ఆదివారం, డిసెంబర్ 04, 2016

మమతే మధురం...

నీరాజనం సినిమాలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట  ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ ఆవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : నీరాజనం (1988)
సంగీతం : ఓ.పి. నయ్యర్
సాహిత్యం : రాజశ్రీ
గానం : బాలు

మమతే మధురం మమతే మధురం
మరపే శిశిరం ఎదకూ విధికీ
జరిగే సమరం జరిగే సమరం
మమతే మధురం మమతే మధురం
మరపే శిశిరం ఎదకూ విధికీ
జరిగే సమరం జరిగే సమరం

మనిషికి వలపే వరమా
మది వలపుకు వగపే ఫలమా
మనిషికి వలపే వరమా
మది వలపుకు వగపే ఫలమా
అది పాపమా విధి శాపమా
అది పాపమా విధి శాపమా
ఎద ఉంటె అది నేరమా

మమతే మధురం మమతే మధురం
మరపే శిశిరం ఎదకూ విధికీ
జరిగే సమరం జరిగే సమరం

గుండెల దాటని మాట
ఎద పిండిన తీయని పాటా
గుండెల దాటని మాట
ఎద పిండిన తీయని పాటా
చరణాలుగా కరుణించునా
చరణాలుగా కరుణించునా
పల్లవిగ మరపించునా

మమతే మధురం మమతే మధురం
మరపే శిశిరం ఎదకూ విధికీ
జరిగే సమరం జరిగే సమరం
మమతే మధురం మమతే మధురం

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.