శనివారం, డిసెంబర్ 03, 2016

ఇచటే నేనిచటే...

రిథమ్ చిత్రంలోని ఒక మంచి పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ అవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : రిథమ్ (2000)
సంగీతం : ఏ.ఆర్.రెహమాన్ 
సాహిత్యం : వేటూరి
గానం : శంకర్ మహదేవన్
 
ఇచటే నేనిచటే నేనెదురు చూచి నిలిచా
తరమా నా తరమా నీ ఓర్పు గెలవ తలచా
ఇచటే నేనిచటే నేనెదురు చూచి నిలిచా
తరమా నా తరమా నీ ఓర్పు గెలవ తలచా
పులకింతే ప్రేమంటే.. పులకింతే ప్రియురాలా

ఇచటే ...

అక్టోబర్ మాసాన సందెవేళ వానొస్తే
వానవిల్లు గుండె తాకెనే
నాది ఏకాంతవాసమాయె దూరాన
ఆమె మాత్రం వానవిల్లు లాగా వచ్చెనే

అక్టోబర్ మాసాన సందెవేళ వానొస్తే
వానవిల్లు గుండె తాకెనే
నాది ఏకాంతవాసమాయె దూరాన
ఆమె మాత్రం వానవిల్లు లాగా వచ్చెనే

ఆమె కనులబాటలేవో.. 
ఉసురేకమాయెనేమో
ఆమె కనులబాటలేవో.. 
ఉసురేకమాయెనేమో
జతకు సుఖమనిపించే 
ఈ హృదయలయలొకటే
జతకు సుఖమనిపించే 
ఈ హృదయలయలొకటే
నేను ఆమె ఒకటిగా ఎదే పాలవెల్లువ కాగా

ఇచటే నేనిచటే నేనెదురు చూచి నిలిచా
తరమా నా తరమా నీ ఓర్పు గెలవ తలచా
పులకింతే ప్రేమంటే.. పులకింతే ప్రియురాలా

ఎండనైనా వేడినైనా
హీరోవచ్చి తాకగానే
పిల్లదానికెంత విసురూ
ఓహో చిచ్చుపెట్టు చిన్నదొచ్చి
హల్లో అంటూ చేతులిస్తే
తరుణి మోము కందిపోయే
అందగత్తె విడిచి వెళితే
నా జీవమిపుడు నిలిచే
అందగత్తె విడిచి వెళితే
నా జీవమిపుడు నిలిచే
చిన్నతగవొకటొస్తే
చిలకెగిరి పోయినదే
చిన్నతగవొకటొస్తే
చిలకెగిరి పోయినదే
మరల మరలి మనసుపడి
ఎదో ఆమె వచ్చినని తెలిసెలె..

ఇచటే

ఇచటే నేనిచటే నేనెదురు చూచి నిలిచా
తరమా నా తరమా నీ ఓర్పు గెలవ తలచా
పులకింతే ప్రేమంటే.. పులకింతే ప్రియురాలా

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.