సోమవారం, ఆగస్టు 05, 2019

ఏమొకొ...

అన్నమయ్య చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : అన్నమయ్య (1958)
సంగీతం : కీరవాణి
సాహిత్యం : అన్నమయ్య
గానం : బాలు

గోవింద
నిశ్చలానంద మందార మకరంద
నీ నామం మధురం
నీ రూపం మధురం
నీ సరస శృంగారకేళి
మధురాతి మధురం స్వామి
ఆహ..

ఏమొకొ ఏమొకొ చిగురుటధరమున
యెడ నెడ కస్తురి నిండెను
భామిని విభునకు వ్రాసిన పత్రిక కాదు కదా
ఏమొకొ ఏమొకొ చిగురుటధరమున
యెడ నెడ కస్తురి నిండెను

కలికి చకోరాక్షికి కడ కన్నులు కెంపై తోచిన
చెలువంబిప్పుడిదేమొ చింతింపరె చెలులు
నలువున ప్రాణేశ్వరుపై నాటిన ఆ కొన చూపులు
నలువున ప్రణేశ్వరుపై నాటిన ఆ కొన చూపులు
నిలువున పెరుకగ నంటిన నేత్తురు కాదు కదా

ఏమొకొ ఏమొకొ చిగురుటధరమున
యెడ నెడ కస్తురి నిండెనూ.. ఆ ఆ

జగడపు చనవుల జాజర
సగినల మంచపు జాజర
జగడపు చనవుల జాజర

మొల్లలు తురుముల
ముడిచిన బరువున
మొల్లపు సరసపు మురిపెమున
జల్లన పుప్పొడి జారగ
పతిపై జల్లేరతివలు జాజర

జగడపు చనవుల జాజర
సగినల మంచపు జాజర
జగడపు చనవుల జాజర

బారపు కుచములపైపై
కడుసింగారం నెరపెడు గంద వొడి
చేరువ పతిపై చిందగ పడతులు
సారెకు చల్లేరు జాజర 
 
జగడపు చనవుల జాజర
సగినల మంచపు జాజర
జగడపు చనవుల జాజర

బింకపు కూటమి పెనగెటి చెమటల
పంకపు పూతల పరిమళము
వేంకటపతిపై వెలదులు నించేరు
సంకుమదంబుల జాజర

జగడపు చనవుల జాజర
సగినల మంచపు జాజర
జగడపు చనవుల జాజర
సగినల మంచపు జాజర
జగడపు చనవుల జాజర
జగడపు చనవుల జాజర
జగడపు చనవుల జాజర

2 comments:

ఈ కీర్తన శోభారాజు గారి వెర్షన్ చాలా ఇష్టమండీ

నిజమేనండీ ఆవిడ గానం చేసిన కీర్తనలు చాలా బావుంటాయి.. థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.