శుక్రవారం, డిసెంబర్ 23, 2016

రార మాధవా..

నందమూరి జానకిరామ్ కుమారుడు ఎన్టీఆర్ నటించిన దానవీర శూరకర్ణలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు ఎంబెడెడ్ వీడియో లోడ్ ఆవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : దానవీరశూరకర్ణ (2015)
సంగీతం : కౌసల్య
సాహిత్యం : చైతన్య ప్రసాద్
గానం : కశ్యప్ కొంపెల్ల, రమ్యబెహ్రా 

రారా మాధవ మురళీ లోలా ప్రేమా రాధన వేళా
రారా మోహన యదుగోపాలా రాసక్రీడల తేలా 
వచ్చానిదిగో వెచ్చని వలపుల వాంఛలు విరిసేలా
అచ్చపు సొగసల నెచ్చెలులందరి ముచ్చట తీరేలా 

కృష్ణ కృష్ణ లహరే ప్రణయ కృష్ణ లహరే 
ప్రణయ ప్రణయ కృష్ణలహరే 
మధుర మధుర మురళీ 
మ్రోగె మోహ సరళీ

మిన్నేదాటి కరిమబ్బల్లే కన్నా నువ్వు నడిచొస్తే 
వన్నే చిన్నె శిఖిపించంలా నా మేనే ఆడెనె 
మరి మరి తిన్నా తరగని వెన్నా మేమేరా కన్నా 
హృదయము యమునై తరగల తపనై పరుగులు తీస్తున్నా 
యదపై వాలిన యదుగా మారిన 
మృదు అందాల చెంగల్వ పూదండ మీరే 

రారా మాధవ మురళీ లోలా ప్రేమా రాధన వేళా
రారా మోహన యదుగోపాలా రాసక్రీడల తేలా 

నిన్నే చూసి మా డెందంలో మందారాలు పూచాయీ 
శృంగారాలు మకరందాలే పొంగే తీయగా 
విరహపు జ్వాలా నవరస లీలా రేపెను మధుకీల 
ప్రియ విభులోలా సరసపు డోలా ఊపెను జంపాలా
సతులే నా ప్రియ సఖులై సాగిన సారంగ సంరంభ హేలా 

రారా మాధవ మురళీ లోలా ప్రేమా రాధన వేళా
రారా మోహన యదుగోపాలా రాసక్రీడల తేలా 

కృష్ణ కృష్ణ లహరే ప్రణయ కృష్ణ లహరే 
ప్రణయ ప్రణయ కృష్ణలహరే 
మధుర మధుర మురళీ 
మ్రోగె మోహ సరళీ

కృష్ణ కృష్ణ లహరే ప్రణయ కృష్ణ లహరే 
ప్రణయ ప్రణయ కృష్ణలహరే 
మధుర మధుర మురళీ 
మ్రోగె మోహ సరళీ 

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.