పెళ్ళి కానుక చిత్రంలోని ఒక చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ అవని వాళ్లు ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : పెళ్ళికానుక (1998)
సంగీతం : కీరవాణి
సాహిత్యం : సిరివెన్నెల
గానం : బాలు, చిత్ర, మాల్గుడి శుభ
ఆఆఅ..ఆఆఅ..ఓఓఓ... ఓహో...
సువ్వీ సువ్వీ సువ్వాలా మువ్వా గోపాల
నవ్వీ నవ్వీ ఈ వేళా రవ్వలు రేపాలా
సువ్వీ సువ్వీ సువ్వాలా మువ్వా గోపాల
నవ్వీ నవ్వీ ఈ వేళా రవ్వలు రేపాలా
గువ్వా గువ్వా వెన్నెల గువ్వా
మామాటలు వింటున్నావా
పువ్వా పువ్వా పున్నమి పువ్వా
చిరునవ్వుతో చూస్తున్నావా
నువ్వు కోరిన గూటికి రమ్మంటా గువ్వా
నీ కోవెల దారిని చూపెడతా పువ్వా
నువ్వు ఊ అంటావా
సువ్వీ సువ్వీ సువ్వాలా మువ్వా గోపాల
నవ్వీ నవ్వీ ఈ వేళా రవ్వలు రేపాలా
మీ ఇంటి ముంగిట సంక్రాంతి ముగ్గేరా ఈ పైడి బొమ్మ
నీ ఇంటి వాకిట వెయ్యేళ్ళ వెలుగురే సిరిమల్లె కొమ్మా
ఈ కన్నె తారక జంటైతె నువ్వేరా ఆ చందమామ
ఈ ఎంకి చేరితే నీ సొంతమైపోదా ఆనందసీమ
రాసిపోసిన రాసి కళలను పూస గుచ్చిన బ్రహ్మ
చూసిన వాళ్ళకు ఈసుపుట్టగ మాకందించేనమ్మా
మా కోటకు రాణిగ రమ్మంటా గువ్వా
నీ కోవెల దారిని చూపెడతా పువ్వా
నువ్వు ఊ అంటావా
సువ్వీ సువ్వీ సువ్వాలా మువ్వా గోపాల
నవ్వీ నవ్వీ ఈ వేళా రవ్వలు రేపాలా
వసంత కోకిల రాగాల రూపంలా చిరునవ్వు సిరులు
వేసంగి వెన్నెల కురిపించు దీపంలా వెలిగేటి కనులు
వర్షించు వన్నెల ఆ ఇంద్ర ఛాపంలా చిన్నారి కళలు
ఆ మంచుకొండల మురిపించు తెలుపేరా సుగుణాల నిధులూ
ఆరు రుతువులు కూడి చేరిన అందమే నీవమ్మా
ఏడు జన్మల తోడు వీడని బంధమై రావమ్మా
దివిసీమల దీవెన తెమ్మంటా గువ్వా
నీ కోవెల దారిని చూపెడతా పువ్వా
నువ్వు ఊ అంటావా
సువ్వీ సువ్వీ సువ్వాలా మువ్వా గోపాల
నవ్వీ నవ్వీ ఈ వేళా రవ్వలు రేపాలా
సువ్వీ సువ్వీ సువ్వాలా మువ్వా గోపాల
నవ్వీ నవ్వీ ఈ వేళా రవ్వలు రేపాలా
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.