బుధవారం, ఆగస్టు 28, 2019

ఘల్లు ఘల్లుమని...

సతీ సక్కుబాయి చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : సతీసక్కుబాయి (1965)
సంగీతం : పి.ఆదినారాయణరావు
సాహిత్యం : సముద్రాల రాఘవాచార్య
గానం : సుశీల

ఘల్లు ఘల్లుమని గజ్జెలు మ్రోయగా
గంతులు వేయుచు రారా
వెన్న దొంగ నీ వన్నె చిన్నెలతో
కన్నుల పండుగ చేయరారా కృష్ణా
 
నందగోపాల దయచేయరా
నయగారాలు చూపించరా
నవ్య నాట్యాల మురిపించరా

వాలుచూపుల బంధాలు వేసి
గోపకాంతల హృదయాలు దోచే
నల్లనయ్యా నవ్వుచు రారా
చిన్ని బొజ్జతో శిఖిపించముతో
చిందులు వేయుచు రారా
ముద్దులొలుకు చిన్నారి మోవితో
మురళీ గానము చేయరారా కృష్ణా
 
నంద గోపాల దయచేయరా
నయగారాలు చూపించరా
నవ్య నాట్యాల మురిపించరా

గోపబాలుర గోడాలకించీ
పాపి కాళీయఫణిపైన నిలచి
తాండవమాడే గోపకిషోరా
 
ఘల్లు ఘల్లుమని గజ్జెలు మ్రోయగా
ఘల్లు ఘల్లుమని గజ్జెలు మ్రోయగా
గంతులు వేయుచు రారా
వెన్న దొంగ నీ వన్నె చిన్నెలతో
కన్నుల పండుగ సేయరారా కృష్ణా

నంద గోపాల దయచేయరా
నయగారాలు చూపించరా
నవ్య నాట్యాల మురిపించరా


2 comments:

చిన్ని కృష్ణుడు కనుల ముందు తిరుగాడుతున్నట్టే ఉంటుందీ పాట..

అవునండీ ఆదినారాయణరావు గారి సంగీతంలోని మహత్యం.. థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారూ..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.