జాకీ చిత్రంలోని ఒక చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రం వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ అవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : జాకి (1985)
సంగీతం : బాలు
సాహిత్యం : వేటూరి
గానం : జానకి
అలా మండి పడకే జాబిలీ..ఈ...ఈ..
చలీ ఎండ కాసే రాతిరీ..
దాహమైన వెన్నెల రేయి
దాయలేను ఇంతటి హాయి
ఎలా తెలుపుకోనూ ప్రేమనీ
ఎలా పిలుచుకోనూ రమ్మనీ
అలా మండి పడకే జాబిలీ..ఈ...ఈ..
చలీ ఎండ కాసే రాతిరీ
నిన్ను చూడకున్నా.. నీవు చూడకున్నా...
నిదురపోదు కన్నూ... నిశీ రాతిరీ..
నీవు తోడు లేకా... నిలువలేని నాకు..
కొడిగట్టునేలా కొనఊపిరీ
ఇదేనేమో బహుశా తొలినాటి ప్రేమా
ఎలా పాడుకోనూ నిట్టూర్పు జోలా
ఈ పూల బాణాలు... ఈ గాలి గంధాలు..
సోకేను నా గుండెలో... సెగ లేని సయ్యాటలో..
అలా మండి పడకే జాబిలీ..ఈ...ఈ..
చలీ ఎండ కాసే రాతిరీ
పూటకొక్క తాపం... పూల మీద కోపం..
పులకరింతలాయే.. సందె గాలికీ
చేదు తీపి పానం.. చెలిమి లోని అందం..
తెలుసుకుంది ..నేడే జన్మ జన్మకీ
సముఖాన వున్నా రాయబారమాయే
చాటు మాటునేవో రాసలీలలాయే
ఈ ప్రేమ గండాలు ఈ తేనె గుండాలు
గడిచేది ఎన్నాళ్ళకో... కలిసేది ఏనాటికో...
అలా మండి పడకే జాబిలీ..ఈ...ఈ..
చలీ ఎండ కాసే రాతిరీ...
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.