గురువారం, డిసెంబర్ 08, 2016

నేనొక ప్రేమ పిపాసిని...

ఎనభైలలో విరహ గీతాలంటే ముందు వరసలో నిలిచే ఒక పాపులర్ పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ ఆవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు.

 
చిత్రం : ఇంద్ర ధనుస్సు (1978)
రచన : ఆత్రేయ
సంగీతం : కె.వి. మహదేవన్‌
గానం : బాలు

ఆహాఆఆ..అహాహహా...
ఆఆఆ..ఆఆఅ..ఆఆఅ...
నేనొక ప్రేమ పిపాసిని నీవొక ఆశ్రమవాసివి
నా దాహం తీరనిది నీ హృదయం కదలనిది
నేనొక ప్రేమ పిపాసిని నీవొక ఆశ్రమవాసివి
నా దాహం తీరనిది నీ హృదయం కదలనిది
నేనొక ప్రేమ పిపాసిని

తలుపు మూసిన తలవాకిటనే పగలు రేయి నిలుచున్నా
పిలిచి పిలిచీ బదులేరాక అలసి తిరిగి వెళుతున్నా
తలుపు మూసినా తలవాకిటనే పగలు రేయి నిలుచున్నా
పిలిచి పిలిచీ బదులేరాక అలసి తిరిగి వెళుతున్నా

నా దాహం తీరనిది నీ హృదయం కదలనిది
నేనొక ప్రేమ పిపాసిని

పూట పూట నీ పూజ కోసమని పువ్వులు తెచ్చాను
ప్రేమభిక్షను పెట్టగలవని దోసిలి ఒగ్గాను
నీ అడుగులకు మడుగులొత్తగా ఎడదను పరిచాను
నీవు రాకనే అడుగు పడకనే నలిగిపోయాను

నేనొక ప్రేమ పిపాసిని

పగటికి రేయి రేయికి పగలు పలికే వీడ్కోలు
సెగ రేగిన గుండెకు చెబుతున్నా నీ చెవిన పడితే చాలు
నీ జ్ఞాపకాల నీడలలో నన్నెపుడో చూస్తావు
నను వలచావని తెలిపేలోగా నివురైపోతాను

నేనొక ప్రేమ పిపాసిని నీవొక ఆశ్రమవాసివి
నా దాహం తీరనిది నీ హృదయం కదలనిది
నేనొక ప్రేమ పిపాసిని

 

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.