కృష్ణప్రేమ సినిమాలోని ఒక చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ అవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు. వీడియో రెండు భాగాలుగా ఈ ప్లేలిస్ట్ లో చూడవచ్చు.
చిత్రం : కృష్ణప్రేమ (1961)
సంగీతం : పెండ్యాల
సాహిత్యం : ఆరుద్ర
గానం : ఘంటసాల
మోహన రూపా గోపాలా
మోహన రూపా గోపాలా
ఊహాతీతము నీ లీల
ఊహాతీతము నీ లీల
మోహన రూపా గోపాలా
వలదని నిన్ను వారించు వారిని
వదలక వెంట తిరిగెదవయ్య
వలదని నిన్ను వారించు వారిని
వదలక వెంట తిరిగెదవయ్య
వేణువు నూదుఛు వేడుక చేయగ
వేడిన వారికి దరిశన మీయవు
మోహన రూపా గోపాలా!
అవని భారము అమితముకాగా
అవతరించితివి యెన్ని సారులో! కృష్ణా!
అవని భారము అమితముకాగా
అవతరించితివి యెన్ని సారులో!
అన్నిటికన్న అపురూపమైనది
కన్నుల విందగు ఈనాటి రూపము
మోహన రూపా గోపాలా!
ఆఆ..ఆఆఅ.ఆఆ..
మోహన రూపా గోపాలా!
మోహన రూపా గోపాలా!
ఊహాతీతము నీ లీల
మోహన రూపా గోపాలా!
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.