మంగళవారం, డిసెంబర్ 20, 2016

పాడెద నీ నామమే...

అమాయకురాలు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేయవచ్చు. ఎంబెడెడ్ లోడ్ అవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : అమాయకురాలు (1971)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
సాహిత్యం : దాశరథి
గానం : సుశీల

ఆ... ఆ ఆ ఆ... ఆ ఆ ఆ... ఆ...
పాడెద నీ నామమే గోపాలా
పాడెద నీ నామమే గోపాలా
హృదయములోనే పదిలముగానే
నిలిపెద నీ రూపమేరా..ఆ..అ..
 
పాడెద నీ నామమే గోపాలా
 
మమతలతోనే మాలికలల్లి
నిలిచితి నీకోసమేరా
మమతలతోనే మాలికలల్లి
నిలిచితి నీకోసమేరా
ఆశలతోనే హారతి చేసి
పదములు పూజింతు రారా
 
పాడెద నీ నామమే గోపాలా
 
నీ మురళీ గానమే పిలిచెరా
కన్నుల నీమోము కదలెనులేరా
నీ మురళీగానమే పిలిచెరా
పొన్నలు పూచే బృందావనిలో
వెన్నెల కురిసే యమునాతటిపై 
ఆ... ఆ ఆ ఆ... ఆ ఆ ఆ... ఆ...  
పొన్నలు పూచే బృందావనిలో
వెన్నెల కురిసే యమునాతటిపై
నీ సన్నిధిలో జీవితమంతా ..
కానుక చేసేను రారా

పాడెద నీ నామమే గోపాలా
హృదయములోనే పదిలముగానే
నిలిపెద నీ రూపమేరా...
పాడెద నీ నామమే గోపాలా...


5 comments:

Krishnuni paatalu ento madhuramgaa vuntaayi. Thanks for sharing!

Meeku veelaithe Ekaveera sinimaalo "Nee peru talachinaa chaalu" paata post cheyagalaraa, please?

Great composition. It appears to be simple but not so easy to sing. Great master S.Rajeswara Rao garu and melodious singing by Smt. Susheela garu.

Inkoka paata - Poojaphalam sinimalo -"Idi challani reyainaa " - meeku veelunnappude - tondaremee ledu - post cheyagalaraa, please!

థాంక్స్ అజ్ఞాత గారు.. నీ పేరు తలచినా పాట ఆల్రెడీ వేసేశానండీ ఇక్కడ చూడవచ్చు. http://sarigamalagalagalalu.blogspot.in/2015/01/blog-post_2.html

పూజా ఫలం లో మీరు చెప్పిన పాట కనిపించలేదండీ.. బహుశా వేరే సినిమా అయి ఉంటుందేమో.

Oh sorry - I gave a wrong word - it should be "idi challani velaina"

On YouTube - only part of the song is there - please check - Thank You:

https://m.youtube.com/watch?v=lwYamN53aAA

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.