గురువారం, డిసెంబర్ 01, 2016

ప్రేమ ఎంత మధురం...

ఈ నెలలో ధనుర్మాసం మొదలయ్యేవరకూ కొన్ని విరహ గీతాలు తలచుకుందాం. ముందుగా అభినందన సినిమాలో సూపర్ హిట్ అయిన ఈ పాటతో మొదలు పెడదాం. ఈ పాట ఆడియోమాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ అవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : అభినందన (1988)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : ఆచార్య ఆత్రేయ
గానం : బాలు

ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం
ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం
చేసినాను ప్రేమ క్షీర సాగర మదనం.. 
మింగినాను హలాహలం..
ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం


ప్రేమించుటేనా నా దోషము
పూజించుటేనా నా పాపము
ఎన్నాళ్ళని ఈ యదలో ముల్లు
కన్నీరుగ ఈ కరిగే కళ్ళు
నాలోని నీ రూపము నా జీవనాధారము
అది ఆరాలి పోవాలి ప్రాణం

ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం
చేసినాను ప్రేమ క్షీర సాగర మదనం.. 
మింగినాను హలాహలం..
ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం


నేనోర్వలేను ఈ తేజము
ఆర్పేయరాదా ఈ దీపము
ఆ చీకటిలో కలిసేపోయి నా రేపటిని మరిచేపోయి
మానాలి నీ ధ్యానము కావాలి నే శూన్యము
అపుడాగాలి ఈ మూగ గానం

ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం
చేసినాను ప్రేమ క్షీర సాగర మధనం..
మింగినాను హలాహలం..
ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం

 

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.