ఆదివారం, డిసెంబర్ 18, 2016

మాధవా మాధవా...

శ్రీరామ కథ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ అవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : శ్రీరామ కథ (1968)
సంగీతం : ఎస్.పి.కోదండపాణి
సాహిత్యం : వీటూరి
గానం : సుశీల, ఘంటాసాల 

మాధవా మాధవా మాధవా మాధవా
నను లాలించరా నీ లీలా కేళీ చాలించరా 
బాలను నేను తాళగ లేనూ 
బాలను నేను తాళగ లేనూ 
అలసి మనసే తూలెరా...ఆఅ..ఆ

ఓ చెలీ... ఓ సఖీ.. ఈఈఈఈ

దాగని వలపు దాచగ లేను 
వేగమెరా రా దోచుకు పోరా 
దాగని వలపు దాచగ లేను 
వేగమెరా రా దోచుకు పోరా 
కన్నుల పూచే వెన్నెల పూలూ 
వాడక మునుపే చేకొనరా
కన్నుల పూచే వెన్నెల పూలూ 
వాడక మునుపే చేకొనరా

ఓ చెలీ... ఓ సఖీ.. ఈఈఈఈ
సదా నీ వాడనే అందాలా దేవీ అలుకేలనే 
సందిటిలోనా బందీ చేసీ 
సందిటిలోనా బందీ చేసీ 
సరగున నన్నే ఏలవే...ఏఏఏ
మాధవా మాధవా...ఆఆఅ...ఆఆఆ...
 
మేఘమాలికల డోలికలూగీ 
మేనులు మరిచి విహరించేమా..
మేఘమాలికల డోలికలూగీ 
మేనులు మరిచి విహరించేమా..
ఏకాంతముగా పువ్వుల దాగీ 
విశ్వప్రేమనే వివరించేమా.. ఆఅ..అ
ఏకాంతముగా పువ్వుల దాగీ 
విశ్వప్రేమనే వివరించేమా.. ఆఅ..అ
ఓ చెలీ... ఓ సఖీ.. ఈఈఈఈ

బ్రతుకున వరము ఈ పరవశము 
కమ్మని కల ఇదే కరిగించకుమా 
బ్రతుకున వరము ఈ పరవశము 
కమ్మని కల ఇదే కరిగించకుమా 
నీవే నేనుగ నేనే నీవుగా 
నిఖిలము నిండీ లీనమయేమా.. 

మాధవా మాధవా నను లాలించరా 
నీ లీలా కేళీ తేలించరా... 
ఓ చెలీ... ఓ సఖీ.. ఈఈఈఈ
సదా నీ వాడనే అందాలా దేవీ నీ వాడనే 
ఓ చెలీ... ఓ సఖీ.. ఆఆఆఆఆ
 
 

2 comments:

All time classic song. Set in Kalyana Vasantha ragam.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.