వీర కంకణం చిత్రంలోని ఒక చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ ఆవని వాళ్లు ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : వీరకంకణం (1957)
సంగీతం : దక్షిణామూర్తి
సాహిత్యం : ఆరుద్ర ?
గానం : పి.లీల
ఇక వాయించకోయీ మురళి
నేను జోడించనందెల రవళి
ఆనందనంద గోపాలా..
ఓహో నంద నంద గోపాలా..
ఇక వాయించకోయీ మురళి
నేను జోడించనందెల రవళి
ఆనందనంద గోపాలా..
ఓహో నంద నంద గోపాలా..
కనువిచ్చేను అందాల తనువు
తీసుకొనరాదు నీవెట్టి చనువు
దాచి పెట్టాను పతి కొరకు మనసు
దోచుకొనరాదు నీకది తెలుసు
అది జాలమయె జారివిడు సామి
అనాధ పైన కోపాలా..
ఇక వాయించకోయీ మురళి
నేను జోడించనందెల రవళి
ఆనందనంద గోపాలా..
ఓహో నంద నంద గోపాలా..
సతులున్నారు పదహారువేలు
ఇకనేలయ్య మరియొక ఆలు
భక్తి పరురాలు ఈ ముద్దరాలు
నిన్ను పూజింతునదియేను మేలు
నిను వేడెదను పాడెదను గాని
పడబోదు నేను నీ పాలా
ఓహో నంద నంద గోపాలా..
ఇక వాయించకోయీ మురళి
నేను జోడించనందెల రవళి
ఆనందనంద గోపాలా..
ఓహో నంద నంద గోపాలా..
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.