~*~*~

చిత్రం : మహానటి (2018)
సంగీతం : మిక్కీ జె మేయర్
సాహిత్యం : సిరివెన్నెల
గానం : అనురాగ్ కులకర్ణి, శ్రేయా ఘోషల్

మూగ మనసులు
మూగ మనసులు


మన్ను మిన్ను కలుసుకున్న సీమలో
నన్ను నిన్ను కలుపుతున్న ప్రేమలో


జగతి అంటే మనమే అన్న మాయలో
సమయం అన్న జాడ లేని హాయిలో

ఆయువే గేయమై స్వాగతించగా
తరలి రావటే చైత్రమా

కుహు కుహు కుహు
స్వరాల ఊయలూగుతున్న కోయిలైన వేళ


మూగ మనసులు
మూగ మనసులు


ఊహల రూపమా ఊపిరి దీపమా
నా చిరునవ్వుల వరమా

గాలి సరాగమా పూల పరాగమా
నా గత జన్మల రుణమా

ఊసులు బాసలు ఏకమైన శ్వాసలో
నిన్నలు రేపులు లీనమైన నేటిలో
ఈ నిజం కథ అని తరతరాలు చదవని
ఈ కథే నిజమని కలలలోనే గడపని
వేరేలోకం చేరే వేగం పెంచే మైకం
మననిలా తరమని
తారాతీరం తాకే దూరం
ఎంతో ఏమో అడగకే ఎవరని


మూగ మనసులు
మూగ మనసులు

~*~*~*~*~*~*~*~*~*~*~*~*~
 

ఈ పాట ప్రొమో వీడియో ఇక్కడ చూడవచ్చు. 
 

చిత్రం : మహానటి (2018)
సంగీతం : మిక్కీ జె మేయర్
సాహిత్యం : సిరివెన్నెల
గానం : చారులతా మణి

సదా నన్ను నడిపే
నీ చెలిమే పూదారై నిలిచే
ప్రతి మలుపు ఇకపై
స్వాగతమై నా పేరే పిలిచే
ఇదే కోరుకున్న
ఇదే కోరుకున్నా
అని నేడే తెలిసే

కాలం నర్తించదా నీతో జతై
ప్రాణం సుమించదా నీకోసమై
కాలం నర్తించదా నీతో జతై


నదికి వరదల్లే మదికి పరవళ్ళై
బెరుకు ఎపుడు వదిలిందో
చురుకు ఎపుడు పెరిగిందో
తలపు తొలిజల్లై
తనువు హరివిల్లై
వయసు ఎపుడు కదిలిందో
సొగసు ఎపుడు మెరిసిందో
గమనించేలోగా .. ఆఆ..ఆఆ..
గమకించే రాగానా ఏదో ఈళా
లోనా.. మోగేనా..

కాలం నర్తించదా నీతో జతై
ప్రాణం సుమించదా నీకోసమై
కాలం నర్తించదా నీతో జతై


~*~*~*~*~*~*~*~*~*~*~*~*~

చిత్రం : మహానటి (2018)
సంగీతం : మిక్కీ జె మేయర్
సాహిత్యం : సిరివెన్నెల
గానం : సునీత

అనగా అనగా మొదలై కథలు
అటుగా ఇటుగా నదులై కదులు
అపుడో ఇపుడో దరిజేరునుగా
కడలే ఓడై కడదేరునుగా
గడిచే కాలానా గతమేదైనా
స్మృతి మాత్రమే కదా... ఆఆఆఆఆ...

చివరకు మిగిలేదీ.. చివరకు మిగిలేదీ..
చివరకు మిగిలేదీ.. చివరకు మిగిలేదీ..


ఎవరు ఎవరు ఎవరు నువ్వంటే
నీవు ధరించిన పాత్రలు అంతే
నీదని పిలిచే బ్రతుకేదంటే
తెరపై కదిలే చిత్రమె అంతే
ఈ జగమంతా నీ నర్తనశాలై
చెబుతున్న నీ కథే
చివరకు మిగిలేది

విన్నావా మహానటి
చెరగని చేవ్రాలిది
నీదేనే మహానటి
చివరకు మిగిలేది

విన్నావా మహానటి
మా చెంపల మీదుగా
ప్రవహించే మహానది

మహానటి మహానటి
మహానటి మహానటి
మహానటి మహానటి
మహానటి మహానటి


~*~*~*~*~*~*~*~*~*~*~*~*~

ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చిత్రం : మహానటి (2018)
సంగీతం : మిక్కీ జె మేయర్
సాహిత్యం : సిరివెన్నెల
గానం : రమ్య బెహరా 


 గెలుపులేని సమరం
జరుపుతోంది సమయం
ముగించేదెలా ఈ రణం
మధురమైన గాయం
మరిచిపోదు హృదయం
ఇలా ఎంత కాలం
భరించాలి ప్రాణం

గతంలో విహారం
కలల్లోని తీరం
అదంతా భ్రమంటే
మనస్సంత మంటే
ఏవో జ్ఞాపకాలు
వెంటాడే క్షణాలు
దహిస్తుంటె దేహం
వెతుక్కుంద మైకం


అలలుగ పడిలేచే
కడలిని అడిగావా 

తెలుసా తనకైనా
తన కల్లోలం
ఆకసం తాకే
ఆశ తీరిందా
తీరని దాహం ఆగిందా..
జరిగే మధనంలో
విషమేదొ రసమేదొ
తేలేనా ఎపుడైన
ఎన్నాళ్ళైనా

పొగలై సెగలై
ఎదలో రగిలే
పగలూ రేయీ ఒకటై
నర నరాలలోన
విషమయింది ప్రేమ
చివరకు మిగిలేది
ఇదే ఐతె విధి రాత
తప్పించ తరమా 
 

6 comments:

యెప్పుడెప్పుడు చూడగలనా అని యెదురు చూసిన సినిమా..

మనలాంటి అభిమానుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా తెరకెక్కించిన సినిమా శాంతి గారు.. థాంక్స్ ఫర్ ద కామెంట్.

ఈ సినిమాలో పాటలన్నీ ఆణిముత్యాలే!!..అచ్చమైన తెలుగులో వినగానే హాయిని గొలిపేలా ఉన్నాయి..

అవును మోహన గారు.. థాంక్స్ ఫర్ ద కామెంట్...

వేణుగారు మొదటి చరణంలో
కళను వలచావు కలను గెలిచావూ అనుకుంటా

థ్యాంక్స్ జాన్సన్ గారు. పోస్ట్ లో సరి చేశానండీ.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.