మంగళవారం, డిసెంబర్ 06, 2016

నువ్వేనా సంపంగి పువ్వున...

గుప్పెడు మనసు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ అవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : గుప్పెడు మనసు (1979)
సంగీతం : ఎమ్మెస్ విశ్వనాథన్
సాహిత్యం : ఆత్రేయ
గానం : బాలు

నువ్వేనా సంపంగి పువ్వున నువ్వేనా
నువ్వేనా సంపంగి పువ్వున నువ్వేనా
జాబిలి నవ్వున నువ్వేనా
గోదారి పొంగున నువ్వేనా నువ్వేనా
నువ్వేనా సంపంగి పువ్వున నువ్వేనా
జాబిలి నవ్వున నువ్వేనా
గోదారి పొంగున నువ్వేనా నువ్వేనా

ఆ.. నిన్నేనా అది నేనేనా కలగన్నానా కనుగొన్నానా
నిన్నేనా అది నేనేనా కలగన్నానా కనుగొన్నానా
అల్లి బిల్లి పదమల్లేనా అది అందాల పందిరి వేసేనా
అల్లి బిల్లి పదమల్లేనా అది అందాల పందిరి వేసేనా

నువ్వేనా సంపంగి పువ్వున నువ్వేనా
జాబిలి నవ్వున నువ్వేనా
గోదారి పొంగున నువ్వేనా నువ్వేనా

ఆ.. కళ్ళేనా..
కళ్ళేనా హరివిల్లేనా అది చూపేనా విరి తూపేనా
కళ్ళేనా హరివిల్లేనా అది చూపేనా విరి తూపేనా
తుళ్ళి తుళ్ళిపడు వయసేనా నను తొందర వందర చేసేనా
తుళ్ళి తుళ్ళిపడు వయసేనా నను తొందర వందర చేసేనా

నువ్వేనా సంపంగి పువ్వున నువ్వేనా
జాబిలి నవ్వున నువ్వేనా
గోదారి పొంగున నువ్వేనా నువ్వేనా

ఆ.. నువ్వైనా నీ నీడైనా ఏనాడైనా నా తోడౌనా
నువ్వైనా నీ నీడైనా ఏనాడైనా నా తోడౌనా
మళ్ళీ మళ్ళీ కలవచ్చేనా ఇలా మల్లెల మాపై విచ్చేనా
మళ్ళీ మళ్ళీ కలవచ్చేనా ఇలా మల్లెల మాపై విచ్చేనా

నువ్వేనా సంపంగి పువ్వున నువ్వేనా
జాబిలి నవ్వున నువ్వేనా
గోదారి పొంగున నువ్వేనా నువ్వేనా
నువ్వేనా సంపంగి పువ్వున నువ్వేనా

 

2 comments:

వేణూజీ ..మెనీ మెనీ హాఫీ రెటర్న్స్ ఆఫ్ ద డే..
విత్ లాత్శ్ ఆఫ్ అభిమానంస్ యెండ్ విషెస్..
మీబ్లాగాభిమాని..

థాంక్స్ శాంతి గారు.. మీ అభిమానానికి ధన్యవాదాలండీ..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.