శనివారం, ఆగస్టు 10, 2019

కలియుగ వైకుంఠ పురీ...

నమో వెంకటేశాయ లోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం: ఓం నమో వేంకటేశాయ (2017)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: వేదవ్యాస
గానం : బాలు

కలియుగ వైకుంఠ పురీ
సిరిగల వేంకట గిరీ
ఏరి కోరి ఈ గిరిపై వెలసినాడు శ్రీహరీ
కలియుగ వైకుంఠ పురీ
సిరిగల వేంకట గిరీ
ఏరి కోరి ఈ గిరిపై వెలసినాడు శ్రీహరీ

బ్రహ్మలోకమున వీణా నాదలోలుడైన
ఆ బ్రహ్మపై భృగువు ఆగ్రహించెను
పూజార్హత లేకుండునట్లు శపించెను

కైలాసమున కామ తాండవమున
మునిగితేలు శివపార్వతులను జూసి
శివమెత్తెను భృగువు అంగనా లోలుడా
ఇక నీకు లింగ పూజలే జరుగుగాక

ఓం నమో నారాయణాయ
ఓం నమో నారాయణాయ

వైకుంఠమున విష్ణు వైభోగము గాంచి
ఎగసి లక్ష్మీ నివాసమౌ హరి ఎదపై తన్నెను
మహాపరాధము చేసితి మన్నింపుము
నీ పాద సేవా భాగ్యము ప్రసాధింపుము
అని భృగుపదముల నదిమెను
అజ్ఞాన నేత్రమును చిదిమెను

ఈ అవమానమును నేను భరింపలేను
భృగుపాదము సోకిన నీ ఎదను నిలువజాలను
అని చిటపట లాడుచు సిరి హరిని వీడెను

శ్రీ సతి విరహితుడై శ్రీ వైకుంఠ విరక్తుడై
ఆదిలక్ష్మినే వెదకుచు అవనికి తరలెను
ఆదిలక్ష్మినే వెదకుచు అవనికి తరలెను

గోవింద గోవింద గోవింద (4)

హరి పాదముద్రల తిరుమల
ఆనంద నిలయమాయెను
కలియుగ వైకుంఠ పురీ
సిరిగల వేంకట గిరీ
ఏరి కోరి ఈ గిరిపై
శ్రీనివాసుడాయె హరీ

గోవిందా - గోవింద (3)

పుట్టలోన తపము
చేయు పురుషోత్తముడు
లక్ష్మీ లక్ష్మీ అని పరితపించెను
హారుడు అజుడు
హారుడు అజుడు
ఆవు దూడలుగా మారగా
క్షితి పతి పై క్షీర ధార కురిసెను
గోపాలుడు కోపముతో గొడ్డలి విసిరెను
అడ్డుకున్న పరమాత్ముడి
పసిడి నుదురు పగిలెను

కాలమంతా ఎదురుచూసి
కనులు కాయలు కాచెనయ్యా
కన్నయ్యా కాలమంతా ఎదురుచూసి
కనులు కాయలు కాచెనయ్యా
నా కలలు పండగా
నా కలలు పండగ
అమ్మాయని పిలువ రావయ్యా
పిలువ రావయ్యా

శ్రీనివాసుడే వకుళకు చిన్ని కృష్ణుడై తోచెను
వకుళ మాతృత్వపు మధురిమతో సేదతీర్చెను

కలియుగ వైకుంఠ పురీ
సిరిగల వేంకట గిరీ
ఏరి కోరి ఈ గిరి గోవిందుడాయె శ్రీహరీ
గోవిందుడాయె శ్రీహరీ
గోవిందా - గోవింద

ఆకాశ రాజపుత్రికా
అసమ సౌందర్య వల్లిక
అరవిరి నగవుల అలరులు కురియుచు
ఆటలాడుతూ ఉండగా
మత్తగజము తరిమెను
బేల మనసు బెదిరెను
వేటనాడగా వచ్చిన శ్రీహరి ఎదపై ఒదిగెను
గతజన్మల అనుబంధాలేవో
రాగవీణలుగ మ్రోగెను
అనురాగ రంజితములాయెను

వడ్డీకాసులిస్తానని కుబేరుణ్ణి వప్పించి
అప్పు చేసి పెండ్లి కొడుకు అయ్యే ఆది దేవుడు
అంగరంగ వైభవమున అఖిలలోక సమక్షమున
పద్మావతి పతి ఆయెను పరంధాముడు
సకల సురలు గార్వింపగ
శ్రీదేవిని భూదేవిని ఎదను
నిలుపు కున్నాడు వేంకటేశుడు
ఆపదమొక్కులవాడై అభయములిచ్చెడివాడై
ఆపదమొక్కులవాడై అభయములిచ్చెడివాడై
సప్తగిరుల వెలసినాడు శ్రీనివాసుడు
గోవింద గోవింద గోవింద ...
గోవిందా - గోవింద .. 


2 comments:

పిక్ అద్భుతమండి..స్వామి వారికీ, అమ్మవారికీ అభిషేకం..

అవునండీ.. ఈ పిక్ నాక్కూడా చాలా నచ్చింది.. థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.