బుధవారం, డిసెంబర్ 07, 2016

ప్రియతమా నా హృదయమా...

ప్రేమ సినిమా కోసం ఇళయరాజా గారు కంపోజ్ చేసిన ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ ఆవని వాళ్లు ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : ప్రేమ (1989)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : ఆత్రేయ
గానం : బాలు

ప్రియతమా .. నా హృదయమా
ప్రియతమా .. నా హృదయమా
ప్రేమకే ప్రతిరూపమా
ప్రేమకే ప్రతిరూపమా
నా గుండెలో నిండిన గానమా
నను మనిషిగా చేసిన త్యాగమా !

ప్రియతమా .. నా హృదయమా
ప్రేమకే ప్రతిరూపమా !

శిలలాంటి నాకు జీవాన్ని పోసి
కలలాంటి బ్రతుకు కళతోటి నింపి
వలపన్న తీపి తొలిసారి చూపి
ఎదలోని సెగలు అడుగంట మాపి
నులివెచ్చనైన ఓదార్పు నీవై
శృతిలయ లాగ జతచేరినావు
నువు లేని నన్ను ఊహించలేనూ
నావేదనంతా నివేదించలేను
అమరం అఖిలం మన ప్రేమా !

ప్రియతమా .. నా హృదయమా
ప్రేమకే ప్రతిరూపమా !

నీ పెదవి పైనా వెలుగారనీకు
నీ కనులలోన తడి చేరనీకు
నీ కన్నీటి చుక్కే మున్నీరు నాకు
అది వెల్లువల్లే నను ముంచనీకు
ఏ కారుమబ్బు ఎటు కమ్ముకున్నా
మహా సాగరాలే నిను మింగుతున్నా
ఈ జన్మలోనా ఎడబాటు లేదు
పది జన్మలైన ముడే వీడిపోదు
అమరం అఖిలం మన ప్రేమా !

ప్రియతమా .. నా హృదయమా
ప్రియతమా .. నా హృదయమా
ప్రేమకే ప్రతిరూపమా
ప్రేమకే ప్రతిరూపమా
నా గుండెలో నిండిన గానమా
నను మనిషిగా చేసిన త్యాగమా !

ప్రియతమా .. నా హృదయమా
ప్రేమకే ప్రతిరూపమా !

 

2 comments:

this song written by acharya atreya garu please correec the name

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.