తొలిప్రేమ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ ఆవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : తొలిప్రేమ (1998)
సంగీతం : దేవా
సాహిత్యం : సిరివెన్నెల
గానం : బాలు
గగనానికి ఉదయం ఒకటే
కెరటాలకి సంద్రం ఒకటే
జగమంతట ప్రణయం ఒకటే ఒకటే
ప్రణయానికి నిలయం మనమై
యుగయుగముల పయనం మనమై
ప్రతిజన్మలొ కలిశాం మనమె మనమే
జన్మించలేదా నీవు నాకోసమే
గుర్తించలేదా నన్ను నా ప్రాణమే
ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ
గగనానికి ఉదయం ఒకటే
కెరటాలకి సంద్రం ఒకటే
జగమంతట ప్రణయం ఒకటే ఒకటే
నీ కన్నుల్లో కలను అడుగు ఇతడు ఎవరనీ
నీ గుండెల్లో తిరిగే లయనే బదులు పలకనీ
నిదురించు యవ్వనంలో పొద్దుపొడుపై
కదిలించలేద నేనే మేలుకొలుపై
గతజన్మ జ్ఞాపకాన్నై నిన్ను పిలువా
పరదాల మంచు పొరలో ఉండగలనా
గగనానికి ఉదయం ఒకటే
కెరటాలకి సంద్రం ఒకటే
జగమంతట ప్రణయం ఒకటే ఒకటే
నా ఊహల్లో కదిలే కళలే ఎదుట పడినవి
నా ఊపిరిలో ఎగసే సెగలే కుదుట పడినవి
సమయాన్ని శాశ్వతంగా నిలిచిపోనీ
మమతన్న అమృతంలో మునిగిపోనీ
మనవైన ఈ క్షణాలే అక్షరాలై
మృతి లేని ప్రేమకథగా మిగిలిపోనీ
గగనానికి ఉదయం ఒకటే
కెరటాలకి సంద్రం ఒకటే
జగమంతట ప్రణయం ఒకటే ఒకటే
ప్రణయానికి నిలయం మనమై
యుగయుగముల పయనం మనమై
ప్రతిజన్మలొ కలిశాం మనమె మనమే
జన్మించలేదా నీవు నాకోసమే
గుర్తించలేదా నన్ను నా ప్రాణమే
ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ
సంగీతం : దేవా
సాహిత్యం : సిరివెన్నెల
గానం : బాలు
గగనానికి ఉదయం ఒకటే
కెరటాలకి సంద్రం ఒకటే
జగమంతట ప్రణయం ఒకటే ఒకటే
ప్రణయానికి నిలయం మనమై
యుగయుగముల పయనం మనమై
ప్రతిజన్మలొ కలిశాం మనమె మనమే
జన్మించలేదా నీవు నాకోసమే
గుర్తించలేదా నన్ను నా ప్రాణమే
ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ
గగనానికి ఉదయం ఒకటే
కెరటాలకి సంద్రం ఒకటే
జగమంతట ప్రణయం ఒకటే ఒకటే
నీ కన్నుల్లో కలను అడుగు ఇతడు ఎవరనీ
నీ గుండెల్లో తిరిగే లయనే బదులు పలకనీ
నిదురించు యవ్వనంలో పొద్దుపొడుపై
కదిలించలేద నేనే మేలుకొలుపై
గతజన్మ జ్ఞాపకాన్నై నిన్ను పిలువా
పరదాల మంచు పొరలో ఉండగలనా
గగనానికి ఉదయం ఒకటే
కెరటాలకి సంద్రం ఒకటే
జగమంతట ప్రణయం ఒకటే ఒకటే
నా ఊహల్లో కదిలే కళలే ఎదుట పడినవి
నా ఊపిరిలో ఎగసే సెగలే కుదుట పడినవి
సమయాన్ని శాశ్వతంగా నిలిచిపోనీ
మమతన్న అమృతంలో మునిగిపోనీ
మనవైన ఈ క్షణాలే అక్షరాలై
మృతి లేని ప్రేమకథగా మిగిలిపోనీ
గగనానికి ఉదయం ఒకటే
కెరటాలకి సంద్రం ఒకటే
జగమంతట ప్రణయం ఒకటే ఒకటే
ప్రణయానికి నిలయం మనమై
యుగయుగముల పయనం మనమై
ప్రతిజన్మలొ కలిశాం మనమె మనమే
జన్మించలేదా నీవు నాకోసమే
గుర్తించలేదా నన్ను నా ప్రాణమే
ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ
2 comments:
My day starts & ends with a song from your blog - this is one of my favs. Thanks for posting.
థాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అజ్ఞాత గారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.