లవ్ బర్డ్స్ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ అవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : లవ్ బర్డ్స్ (1996)
సంగీతం : ఎ.ఆర్.రహ్మాన్
సాహిత్యం : సిరివెన్నెల
గానం : హరిహరన్, చిత్ర
మనసున మనసుగ నిలిచిన కలవా
పిలిచిన పలకగ ఎదటనే కలవా
దొరికినదే నా స్వర్గం, పరిచినదే విరిమార్గం
మిన్నుల్లో నీవే, మన్నుల్లో నీవే
కన్నుల్లో నీవే .....రా..వా...
మనసున మనసుగ నిలిచిన కలవా
పిలిచిన పలకగ ఎదటనే కలవా
దొరికినదే నా స్వర్గం, పరిచినదే విరిమార్గం
మిన్నుల్లో నీవే, మన్నుల్లో నీవే
కన్నుల్లో నీవే .....రా..వా...
మేఘం నేల ఒళ్ళు మీటే రాగామల్లే
ప్రేమా వరాల జల్లు కావా
పిలుపే అందుకొని బదులే తెలుపుకొని
కౌగిట ఒదిగి ఉండనీవా..
నా గుండె కోవెల విడిచి వేళ్ళ తగునా తగునా
మల్లె పూల మాలైనిన్నే వరించి పూజించే వేళా
నిరీక్షించి స్నేహం కోరి , జతనై రానా ...రానా...
ఉప్పొంగి పోయే ప్రాయం నిన్ను విడువదు ఏ వెళైనా
నా శ్వాస ప్రతి పూట వినిపించు నీ పాట..
ఏడేడు జన్మాలు నేనుంటా నీ జంట
మనసున మనసుగ నిలిచిన కలవా
పిలిచిన పలకగ ఎదటనే కలవా
దొరికినదే నా స్వర్గం, పరిచినదే విరిమార్గం
మిన్నుల్లో నీవే, మన్నుల్లో నీవే
కన్నుల్లో నీవే .....రా..వా...
పూవై నవ్వులని తేనై మాదురిని
పంచే పాట మన ప్రేమ
విరిసే చంద్రకళ ఎగసే కడలి అల
పలికే కవిత మన ప్రేమ
కాలాన్ని పరిపాలిద్దాం కన్న కలలే నిజమై
వేటాడు ఏ ఎడబాటు ఏనాడు కలగదు ఇక ఇటుపై
నూరేళ్ళ కాలం కూడా, ఒక్క క్షణమై క్షణమై
నువ్వూ నేను చేరి సగమౌదాం వయస్సు పండించే వరమై
ప్రియమైన అనురాగం పలికింది మధుగీతం
తుదే లేని ఆనందం వేచేనే నీకోసం
మనసున మనసుగ నిలిచిన కలవా
పిలిచిన పలకగ ఎదటనె కలవా
దొరికినదే నా స్వర్గం, పరిచినదే విరిమార్గం
మిన్నుల్లో నీవే, మన్నుల్లో నీవే
కన్నుల్లో నీవే .....రా..వా...
2 comments:
చాలా చాలా ఇష్టమైన పాట..యెందుకో యెప్పుడు విన్నా మనసు గోదావరి లా మారిపోతుంది..
అవునండీ మంచి పాట.. థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.