వేదవ్యాస్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
వేదవ్యాస్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

శనివారం, ఆగస్టు 10, 2019

కలియుగ వైకుంఠ పురీ...

నమో వెంకటేశాయ లోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం: ఓం నమో వేంకటేశాయ (2017)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: వేదవ్యాస
గానం : బాలు

కలియుగ వైకుంఠ పురీ
సిరిగల వేంకట గిరీ
ఏరి కోరి ఈ గిరిపై వెలసినాడు శ్రీహరీ
కలియుగ వైకుంఠ పురీ
సిరిగల వేంకట గిరీ
ఏరి కోరి ఈ గిరిపై వెలసినాడు శ్రీహరీ

బ్రహ్మలోకమున వీణా నాదలోలుడైన
ఆ బ్రహ్మపై భృగువు ఆగ్రహించెను
పూజార్హత లేకుండునట్లు శపించెను

కైలాసమున కామ తాండవమున
మునిగితేలు శివపార్వతులను జూసి
శివమెత్తెను భృగువు అంగనా లోలుడా
ఇక నీకు లింగ పూజలే జరుగుగాక

ఓం నమో నారాయణాయ
ఓం నమో నారాయణాయ

వైకుంఠమున విష్ణు వైభోగము గాంచి
ఎగసి లక్ష్మీ నివాసమౌ హరి ఎదపై తన్నెను
మహాపరాధము చేసితి మన్నింపుము
నీ పాద సేవా భాగ్యము ప్రసాధింపుము
అని భృగుపదముల నదిమెను
అజ్ఞాన నేత్రమును చిదిమెను

ఈ అవమానమును నేను భరింపలేను
భృగుపాదము సోకిన నీ ఎదను నిలువజాలను
అని చిటపట లాడుచు సిరి హరిని వీడెను

శ్రీ సతి విరహితుడై శ్రీ వైకుంఠ విరక్తుడై
ఆదిలక్ష్మినే వెదకుచు అవనికి తరలెను
ఆదిలక్ష్మినే వెదకుచు అవనికి తరలెను

గోవింద గోవింద గోవింద (4)

హరి పాదముద్రల తిరుమల
ఆనంద నిలయమాయెను
కలియుగ వైకుంఠ పురీ
సిరిగల వేంకట గిరీ
ఏరి కోరి ఈ గిరిపై
శ్రీనివాసుడాయె హరీ

గోవిందా - గోవింద (3)

పుట్టలోన తపము
చేయు పురుషోత్తముడు
లక్ష్మీ లక్ష్మీ అని పరితపించెను
హారుడు అజుడు
హారుడు అజుడు
ఆవు దూడలుగా మారగా
క్షితి పతి పై క్షీర ధార కురిసెను
గోపాలుడు కోపముతో గొడ్డలి విసిరెను
అడ్డుకున్న పరమాత్ముడి
పసిడి నుదురు పగిలెను

కాలమంతా ఎదురుచూసి
కనులు కాయలు కాచెనయ్యా
కన్నయ్యా కాలమంతా ఎదురుచూసి
కనులు కాయలు కాచెనయ్యా
నా కలలు పండగా
నా కలలు పండగ
అమ్మాయని పిలువ రావయ్యా
పిలువ రావయ్యా

శ్రీనివాసుడే వకుళకు చిన్ని కృష్ణుడై తోచెను
వకుళ మాతృత్వపు మధురిమతో సేదతీర్చెను

కలియుగ వైకుంఠ పురీ
సిరిగల వేంకట గిరీ
ఏరి కోరి ఈ గిరి గోవిందుడాయె శ్రీహరీ
గోవిందుడాయె శ్రీహరీ
గోవిందా - గోవింద

ఆకాశ రాజపుత్రికా
అసమ సౌందర్య వల్లిక
అరవిరి నగవుల అలరులు కురియుచు
ఆటలాడుతూ ఉండగా
మత్తగజము తరిమెను
బేల మనసు బెదిరెను
వేటనాడగా వచ్చిన శ్రీహరి ఎదపై ఒదిగెను
గతజన్మల అనుబంధాలేవో
రాగవీణలుగ మ్రోగెను
అనురాగ రంజితములాయెను

వడ్డీకాసులిస్తానని కుబేరుణ్ణి వప్పించి
అప్పు చేసి పెండ్లి కొడుకు అయ్యే ఆది దేవుడు
అంగరంగ వైభవమున అఖిలలోక సమక్షమున
పద్మావతి పతి ఆయెను పరంధాముడు
సకల సురలు గార్వింపగ
శ్రీదేవిని భూదేవిని ఎదను
నిలుపు కున్నాడు వేంకటేశుడు
ఆపదమొక్కులవాడై అభయములిచ్చెడివాడై
ఆపదమొక్కులవాడై అభయములిచ్చెడివాడై
సప్తగిరుల వెలసినాడు శ్రీనివాసుడు
గోవింద గోవింద గోవింద ...
గోవిందా - గోవింద .. 


ఆదివారం, అక్టోబర్ 14, 2018

ఓంకారం...

ఈ రోజు సరస్వతి అలంకరణలో దర్శనమీయనున్న అమ్మవారికి నమస్కరించుకుంటూ జగద్గురు ఆదిశంకర చితంలోని ఒక చక్కని పాటను తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : జగద్గురు ఆది శంకర (2013)
సంగీతం : నాగ్ శ్రీవత్స
సాహిత్యం : వేదవ్యాస
గానం : శంకరమహదేవన్

ఓంకారం సకలకళా శ్రీకారం
చతుర్వేద సాకారం
చైతన్య సుధాపూరం
జ్ఞాన కమల కాసారం

ధ్యాన పరిమళాసారం
మధుర భక్తి సింధూరం
మహా భక్త మందారం
భవ భేరీ భాండారం


హృదయ శంఖ హుంకారం
ధర్మ ధనుష్టంకారం
జగత్ విజయ ఝంకారం
అద్వైత ప్రాకారం భజేహం

అండాకారాండ పిండ భాస్వత్
బ్రహ్మాండ భాండ నాదలయత్
బ్రహ్మ్యాత్మక నవ్య జీవనాధారం
వర్ణ రహిత వర్గమధిత
లలిత లలిత భావ లులిత భాగ్య
రజిత భోగ్య మహిత వసుధైక కుటిరం


కామితార్ధ బందురం
కళ్యాణ కందరం
సద్గుణైక మందిరం
సకలలోక సుందరం
పుణ్య వర్ణ పుష్కరం
దురిత కర్మ దుష్కరం

శుభకరం సుధాకరం
సురుచిరం సుదీపరం
భవకరం భవాకరం
త్రిఅక్షరం అక్షరం భజేహం


మాధవ మాయా మయ బహు
కఠిన వికట కంటక పద సంసార
కానన సుఖ యాన శకట విహారం

అష్టాక్షరీ ప్రహృష్ట పంచాక్షరీ విశిష్ట
మహా మంత్ర యంత్ర తంత్ర
మహిమాలయ గోపురం


ఘనగంభీరాంబరం
జంబూ భూభంబరం
నిర్మల యుగ నిర్గరం
నిరుపమాన నిర్జరం
మధుర భోగి కుంజరం
పరమ యోగి భంజరం
ఉత్తరం నిరుత్తరం మనుత్తరం
మహత్తరం మహాకరం మహాంకురం
తత్త్వమసీ తత్పరం
తధితరాత్త మోహరం
మృత్యోర్మమృతత్వకరం
అజరం అమరం
'మ' కారం 'ఉ' కారం 'అ' కారం
ఓం కారం అద్వైత ప్రాకారం 


సోమవారం, నవంబర్ 14, 2016

మహా ప్రాణ దీపం శివం శివం...

ఈరోజు కార్తీక పౌర్ణమి సోమవారం అదే కాక డెబ్బై ఏళ్ళ తర్వాత చంద్రుడు భూమికి అతి దగ్గరగా వచ్చి మరింత పెద్దగా ప్రకాశవంతంగా కనిపిస్తాడుట. అందుకే ఈ విశిష్టమైన రోజున ఆ పరమశివుని తలచుకుంటూ శ్రీ మంజునాథ సినిమా కోసం శంకరమహదేవన్ గారు గానం చేసిన ఈ అద్భుతమైన పాటను గుర్తు చేసుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ అవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : శ్రీ మంజునాథ
సంగీతం : హంసలేఖ
సాహిత్యం : శ్రీ వేదవ్యాస
గానం : శంకర్ మహదేవన్

ఓం
మహా ప్రాణ దీపం శివం శివం
మహోంకార రూపం శివం శివం
మహా సూర్య చంద్రాద్రి నేత్రం పవిత్రం
మహా ఘాడ తిమిరాంతకం సౌర గాత్రం
మహా కాంతి బీజం మహా దివ్య తేజం
భవానీ సమేతం భజే మంజునాథం

ఓం..ఓం..ఓం...
నమః శంకరాయచ మయస్కరాయచ
నమః శివాయచ శివతరాయచ భవహరాయచ

మహా ప్రాణ దీపం శివం శివం
భజే మంజునాథం శివం శివం

అద్వైత భాస్కరం అర్థ నారీశ్వరం
త్రిదశ హృదయంగమం చతురదధి సంగమం
పంచ భూతాత్మకం షట్ శత్రు నాశకం
సప్తస్వరేశ్వరం అష్ట సిద్ధీశ్వరమ్
నవరసమనోహారం దశ దిశా సువిమలం

ఏకాదశోజ్వలం ఏకనాధేశ్వరం
ప్రస్తుతివశంకరం ప్రణత జన కింకరం
దుర్జన భయంకరం సజ్జన శుభంకరం
ప్రాణిభవతారకం ప్రకృతిహిత కారకం
భువన భవ్య భవనాయకం భాగ్యాత్మకం రక్షకం
ఈశం సురేశం ఋషేశం పరేశం 
నటేశం గౌరీశం గణేశం భూతేశం

మహామాధుర పంచాక్షరీ మంత్ర మార్చ్యం
మహా హర్ష వర్ష ప్రవర్షం సుశీర్షం

ఓం
నమో హరాయచ సర్వ హరాయచ
పుర హరాయచ రుద్రాయచ భద్రాయచ
ఇంద్రాయచ నిత్యాయచ నిర్ నిద్రాయచ

మహా ప్రాణ దీపం శివం శివం
భజే మంజునాథం శివం శివం

ఢం ఢం ఢ
ఢం ఢం ఢ
ఢం ఢం ఢ
ఢం ఢం ఢ
ఢంకా నినాధ నవ తాండవాడంబరం
తధిమ్మి తకధిమ్మి దిధిమ్మి ధిమి ధిమ్మి 
సంగీత సాహిత్య సుమకమలమంబరం
ఓంకార హ్రీంకార శ్రీంకార ఐంకార 
మంత్రబీజాక్షరం మంజునాధేశ్వరం
ఋగ్వేదమాజ్యం ఎదుర్వేదవేద్యం
సామప్రతీతం మధర్మప్రభాతం
పురాణేతిహాసం ప్రసిద్యం విశుద్ధం
ప్రపంచైకసూత్రమ్ విరుద్ధం సుసిద్ధం

నకారం
మకారం
శికారం
వకారం
యకారం
నిరాకార సాకార సారం

మహాకాలకాలం మహానీల కంఠం
మహానందనందం మహాట్టాట్టహాసం
జటాజూట రంగైక గంగా సుచిత్రం
జ్వలత్ఉగ్ర నేత్రం సుమిత్రం సుగోత్రం
మహాకాశభాసుం మహాభానులింగం
మహావర్త్రువర్ణం సువర్ణం ప్రవర్ణం

సౌరాష్ట్రసుందరం సౌమనాధేశ్వరం
శ్రీశైల మందిరం శ్రీమల్లికార్జునం
ఉజ్జయినిపుర మహాకాళేశ్వరం
వైద్యనాదేశ్వరం మహా భీమేశ్వరం
అమరలింగేశ్వరం భామలింగేశ్వరం
కాశివిశ్వేశ్వరం పరంక్రిష్మేశ్వరం
త్ర్యంబాకాధీశ్వరం నాగలింగేశ్వరం
శ్రీ... కేదారలింగేశ్వరం

అగ్నిలింగాత్మకం జ్యోతిలింగాత్మకం
వాయులింగాత్మకం ఆత్మలింగాత్మకం
అఖిలలింగాత్మకం అగ్నిసోమాత్మకం

అనాదిం.. అమేయం.. అజేయం.. అచింత్యం..
అమోఘం.. అపూర్వం.. అనంతం.. అఖండం..

అనాదిం అమేయం అజేయం అచింత్యం
అమోఘం అపూర్వం అనంతం అఖండం

ధర్మస్థల క్షేత్ర పరపరంజ్యోతిం
ధర్మస్థల క్షేత్ర పరపరంజ్యోతిం
ధర్మస్థల క్షేత్ర పరపరంజ్యోతిం

ఓం

నమః సోమయచ సౌమ్యాయచ
భావ్యాయచ భాగ్యాయచ శాంతాయచ
శౌర్యాయచ యోగాయచ భోగాయచ
కాలాయచ కాంతాయచ రమ్యాయచ
గమ్యాయచ ఈశాయచ శ్రీశాయచ
శర్వాయచ సర్వాయచ


సోమవారం, జనవరి 11, 2016

రాధా మానస రాగ సుగంధా...

ఆ ఒక్కడు చిత్రంలోని ఓ అందమైన కృష్ణ గీతాన్ని ఈ రోజు తలచుకుందాం. సినిమాలో ఈ పాట సగమే ఉంది. పూర్తి పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.
 

చిత్రం : ఆ ఒక్కడు
సంగీతం : మణిశర్మ
సాహిత్యం : వేదవ్యాస రంగ భట్టాచార్య
గానం : డాక్టర్ నారాయణ్.

రాధా మానస రాగ సుగంధా కృష్ణా గోవిందా
గోపి యవ్వన పుష్ప మిళింద లీలా మకరందా
శ్రీ బృందావన మోహన మురళీ రవళి రసకందా
రారా గోకుల నంద ముకుందా రారా కరివరదా

రాధా మానస రాగ సుగంధా కృష్ణా గోవిందా
గోపి యవ్వన పుష్ప మిళింద లీలా మకరందా


మంచిని పెంచే మధుమయ హృదయా
వంచన తుంచే వరగుణ వలయా
మమతను పంచే సమతా నిలయా
భక్తిని ఎంచే బహుజన విజయా
మాయా ప్రభవా మాధవ దేవా
మహిమా విభవా మధుభావా
శ్రీ కృష్ణా మా తృష్ణా నీ పైనా

రాధా మానస రాగ సుగంధా కృష్ణా గోవిందా
గోపి యవ్వన పుష్ప మిళింద లీలా మకరందా


ధర్మము తరిగీ నలిగిన వేళ
చరలో చేరిన ఓ యదు వీరా
కళగా సాగే కరుణాధారా
పరమై వెలిగే వర మందారా
పదములు చూపే పరమోద్ధారా
భారము నీదే భాగ్యకరా
శ్రీ కృష్ణా మా తృష్ణా నీ పైనా

రాధా మానస రాగ సుగంధా కృష్ణా గోవిందా
గోపి యవ్వన పుష్ప మిళింద లీలా మకరందా
శ్రీ బృందావన మోహన మురళీ రవళి రసకందా
రారా గోకుల నంద ముకుంద రారా కరివరదా

రాధా మానస రాగ సుగంధా కృష్ణా గోవిందా
గోపి యవ్వన పుష్ప మిళింద లీలా మకరందా
  


 

బుధవారం, డిసెంబర్ 30, 2015

గోవిందుడే కోక చుట్టి...

కీరవాణి స్వరసారధ్యంలో వచ్చిన ఓ కమ్మని కన్నయ్య గీతాన్ని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : పాండురంగడు (2008)
సంగీతం : కీరవాణి
సాహిత్యం : వేదవ్యాస్
గానం : సునీత, కీరవాణి, మధు బాలకృష్ణ, బృందం

గోపాల బాలకృష్ణ గోకులాష్టమీ
ఆబాల గోపాల పుణ్యాల పున్నమి 
ముకుంద పదముల ముగ్గుల ఇల్లే బృందావని 
నంద నందనుడు నడచినచోటే నవ నందనవనీ..

గోపికా ప్రియ కృష్ణహరే 
నమో కోమల హృదయ కృష్ణహరే
వేవేల రూపాల వేదహరే 
నమో వేదాంగ దివ్యా కృష్ణ హరే 

ఆఆఆ.. ఆఆఆఆ....
గోవిందుడే కోక చుట్టి గోపెమ్మ వేషం కట్టి
ముంగోల చేత బట్టి వచ్చెనమ్మా
గోవిందుడే కోక చుట్టి గోపెమ్మ వేషం కట్టి
ముంగోల చేత బట్టి వచ్చెనమ్మా
నవ మోహన జీవన వరమిచ్చెనమ్మా
ఇకపై ఇంకెపుడు నీ చేయివిడిచి వెళ్లనని
చేతిలోన చెయ్యేసి ఒట్టేసెనమ్మా

దేవకీవసుదేవ పుత్ర హరే 
నమో పద్మ పత్రనేత్ర కృష్ణహరే
యదుకుల నందన కృష్ణహరే 
నమో యశోద నందన కృష్ణహరే 

ఎన్నాళ్ళకు ఎన్నాళ్ళకు
ఎన్నాళ్ళకు ఎన్నాళ్ళకు వెన్నుడొచ్చేనమ్మా .
ఎన్నెన్నో చుక్కల్లో నన్ను మెచ్చేనమ్మా
వెన్న పాలు ఆరగించి విన్నపాలు మన్నించి
వెన్న పాలు ఆరగించి విన్నపాలు మన్నించి
వెండివెన్నెల్లో ముద్దులిచ్చెనమ్మా
కష్టాల కడలి పసిడి పడవాయెనమ్మా
కళ్యాణ రాగ మురళి కళలు చిలికినమ్మా
మా కాపురాన మంచి మలుపు తిప్పెనమ్మా
వసుదైక కుటుంబమనే గీత చెప్పెనమ్మా

గోవర్ధనోద్దార కృష్ణహరే 
నమో గోపాల భూపాల కృష్ణహరే 
గోవింద గోవింద కృష్ణహరే 
నమో గోపిక వల్లభ కృష్ణహరే 

తప్పటడుగు తాండవాలు చేసెనాడమ్మా
తన అడుగుల ముగ్గులు చూసి మురిసి నాడమ్మా
మన అడుగున అడుగేసి మనతోనే చిందేసి
మన అడుగున అడుగేసి మనతోనే చిందేసి
మన తప్పటడుగులు సరి దిద్దినాడమ్మా
కంసారి సంసారిని కలిసిమెరిసేనమ్మా
కలకాల భాగ్యాలు కలిసోచ్చేనమ్మా
హరిపాదం లేని చోటు మరుభూమేనమ్మా
శ్రీ పాదం ఉన్నచోట సిరులు విరుయునమ్మా

ఆపదోద్దారక కృష్ణహరే 
నమో ఆనంద వర్ధక కృష్ణహరే 
లీలా మానుష కృష్ణహరే 
నమో ప్రాణ విలాస కృష్ణహరే 

ఆపదోద్దారక కృష్ణహరే 
నమో ఆనంద వర్ధక కృష్ణహరే 
లీలా మానుష కృష్ణహరే 
నమో ప్రాణ విలాస కృష్ణహరే 

గోవింద గోవింద కృష్ణహరే 
నమో గోపిక వల్లభ కృష్ణహరే 
గోవర్ధనోద్దార కృష్ణహరే 
నమో గోపాల భూపాల కృష్ణహరే 

గోవింద గోవింద కృష్ణహరే 
నమో గోపిక వల్లభ కృష్ణహరే 
గోవింద గోవింద కృష్ణహరే 
నమో గోపిక వల్లభ కృష్ణహరే 


నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.