శుక్రవారం, ఆగస్టు 16, 2019

ధాన్య లక్ష్మి వచ్చిందీ...

భక్తతుకారం చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : భక్తతుకారం (1973)
సంగీతం : ఆదినారాయణరావు
సాహిత్యం : వీటూరి
గానం : సుశీల

ధాన్య లక్ష్మి వచ్చిందీ మా ఇంటికి
మా కరువు తీరింది ఈ నాటికి
మా లక్ష్మి వచ్చింది మా ఇంటికి
మా కరువు తీరింది ఈ నాటికి

పాల సంద్రంలోన పుట్టిన నా తల్లి
పాల సంద్రంలోన పుట్టిన నా తల్లి
భాగ్యాలు కరుణించు ఓ !కల్పవల్లి

ధాన్య లక్ష్మి వచ్చిందీ మా ఇంటికి
మా కరువు తీరింది ఈ నాటికి

సువ్వి సువ్వన్నాలే సువ్వన్న లాలే ఓ యమ్మా!
సూరమ్మ మా వారు ఎప్పుడొస్తారే
ఆ హు ...ఆహు ..అహుం..

ఏన్నిభోగాలున్న ఎంత భాగ్యమున్న ఓ యమ్మా !
మగనికన్నా ధనముకాదమ్మా !
ఆహుం...ఆహుం ...అహుం ...

పిల్లల ఆకలి తల్లి ఎరుగును కానీ ఓ యమ్మా !
అడవుల్లో తిరిగే ఆయ్యే ఏమిఎరుగు
ఆ అయ్య ఏమి ఎరుగు
ఆహుం ...ఆహుం ...ఆహుం ....

బ్రమ్మకే పాయసం
జాజిరి జాజిరి జాజిరి
నీ ఇల్లే కస్తూరి లాహిరి
మా ఇల్లే కస్తూరి లాహిరి
జాజిరి జాజిరి జాజిరి
నీ ఇల్లే కస్తూరి లాహిరి
మా ఇల్లే కస్తూరి లాహిరి

చూడబోతే తాను సుందరీ
ఆడమంటే చాలు అల్లరీ
చూడబోతే తాను సుందరీ
ఆడమంటే చాలు అల్లరీ
కట్టుకున్న వాడు నంగిరీ
సంతానమే బీర పందిరీ
కట్టుకున్న వాడు నంగిరీ
సంతానమే బీర పందిరీ
వండుకున్నమ్మకు ఆయాసం 
దండుకున్నమ్మకే పాయసం
వండుకున్నమ్మకు ఆయాసం 
దండుకున్నమ్మకే పాయసం

జాజిరి జాజిరి జాజిరి
నీ ఇల్లే కస్తూరి లాహిరి
మా ఇల్లే కస్తూరి లాహిరి


2 comments:

చిన్నదే ఐనా ఈ పాట బావుంటుంది..

అవునండీ.. లిరిక్ కూడా సరదాగా ఉంటుంది :-) థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.